[ad_1]

అయ్యప్ప స్వామిపై బైరి నరేష్ అనుచిత వ్యాఖ్యల వీడియో వైరల్
నాస్తికుడైన బైరి నరేష్ ఓ సమావేశంలో అయ్యప్ప స్వామి పై అనుచిత వ్యాఖ్యలు చేశారు. డిసెంబర్ 19వ తేదీన వికారాబాద్ జిల్లా రావులపల్లి లో జరిగిన సభలో అయ్యప్ప స్వామి పై నరేష్ తీవ్ర వ్యాఖ్యలు చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక ఈ వీడియోను చూసిన అయ్యప్ప భక్తులు, హిందూ సంఘాల నాయకులు, బైరి నరేష్ ను అరెస్ట్ చేసి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. పెద్ద ఎత్తున ఆందోళనలకు శ్రీకారం చుట్టారు.

పరారీలో బైరి నరేష్.. పోలీసుల గాలింపు
వివిధ పోలీస్ స్టేషన్లలో బైరి నరేష్ పై కేసులు నమోదు చేస్తున్నారు. కొడంగల్ పోలీస్ స్టేషన్ లో నరేష్ పై కేసు నమోదు అయిన తర్వాత అతను కనిపించకుండా పోయాడు. ప్రస్తుతం పరారీలో వున్న బైరి నరేష్ ను అరెస్ట్ చేయడం కోసం పోలీసులు పెద్ద ఎత్తున గాలింపు చేపట్టారు. నాలుగు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి పోలీసులు నరేష్ ఆచూకీ కోసం గాలింపు చేస్తున్నారు. నిజామాబాద్, సిద్దిపేట, కరీంనగర్, హైదరాబాద్ లో బైరి నరేష్ కోసం పోలీసుల గాలింపు కొనసాగుతోంది.

నరేష్ పై పీడీ యాక్ట్ నమోదు చెయ్యాలని అయ్యప్ప స్వాముల డిమాండ్
గత మూడు రోజులుగా బైరి నరేష్ పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. నరేష్ పై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటుగా పీడీ యాక్ట్ కూడా నమోదు చేయాలని పెద్ద ఎత్తున అయ్యప్ప స్వామి భక్తులు డిమాండ్ చేస్తున్నారు. అంతేకాదు బైరి నరేష్ యూట్యూబ్ ఛానల్ కూడా నిషేధించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే రాష్ట్రవ్యాప్తంగా బైరి నరేష్ వ్యాఖ్యల పైన మండిపడుతున్న అయ్యప్ప భక్తులు జిల్లాల వారీగా నిరసనలు చేస్తున్నారు. నిన్నటికి నిన్న బషీర్ బాగ్ లోని సిటీ పోలీస్ కమిషనర్ కార్యాలయం వద్ద అయ్యప్ప భక్తులు నిరసనకు దిగారు.

నరేష్ కోసం గాలిస్తున్నామన్న పోలీసులు
మతపరమైన మనోభావాలను టార్గెట్ చేయడం, హిందూ దేవుళ్ళని అవమానించేలా మాట్లాడటం, అవహేళన చేయడం అలవాటుగా మారిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంతవరకు పోలీసులు నరేష్ ను అరెస్ట్ చేయకపోవడాన్ని అయ్యప్ప భక్తులు ప్రశ్నిస్తున్నారు. ఇదిలా ఉంటే నరేష్ పై కేసు నమోదు చేసినట్టు, అయితే అతను ఇంకా పరారీ లోనే ఉన్నట్టు, అతని కోసం గాలింపు చేపట్టినట్లు పోలీసు అధికారులు వెల్లడించారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.

బైరి నరేష్ వ్యాఖ్యలను ఖండించిన ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి
ఇదిలా ఉంటే తాజాగా అయ్యప్ప స్వామిపై భైరి నరేష్ అనే వ్యక్తి చేసిన అనుచిత వాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నా మని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి పేర్కొన్నారు. ఇటీవల జరిగిన కొండగల్ సభలో నాస్తిక సమాజం సంఘ సభ్యులు బైరి నరేష్ అయ్యప్ప స్వామి జననం గూర్చి అనుచిత వ్యాఖ్యలు చేసి, హిందూ సమాజం యొక్క మనోభావాలను దెబ్బ తీసేవిధంగా ప్రవర్తించడాన్ని తీవ్రంగా ఖండించిన ఆయన దేశ పౌరులంతా రాజ్యాంగబద్ధంగా వ్యవరించాలని, అన్ని మతాల పట్ల సామరస్యంతో పాటు, పరస్పర గౌరవాన్ని కల్గి ఉండాలని కోరారు. అనుచిత వాఖ్యలు చేసిన సదరు వ్యక్తిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
[ad_2]
Source link