ఏపీలో సచివాలయ ఉద్యోగుల బదిలీలు ? నాలుగు కేటగిరీల నుంచి వినతులు.. !
సచివాలయ బదిలీలు

సచివాలయ బదిలీలు

గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు మూడేళ్లుగా బదిలీలు లేకపోవడంతో వారు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఇదే విషయాన్ని ఆంధ్రప్రదేశ్ గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల సంక్షేమ సంస్థ ప్రతినిధులు ఇవాల ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. గ్రామ వాలంటీర్, వార్డు వాలంటీర్, విలేజ్ సెక్రటేరియట్, వార్డు సెక్రటేరియట్ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అజయ్ జైన్ ను కలిసిన ప్రతినిధులు.. సచివాలయాల్లో వెంటనే బదిలీలు చేపట్టాలని కోరారు. ముఖ్యంగా నాలుగు కేటగిరీల ఉద్యోగులు ఇబ్బందులకు గురవుతున్నారని ఆయన దృష్టికి తెచ్చారు. గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు కూడా తక్షణమే సాధారణ బదిలీల అవకాశం కల్పించాలని కోరారు.

బదిలీలు వీరికే..

బదిలీలు వీరికే..

సచివాలయ ఉద్యోగాల నోటిఫికేషన్ సమయంలో నాన్ లోకల్ జిల్లాలలో ఎక్కువ ఉద్యోగాలు నోటిఫై చేయడం వలన అక్కడ పరీక్ష రాసి ఉద్యోగం పొందిన ఉద్యోగస్తులు ప్రతిరోజూ వందల కిలోమీటర్లు దూరం ప్రయాణం చేస్తూ ప్రమాదాల బారిన పడుతున్నారు వారికి వెంటనే బదిలీల అవకాశం కల్పించాలని ఉద్యోగులు కోరారు. అలాగే దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న గ్రామ వార్డు సచివాలయం ఉద్యోగస్తులకు వెంటనే బదిలీల అవకాశం కల్పించాలని కోరారు. మరోవైపు భర్త, భార్య వేరు వేరు జిల్లాలో ఉద్యోగాలు చేస్తుూ వారు తల్లిదండ్రులకు పిల్లలకు దూరంగా ఉంటూ మూడేళ్లుగా ఉద్యోగాలు చేస్తున్నారని, వారిని కూడా కరుణించాలన్నారు.
కారుణ్య నియామకాల్లో ఉద్యోగం పొందిన వారి కోసం, మానసిక, శారీరిక అంగవైకల్యంతో బాధపడుతున్నటువంటి పిల్లల తల్లితండ్రులకు కూడా బదిలీలు అవసరమని తెలిపారు.

సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇస్తుందా ?

సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇస్తుందా ?

ఈ కేటగిరీలతో పాటు మొత్తం గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులందరికీ సాధారణ బదిలీల అవకాశం కల్పించాలని ఉద్యోగ ప్రతినిధులు ఇవాళ కోరారు. దీనిపై స్పందించిన స్పెషల్ చీఫ్ సెక్రటరీ అజయ్ జైన్.. ఈ విషయాన్ని తప్పకుండా ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్లి, పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఇప్పటికే రాష్ట్రంలో సాధారణ ఉద్యోగులతో సమానంగా అన్ని సౌకర్యాలు, సెలవులు, జీతభత్యాలు, అవకాశాలు కల్పిస్తున్న ప్రభుత్వం.. ఇప్పుడు వీరి బదిలీలపైనా త్వరలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. మరో ఆరునెలలు ఆగితే ఎన్నికల ఏడాదిలోకి ప్రవేశించే అవకాశముంది. కాబట్టి త్వరలో బదిలీలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
Source link

Spread the love

Leave a Comment