జగ్గయ్యపేట TDP అభ్యర్థిగా వసంత కృష్ణప్రసాద్?
సేవ చేయడానికి ఎన్నారైలు ముందుకు రారు..

సేవ చేయడానికి ఎన్నారైలు ముందుకు రారు..

ఒక్కోసారి రాజకీయాల్లోకి వచ్చి.. ఎమ్మెల్యేను ఎందుకయ్యానా అని బాధపడుతున్నానని ఒకసారి వ్యాఖ్యానించారు. తాను అనవసరంగా ఎవరిపై కేసులు పెట్టించలేదన్నారు. ప్రజలకు అభివృద్ధిపై ఏమీ చెప్పలేకపోతున్నామన్నారు. గుంటూరులో ఎన్నారై ఉయ్యూరు శ్రీనివాసరావు నిర్వహించిన కార్యక్రమంలో తొక్కిసలాట జరిగి ముగ్గురు మృతిచెందారు. ఉయ్యూరును ప్రభుత్వం అరెస్ట్ చేసిన సందర్భంలో ఎన్నారైలపై ఇలా వ్యవహరిస్తే సేవా కార్యక్రమాలు చేయడానికి ఎవరూ ముందుకు రారన్నారు.

చంద్రబాబును తాను ఎన్నడూ విమర్శించలేదు

చంద్రబాబును తాను ఎన్నడూ విమర్శించలేదు

తాను టీడీపీ అధినేత చంద్రబాబును ఎప్పుడూ విమర్శించలేదని, కేవలం దేవినేని ఉమను, లేదంటే ఇతర టీడీపీ నాయకులను మాత్రమే విమర్శించానన్నారు. ఈ పరిణామాలన్నీ బేరీజు వేస్తున్న రాజకీయ విశ్లేషకులు వచ్చే ఎన్నికల్లో వసంత కృష్ణప్రసాద్ టీడీపీ తరఫున మైలవరం నియోజకవర్గం నుంచి పోటీచేస్తారంటున్నారు. అయితే మైలవరం నుంచి టీడీపీ తరఫున పోటీచేయాల్సిన దేవినేని ఉమామహేశ్వరరావును నూజివీడు వెళ్లమన్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఒకవేళ వసంత టీడీపీలో చేరితో జగ్గయ్యపేట నుంచి పోటీచేయించాలనే యోచనలో అధిష్టానం ఉన్నట్లు తెలుస్తోంది.
శ్రీరాం తాతయ్యకు ఎమ్మెల్సీ ఇవ్వాలని..

శ్రీరాం తాతయ్యకు ఎమ్మెల్సీ ఇవ్వాలని..

జగ్గయ్యపేటలో ఉన్న శ్రీరాం తాతయ్యకు ఎమ్మెల్సీ హామీ ఇచ్చి వసంతను నిలబెట్టేలా ప్రణాళిక రచిస్తున్నారు. అయితే వసంత టీడీపీలోకి వస్తే మైలవరం నియోజకవర్గాన్నే అడుగుతారని విశ్లేషకులు భావిస్తున్నారు. ఒకవేళ దేవినేని ఉమ మైలవరం నుంచే పోటీచేసిన పక్షంలో జగ్గయ్యపేట తప్పదంటున్నారు. ప్రస్తుతం అధిష్టానం దగ్గర ఈ విషయం సందిగ్ధావస్థలో ఉంది. వసంత కృష్ణప్రసాద్ తండ్రి వసంత నాగేశ్వరరావు ఇటీవలే కేశినేని నానిని కలిశారు. వసంతను టీడీపీలోకి తీసుకురావడానికి కేశినేని గట్టిగా ప్రయత్నిస్తున్నారు. సొంత పార్టీ ఎమ్మెల్యేలకు కూడా ఎంపీ నిధులు కేటాయించకుండా వసంత కృష్ణప్రసాద్ నియోజకవర్గానికి ఇచ్చారు. అంతేకాదు.. వాటిని బాగా ఖర్చుచేశారు.. అభివృద్ధి చేశారు.. గుడ్ మ్యాన్ అంటూ ఎంపీ ఎమ్మెల్యేపై పొగడ్తల వర్షం కురిపించారు. అందుకు కారణం దేవినేని ఉమ. కేశినేనికి, ఉమకు పడకపోవడంవల్ల వసంతను టీడీపీలోకి తెచ్చి మైలవరం నుంచి పోటీచేయించడంద్వారా ఉమామహేశ్వరరావుకు చెక్ పెట్టాలని నాని చూస్తున్నారు.

Source link

Spread the love

Leave a Comment