జాతీయ రాజకీయాల్లో కీలకంగా కేసీఆర్ నాందేడ్ పర్యటన ఫిబ్రవరి 5న.. షెడ్యూల్ ఇలా!!




ఫిబ్రవరి 5 న నాందేడ్ లో కేసీఆర్ బీఆర్ఎస్ బహిరంగ సభ

ఫిబ్రవరి 5 న నాందేడ్ లో కేసీఆర్ బీఆర్ఎస్ బహిరంగ సభ

ఫిబ్రవరి 5వ తేదీన మహారాష్ట్రలోని నాందేడ్ లో నిర్వహించనున్న సభ ఏర్పాట్లను ఇప్పటికే మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఆధ్వర్యంలోని నేతల బృందం పరిశీలించింది. మహారాష్ట్రలో కలిసి వచ్చే స్థానిక నాయకులతో కలిసి సభను జయప్రదం చేయడానికి కెసిఆర్ చక చకా పావులు కదుపుతున్నారు. నాందేడ్ లో బిఆర్ఎస్ బహిరంగ సభని ఈనెల 29వ తేదీన నిర్వహించాలని ముందు నిర్ణయించినప్పటికీ అక్కడ ఎన్నికల కారణంగా తేదీని మార్చుకోవాల్సి వచ్చింది.

మహారాష్ట్ర ఎమ్మెల్సీ ఎన్నికల తర్వాత సభ

మహారాష్ట్ర ఎమ్మెల్సీ ఎన్నికల తర్వాత సభ

అక్కడ ఎన్నికల కోడ్ అమలులో ఉండడంతో ఫిబ్రవరి 5వ తేదీని ముహూర్తంగా ఎంచుకున్నట్టు తెలుస్తుంది. మహారాష్ట్ర ఎమ్మెల్సీ స్థానాలకు ఈనెల 30వ తేదీన ఎన్నికల పోలింగ్ జరగనున్న నేపథ్యంలో, ఫిబ్రవరి 2వ తేదీన ఓట్ల లెక్కింపు కొనసాగుతుంది. ఇక ఆపై ఫిబ్రవరి 5వ తేదీన బిఆర్ఎస్ సభ నిర్వహించడానికి అనుకూలంగా ఉంటుందని భావించి ఆ డేట్ ఫిక్స్ చేసినట్లుగా సమాచారం.




సీఎం కేసీఆర్ పర్యటన షెడ్యూల్ ఇలా

సీఎం కేసీఆర్ పర్యటన షెడ్యూల్ ఇలా

ఇప్పటికే నాందేడ్ లో జరగనున్న సభ కోసం గత మూడు రోజులుగా మహారాష్ట్రకు చెందిన కొందరు నేతలు ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ ను కలిసి సభను సక్సెస్ చేయడానికి కావలసిన సూచనలు, సలహాలు తీసుకుంటూ ముందుకు సాగుతున్నారు. ఇదిలా ఉంటే వచ్చే నెల 5వ తేదీన మహారాష్ట్రలోని నాందేడ్ లో సీఎం కేసీఆర్ షెడ్యూల్ కు సంబంధించిన వివరాలను పరిశీలించినట్లయితే.. ముందుగా తెలంగాణ సీఎం కేసీఆర్ గురుద్వార సందర్శన ఉంటుందని, గురుద్వారాలో కేసీఆర్ ప్రత్యేక పూజలు అనంతరం హింగోలి రోడ్డు ఎదురుగా ఉన్న గురుద్వారా సత్కంద్ బోర్డు మైదానంలో బీఆర్ఎస్ పార్టీ చేరికల సమావేశం ఉంటుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అక్కడే సభ నిర్వహించిన అనంతరం, మధ్యాహ్నం నాందేడ్ సిటీ ఫ్రైడ్ హోటల్లో సీఎం కేసీఆర్ మీడియాతో మాట్లాడతారని, ఆపైన మళ్లీ హైదరాబాద్ కు కేసిఆర్ చేరుకుంటారని చెబుతున్నారు.

దేశం దృష్టిని ఆకర్షించేలా సీఎం కేసీఆర్ నాందేడ్ పర్యటన

దేశం దృష్టిని ఆకర్షించేలా సీఎం కేసీఆర్ నాందేడ్ పర్యటన

ఇక సీఎం కేసీఆర్ మహారాష్ట్రలో నిర్వహించనున్న సభకు అన్ని అనుమతులు రాగా, కెసిఆర్ శరవేగంగా మహారాష్ట్రలో పార్టీని బలోపేతం చేయడానికి పావులు కదుపుతున్నారు. ఇప్పటికే బీఆర్ఎస్ అధినేత కేసిఆర్ తో చత్రపతి సాహు మహారాజ్ మనవడు, మహా మాజీ ఎంపీ ఛత్రపతి శంభాజీ ఇప్పటికే భేటీ అయ్యారు. మహారాష్ట్రలో తెలంగాణ పథకాలను అమలు చేయాలని ఆయన సీఎం కేసీఆర్ కు విజ్ఞప్తి చేశారు. మొత్తానికి తెలంగాణ సీఎం కేసీఆర్ నాందేడ్ పర్యటన మళ్లీ దేశం దృష్టిని ఆకర్షించేలా, జాతీయ నాయకుల దృష్టి మళ్లేలా జరగబోతుందని బీఆర్ఎస్ వర్గాలు భావిస్తున్నాయి.




ఫిబ్రవరి 5న నాందేడ్‌లో బీఆర్ఎస్ సభ: ఈసారి గులాబీ బాస్ కేసీఆర్ వ్యూహం ఇదే!!ఫిబ్రవరి 5న నాందేడ్‌లో బీఆర్ఎస్ సభ: ఈసారి గులాబీ బాస్ కేసీఆర్ వ్యూహం ఇదే!!

Source link

Spread the love

Leave a Comment