జీవో నంబర్ 1పై తప్పుడు సంకేతాలు ? ఇంటెలిజెన్స్ నెగెటివ్ రిపోర్ట్ ! ఏపీ సర్కార్ వెనక్కి తగ్గే ఛాన్స్ ?




జీవో నంబర్ 1 వివాదం

ఏపీలో విపక్ష నేత చంద్రబాబు నిర్వహించిన రెండు వరుస సభల్లో తొక్కిసలాటలు చోటు చేసుకుని 11 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ నేపథ్యంలో రోడ్లపై బహిరంగసభలు, ర్యాలీలు, రోడ్ షోలు నిషేధిస్తూ ప్రభుత్వం జీవో నంబర్ 1ను తీసుకొచ్చింది. అయితే ఈ జీవోను అమలు చేసే క్రమంలో పోలీసులు వ్యవహరిస్తున్న తీరుతో ప్రభుత్వ ఉద్దేశం దెబ్బతింటున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా విపక్షాల్ని టార్గెట్ చేసేందుకే ప్రభుత్వం ఈ జీవో తెచ్చిందా అన్నట్లుగా జనంలో ప్రచారం జరుగుతోంది. దీంతో ఈ జీవో వ్యవహారం ప్రభుత్వాన్ని ఇరుకునపెడుతోంది.

 ప్రభుత్వం ఆశించింది ఇదే..

ప్రభుత్వం ఆశించింది ఇదే..

జీవో నంబర్ 1 తీసుకురావడం ద్వారా రోడ్లపై, ముఖ్యంగా ఇరుకు సందుల్లో సభలు, రోడ్ షోలు, ర్యాలీలు పెట్టకుండా అన్ని రాజకీయ పార్టీల్ని, నేతల్ని కట్టడి చేయాలని ప్రభుత్వం భావించింది. తద్వారా తొక్కిసలాటల ఘటనలు పునరావృతం కాకుండా ఉంటాయని ఆశించింది. ఇదే ఉద్దేశంతో అన్ని రోడ్లపై ఎలాంటి ర్యాలీలు, రోడ్ షోలు, బహిరంగసభలు నిర్వహించకుండా అడ్డుకునేలా ఈ జీవో జారీ చేసింది. దీంతో రోడ్లపై ఇలాంటి ఘటనలు తగ్గిపోవాల్సి ఉంది. దీనిపై అన్ని రాజకీయ పార్టీల్లోనూ, బహిరంగసభలు పెట్టే విషయంలో తగిన అవగాహన కూడా కల్పించాల్సి ఉంది. కానీ అది జరగలేదు.




 కానీ జరుగుతోంది ఇదే

కానీ జరుగుతోంది ఇదే

ప్రభుత్వం రోడ్లపై బహిరంగసభల్ని కట్టడి చేయడం ద్వారా తొక్కిసలాటలు పునరావృతంకాకుండా చేద్దామని తీసుకొచ్చిన జీవో నంబర్ 1పై అనుకున్నది ఒకటైతే జరుగుతోంది మరొకటి. ప్రస్తుతం ఇది పూర్తిగా రాజకీయ రంగు పులుముకుంది. దీనికి పోలీసులతో పాటు ఇతరశాఖల అధికారులు కూడా కారణమవుతున్నారు. దీంతో విపక్షాలు దీన్ని రాజకీయం చేయడం మొదలుపెట్టేశాయి. తమను కట్టడి చేసేందుకే ప్రభుత్వం ఇలాంటి జీవో తీసుకొచ్చిందన్న విషయాన్ని జనంలోకి పంపడంలో విపక్షాలు సక్సెస్ అయ్యాయి. దీంతో ఇప్పుడు ఎక్కడ చూసినా ఇదే చర్చ జరుగుతోంది. ముఖ్యంగా నిఘా వర్గాల నుంచి ప్రభుత్వానికి అందుతున్న నివేదికల్లోనూ ఇదే అంశం గుర్తించినట్లు తెలుస్తోంది.

 దిద్దుబాటు యోచనలో సర్కార్ ?

దిద్దుబాటు యోచనలో సర్కార్ ?

ప్రభుత్వం జీవో నంబర్ 1లో రోడ్లపై జరిగే ర్యాలీలు, బహిరంగసభలు, రోడ్ షోలు కట్టడి చేస్తామని ప్రకటిస్తే.. జనంలోకి మాత్రం అన్ని ర్యాలీలు, రోడ్ షోలు, బహిరంగసభలకు అనుమతి లేకుండా చేశారనే ప్రచారం వెళ్లిపోయింది. దీంతో ఇప్పుడు మంత్రులు, వైసీపీ నేతలు ప్రెస్ మీట్లు పెట్టి అసలు ఆ జీవో చదివారా అన్న ప్రశ్నలు విపక్షాలకు సంధిస్తున్నాయి. అయితే ఇప్పటికే తమకు అందుతున్న ఫీడ్ బ్యాక్ ప్రకారం ఈ జీవోలో కొన్ని మార్పులు చేయడం ద్వారా దుష్ప్రచారానికి అడ్డుకట్టే వేసేందుకు ప్రభుత్వం చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. అది సాధ్యం కాకపోతే మాత్రం జీవో నంబర్ 1ను వెనక్కి తీసుకున్నా ఆశ్చర్యం లేదని సమాచారం.




Source link

Spread the love

Leave a Comment