కేంద్ర మాజీ మంత్రి నుంచి TDPకి సిగ్నల్స్?
2009లో విజయంతో కేంద్ర మంత్రి పదవి

2009లో విజయంతో కేంద్ర మంత్రి పదవి

2009 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అగ్రనేతల్లో ఒకరైన ఎర్రన్నాయుడిపై గెలిచి కేంద్ర మంత్రివర్గంలో పదవి దక్కించుకున్నారు. ప్రజారాజ్యం భారీగా ఓట్లు చీలడం కూడా అప్పుడు కలిసి వచ్చింది. 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీచేస్తే డిపాజిట్ కూడా దక్కించుకోలేకపోయారు.

తర్వాత వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. గత ఎన్నికలకు దూరంగా ఉన్నప్పటికీ రానున్న ఎన్నికల్లో టెక్కలి అసెంబ్లీ సీటును ఆశిస్తున్నారు. అయితే ఈ నియోజకవర్గాన్ని ముఖ్యమంత్రి జగన్ ముందుగానే దువ్వాడ శ్రీనివాస్ ను ఖరారు చేశారు.
వైసీపీ నుంచి సీటు దక్కే అవకాశాలు లేవు?

వైసీపీ నుంచి సీటు దక్కే అవకాశాలు లేవు?

శ్రీకాకుళం ఎంపీగా పోటీచేద్దామనుకుంటున్నా డాక్టర్ దానేటి శ్రీధర్ నుంచి పోటీ ఉంది. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా రాజకీయాల్లో కీలకంగా మారిన ధర్మాన ప్రసాదరావు, ధర్మాన కృష్ణదాస్ తోపాటు దువ్వాడ శ్రీనివాస్ కూడా జగన్ వద్ద శ్రీధర్ పేరునే ప్రతిపాదిస్తుండటంతో తనకు సీటు రాదని ఆమె ఖరారు చేసుకున్నారు. ఆర్థికంగా బలమైన వ్యక్తి అయిన కిల్లి కృపారాణి ప్రస్తుతం తెలుగుదేశం పార్టీలో తన అదృష్టం పరీక్షించుకోవాలనుకుంటున్న ఆమెకు అక్కడ కూడా నిరాశే ఎదురైనట్లు తెలుస్తోంది.

తేల్చి చెప్పని టీడీపీ

తేల్చి చెప్పని టీడీపీ

వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి పూర్తిస్థాయిలో సహకరించి ఆ పార్టీ అభ్యర్థులను గెలిపించడంద్వారా గౌరవం దక్కించుకొని రాజ్యసభ కానీ, మరేదైనా రాష్ట్రస్థాయి పదవిని కానీ దక్కించుకోవచ్చనే యోచనలో ఉన్నారు. అయితే టీడీపీ అధిష్టానం ఔనని కానీ, కాదనికానీ చెప్పడంలేదు. కాంగ్రెస్ పార్టీకి ఏపీలో భవిష్యత్తు లేకపోవడం, వరుసగా పది సంవత్సరాల రాజకీయంగా ఎటువంటి కార్యక్రమాలు లేకపోవడం ఇబ్బందికరంగా ఉంటుందని భావించిన కిల్లి ఈసారి టీడీపీలోకి వెళ్లేందుకు గట్టిగా ప్రయత్నిస్తున్నారు.
Source link

Spread the love

Leave a Comment