ఇన్వెస్టర్ల తియ్యటి వేడుక.. లక్షను రూ.10 లక్షలు చేసిన స్టాక్.. మీరూ కొనే ఉంటారు..
తియ్యటి వేడుక..

తియ్యటి వేడుక..

కంపెనీ ఇన్వెస్టర్లకు మంచి రాబడిని అందించిందనట్లయితే అది తప్పకుండా తియ్యటి వేడుకే. ఇప్పుడు మనం మాట్లాడుకునేది చక్కెర తయారీ రంగంలోని కంపెనీ షేర్ల గురించే. ఇది గత ఏడాది కాలంలో తన ఇన్వెస్టర్లకు అద్భుతమైన రాబడులను అందించింది. ఏడాది కాలంలో కంపెనీ 240 శాతం రాబడిని అందించింది. అలాగే ఆరు నెలల కాలాన్ని పరిశీలిస్తే 115 శాతం రిటర్న్ లభించింది.

కంపెనీ వివరాలు..

కంపెనీ వివరాలు..

ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్నది ఉగర్ షుగర్ కంపెనీ గురించే. ఏడాది కాలంలో కంపెనీ షేర్ ధర రూ.30 నుంచి దాదాపుగా రూ.100ను దాటింది. దీంతో కంపెనీలో ఇన్వెస్ట్ చేసిన వారి సంపద మూడు రెట్ల కంటే ఎక్కువగా మారింది. అలా కంపెనీ పెట్టుబడిదారులకు ఊహించని లాభాలను అందించి మల్టీబ్యాగర్ రిటర్న్స్ అందించింది. ఈ క్రమంలో ఉగార్ షుగర్ షేర్ల 52 వారాల గరిష్ఠ స్థాయి రూ.116 వద్ద ఉండగా.. షేర్ 52 వారాల కనిష్ఠ ధర రూ.30.30గా ఉంది.
లిక్కర వ్యాపారంలో..

లిక్కర వ్యాపారంలో..

జనవరి 4, 2022న బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజ్ లో కంపెనీ షేర్ రూ.105.25 వద్ద ట్రేడవుతున్నాయి. ప్రస్తుతం కంపెనీ మార్కెట్ క్యాప్ దాదాపుగా రూ.1,185 కోట్లుగా ఉంది. గడచిన ఐదు రోజులుగా కంపెనీ షేర్ 12 శాతం రాబడిని అందించి కొత్త సంవత్సరంలో ఇన్వెస్టర్లను సంతోషంలో ముంచేసింది. ఈ కంపెనీ 1939లో స్థాపించబడింది. ఈ కంపెనీకి ఆల్కహాల్ ఇండస్ట్రీలోనూ వ్యాపారాలు ఉన్నాయి. ప్రీమియం లిక్కర్ బ్రాండ్లను కంపెనీ కలిగి ఉంది. కంపెనీ సొంతంగా విద్యుత్ తయారీ 44 మెగావాట్ల పవర్ ప్లాంట్ కూడా కలిగి ఉంది.

రెండేళ్లుగా షేర్ పనితీరు..

రెండేళ్లుగా షేర్ పనితీరు..

2 ఏళ్ల కాలంలో Ugar షుగర్ స్టాక్ తన ఇన్వెస్టర్లకు 530% రాబడిని అందించింది. జనవరి 1,2021న BSEలో షుగర్ కంపెనీ షేర్లు రూ.16.75 వద్ద ట్రేడ్ అవుతున్నాయి. అలాగే గత మూడేళ్లలో షుగర్ కంపెనీ షేర్లు తన దీర్ఘకాల ఇన్వెస్టర్లకు ఏకంగా 956% రాబడిని ఇచ్చింది. ఎందుకంటే మార్చి 27, 2020న బీఎస్ఈలో స్టాక్ ధర రూ.9.96 వద్ద ఉంది. అప్పట్లో లక్ష రూపాయలు పెట్టుబడి పెట్టిన ఇన్వెస్టర్లకు ఈ రోజు మార్కెట్ విలువ ప్రకారం రూ.10 లక్షల కంటే ఎక్కువ రాబడి వచ్చి ఉండేది.
Source link

Spread the love

Leave a Comment