ఆ ఎమ్మెల్యేలతో తేల్చుడే- రంగంలోకి సీఎం జగన్ : ఆనం కోసం ఎంపీ రాయబారం..!!




అసమ్మతి- విభేదాలపై సీఎం సీరియస్

అసమ్మతి- విభేదాలపై సీఎం సీరియస్

ఎన్నికలకు సిద్దమవుతున్న వేళ అసమ్మతి- విభేదాలు కనిపిస్తున్న నియోజకవర్గాలపై సీఎం రంగంలోకి దిగారు. ఆ నియోజకవర్గాల పైన ఇప్పటికే పూర్తి సమాచారం సేకరించారు. సరిదిద్దుకుంటారా..తానే నిర్ణయం తీసుకోమంటారా అనే విధంగా చర్యలకు సిద్దం అవుతున్నారు. ప్రతిపక్షాలకు అవకాశం ఇచ్చే విధంగా పార్టీలో ఎవరు వ్యవహరించినా సహించేది లేదని సీఎం స్పష్టం చేస్తున్నారు.

అందులో భాగంగా తాజాగా సీనియర్ నేత ఆనం చేసిన వ్యాఖ్యల ఫలితంగా, ఆయన్ను కాదని రాం కుమార్ రెడ్డికి ఇంఛార్జ్ బాధ్యతలు అప్పగించిన విషయాన్ని పార్టీ నేతలు గుర్తు చేస్తున్నారు. ఇప్పటికే వివాదాలు కొనసాగుతున్న నియోజకవర్గాల పై పార్టీ బాధ్యులు సీఎంకు నివేదికలు ఇచ్చారు. అందులో సీనియర్ ఎమ్మెల్యేలు ఉన్నారు. వారితో రోజుకో నియోజకవర్గం చొప్పున సీఎం సమీక్షించి నిర్ణయాలకు సిద్దం అవుతున్నారు.




మందలింపులు - చర్యలు

మందలింపులు – చర్యలు

వైసీపీ ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా కొన్ని నియోజకవర్గాల్లో అసమ్మతి కనిపిస్తోంది. కొన్ని చోట్ల ఎమ్మెల్యేల తీరు పార్టీ నేతలతో సరిగ్గా ఉండటం లేదు. ఈ మొత్తం పరిస్థితులపై సీఎం సరిదిద్దే చర్యలు ప్రారంభించారు. ఇప్పటికే మైలవరం, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యేలు – నేతలతో సీఎం జగన్ సమావేశమయ్యారు. వారికి చెప్పాల్సింది స్పష్టం చేసారు.

ఇప్పుడు అదే తరహాలో అంతర్గత విభేదాలు కనిపిస్తున్న నియోజకవర్గాల నేతలతో సమావేశం కానున్నారు. ముందుగా నందికొట్కూరుతో ప్రారంభించనున్నారు. ఆ నియోజకవర్గాల జాబితాలో నగరి, తాడికొండ, పాయకరావు పటే, ఎలమంచిలి, గూడూరు, గిద్దలూరు, పెనుకొండ, ఉరవకొండ, గన్నవరం వంటి నియోజకవర్గాలు ఉన్నట్లు సమాచారం. నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితిని వివరిస్తూనే.. పార్టీ కోసం పని చేసిన వారికి గుర్తింపు.. వచ్చే ఎన్నికలకు సంబంధించి సీఎం జగన్ వారికి దిశా నిర్దేశం చేయనున్నట్లు తెలుస్తోంది.




ఆనం కోసం ఎంపీ రాయబారం - ఫలించేనా

ఆనం కోసం ఎంపీ రాయబారం – ఫలించేనా

సీనియర్ ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి ప్రభుత్వం పైన వరుసగా వ్యతిరేక వ్యాఖ్యలు చేసారు. ఫలితంగా ఆనం ప్రాతినిధ్యం వహిస్తున్న వెంకటగిరి నియోజకవర్గంలో నేదురుమల్లి రాం కుమార్ రెడ్డిని పార్టీ ఇంఛార్జ్ గా నియమించారు. ఆనం పార్టీని వీడే ఆలోచనలోనే ఈ విధంగా వ్యాఖ్యలు చేస్తున్నారనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

అయితే, వచ్చే ఎన్నికల్లో ప్రతీ నియోజకవర్గం కీలకం కావటంతో అదే జిల్లాకు చెందిన ఒక ఎంపీ ముఖ్యమంత్రి వద్ద ఆనం అంశం పైన చర్చించినట్లు తెలుస్తోంది. తదుపరి చర్యలు వద్దని కోరినట్లు సమాచారం. ముఖ్యమంత్రితో సమావేశం అయ్యేందుకు ఆనంకు అవకాశం ఇవ్వాలని ప్రతిపాదించినట్లు చెబుతున్నారు. అయితే, ముఖ్యమంత్రి ఇప్పుడు ఆనం విషయంలో ఏం నిర్ణయం తీసుకుంటారు…అప్పాయింట్ మెంట్ ఇస్తారా లేదా అనేది ఆసక్తి కరంగా మారుతోంది.




Source link

Spread the love

Leave a Comment