‘అతని’తో ఫోన్ లో మాట్లాడిన చంద్రబాబు?




పార్టీ నుంచి వెళ్లిపోయినవారికి ఆహ్వానం

నిజామాబాద్ సభను విజయవంతం చేసేందుకు టీడీపీ ప్రణాళికలు రచిస్తోంది. ఈనెల చివరివారంలో నిజామాబాద్ లో లక్ష మందితో సభ నిర్వహించడానికి ఏర్పాట్లు మొదలుపెట్టింది. త్వరలోనే సభ జరిగే తేదీని ఖరారు చేయబోతున్నారు. జిల్లాలో విస్త్రతస్థాయి సమావేశం నిర్వహించి గతంలో టీడీపీ నుంచి ఇతర పార్టీలకు వెళ్లిపోయినవారిని ఆహ్వానించి వారికి పదవులు కట్టబెట్టడానికి పార్టీ సిద్ధమవుతోంది.

తీన్మార్ తో మాట్లాడిన కాసాని

తీన్మార్ తో మాట్లాడిన కాసాని

పార్టీ అధ్యక్షుడు కాసాని తాజాగా తీన్మార్ మల్లన్నతో భేటీ అయ్యారు. ఒకరోజంతా సుదీర్ఘంగా చర్చించారు. చంద్రబాబునాయుడు మల్లన్నతో ఫోన్ లో మాట్లాడినట్లు తెలుస్తోంది. మల్లన్నతో చేతులు కలపాలని, పార్టీ బలోపేతానికి కలిసికట్టుగా కృషిచేయాలని జ్ఞానేశ్వర్‌కు సూచించారు. తీన్మార్ మల్లన్న గతంలో బీజేపీలో ఉండేవారు. హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో ఈటెల రాజేందర్ విజయం కోసం పనిచేశారు. తర్వాత ఆ పార్టీకి దూరం జరిగారు. వివాదాస్పద నిర్ణయాలు తీసుకుంటూ నిత్యం వార్తల్లో నిలిచే తీన్మార్ మల్లన్నతో తెలుగుదేశం పార్టీ ఎలా వ్యవహరించబోతోందనేది ఆసక్తికరంగా మారింది.




ప్రత్యామ్నాయ కూటమిని ఏర్పాటు చేయాలని..

ప్రత్యామ్నాయ కూటమిని ఏర్పాటు చేయాలని..

తెలంగాణలో తనకున్న ఓటుబ్యాంకు భారతీయ జనతాపార్టీకి చాటిచెప్పడంద్వారా ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఆ పార్టీతో పొత్తు పెట్టుకొని పనిచేయాలని చంద్రబాబు భావిస్తున్నారు. బీజేపీ నుంచి కొంతవరకు సహకారం ఉంటేనే వచ్చే ఎన్నికల్లో జగన్ ను ఓడించడం సులభమవుతుందని, లేదంటే నిలవరించడం కష్టమని భావిస్తున్నారు. కొద్దిరోజుల క్రితం భారతీయ జనతాపార్టీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ మాట్లాడుతూ తెలంగాణలో ఎవరితోను పొత్తుండదని స్పష్టతనిచ్చారు. టీడీపీతో కలిస్తే నష్టం జరుగుతుందనే భావనలో బండి ఉన్నారు. దీంతో ఎవరినైనా కలుపుకొని ఎన్నికలకు వెళ్లడంతోపాటు ప్రత్యామ్నాయ కూటమిని ఏర్పాటు చేయాలని తెలుగుదేశం పార్టీ యోచనగా ఉంది.

Source link

Spread the love

Leave a Comment