హవాలా కేసులో పవన్ కల్యాణ్..
జనసేనాని పవన్ పైన మంత్రి దాడిశెట్టి రాజా కీలక వ్యాఖ్యలు చేసారు. రూ 1800 కోట్లు పోలాండ్ కు హవాలా చేస్తూ సాక్ష్యాధారాలతో పట్టుబడ్డారనే ప్రచారం సాగుతోందని చెప్పుకొచ్చారు. పవన్ కల్యాణ్ పడుతున్న తాపత్రయం మొత్తం చం్దరబాబు కోసమేనని పేర్కొన్నారు. సవాళ్లు విసురుతున్న పవన్ తనను ఎక్కడకు రమ్మంటే అక్కడకు వస్తానని.. పీకలు పిసికేస్తావా అని ప్రశ్నించారు. ఎంతమంది కలిసినా జగన్ ను ఎదుర్కొని ఓడించలేరని ధీమా వ్యక్తం చేసారు. కాపు సామాజిక వర్గం మొత్తం పవన్ చేస్తున్న చేష్టలు గమనిస్తోందని చెప్పుకొచ్చారు. రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమాన్ని పవన్ తక్కువ చేసి మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేసారు.

చంద్రబాబుకు కాపులను అప్పగించారు
పవన్ కల్యాణ్ తాను భీమ్లా నాయక్ సినిమా కారణంగా 30 కోట్లు నష్టపోయానని చెబుతున్నారని.. సినిమా ప్రొడక్షన్ రూ 20 కోట్లు దాటనప్పుడు రూ 30 కోట్ల నష్టం ఎలా వస్తుందని ప్రశ్నించారు. ఎవరెవరితో పొత్తులతో వచ్చినా..తాము ఒంటరిగానే పోటీ చేస్తామని దాడిశెట్టి రాజా స్పష్టం చేసారు. పవన్ కల్యాణ్ తాను మాట్లాడుతున్న బాష అదుపులో పెట్టుకోవాలని రాజా హెచ్చరించారు. కులాల వార రిజర్వేషన్లు లేనప్పుడు ఇక వర్గానికి ఎలా ఇస్తారని ప్రశ్నించారు. కేంద్రం కులాల వారీగా రిజర్వేషన్లు ఇవ్వచ్చని చెబితే రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. జగన్ సీఎం అయిన తరువాత ఏడాదికి రూ 15 వేల కోట్ల చొప్పున పెట్టుబడులు వచ్చాయని వివరించారు.

కాపు ప్రయోజనాలు దెబ్బ తింటాయి..
కాపు రిజర్వేషన్ల గురించి మంత్రి రాజా కీలక వ్యాఖ్యలు చేసారు. ఆర్దిక వెసులుబాటు ను పరిగణలోకి తీసుకుంటే కాపులకు 7 శాతం రిజర్వేషన్లు దక్కుతాయని మంత్రి చెప్పుకొచ్చారు. అయిదు శాతం రిజర్వేషన్లు ఇస్తే కాపుల ప్రయోజనాలు దెబ్బ తింటాయని వివరించారు. వైఎస్సార్ ను ఎదుర్కొన్నానని పవన్ చెప్పటాని మంత్రి రాజా తప్పు బట్టారు. వైఎస్సార్ దెబ్బకు 2009లో ప్రజారాజ్యం అడ్రస్ లేకుండా పోయిందని చెప్పుకొచ్చారు. వైఎస్సార్ పేరు పవన్ కు ప్రస్తావించే అర్హత లేదన్నారు. ఇప్పుడు వైసీపీ దెబ్బకు జనసేనకు నాడు ప్రజారాజ్యం కు ఎదురైన పరిస్థితులే వస్తాయని రాజా చెప్పుకొచ్చారు.