టీడీపీ – జనసేన పొత్తు : 2024 ఏపీ ఫలితాలపై బీజేపీ అంచనాలు ఇలా..!?




టీడీపీ - జనసేన పొత్తుతో భవిష్యత్ అంచనాలు..

టీడీపీ – జనసేన పొత్తుతో భవిష్యత్ అంచనాలు..

పవన్ కల్యాణ్ రణస్థలం సభ ద్వారా పొత్తు ఖాయమని తేల్చి చెప్పారు. టీడీపీతో కలిసి వెళ్లటం ఖాయమనే సంకేతాలు ఇచ్చారు. బీజేపీ ప్రస్తావన లేదు. బీజేపీ కూడా తమతో కలిసి రావాలని చంద్రబాబు – పవన్ కోరుకుంటున్నారు. కానీ, బీజేపీ నేతల నుంచి సానుకూల స్పందన లేదు. టీడీపీ – జనసేన రాజకీయ భవిష్యత్ ముడి పడి ఉన్న ఎన్నికలు కావటంతో బీజేపీ నిర్ణయం ఎలా ఉన్నా..ముందు తాము రాజకీయంగా నిలబడాలంటే ఈ ఎన్నికలు ముఖ్యమని భావిస్తున్నారు. ఈ పొత్తు ద్వారా షెడ్యూల్ ప్రకారం ఎన్నికలు జరిగితే ఎవరికి ఎన్ని సీట్లు వస్తాయి.. ముందస్తుగా జరిగితే వచ్చే ఫలితాలేంటి.. ప్రధానంగా లోక్ సభ సీట్లలో ఎవరి ప్రభావం ఏ మేర ఉంటుందనే లెక్కలు ఇప్పటికే బీజేపీ కేంద్ర నాయకత్వం సమీకరించినట్లు విశ్వసనీయ సమాచారం. ఈ రోజు నుంచి పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాలు ఢిల్లీలో జరుగుతున్నాయి. ఏపీకి చెందిన పార్టీ కీలక నేతతో ఏపీలో పరిణామాలపై చర్చించినట్లు సమాచారం.

2024 ఎన్నికల్లో జరిగిదిదేనంటూ..

2024 ఎన్నికల్లో జరిగిదిదేనంటూ..

ఢిల్లీ బీజేపీ నేతల్లో ఏపీ లో వచ్చే ఎన్నికల ఫలితాల పైన ఒక అంచనాతో ఉన్నట్లు రాష్ట్ర నేతలు చెబుతున్నారు. 2024లో ప్రభుత్వ వ్యతిరేక ఓటు గురించి ప్రతిపక్షాలు ఆలోచిస్తున్న సమయంలో బీజేపీ నేతలు కొత్త లెక్కలు తెర మీదకు తీసుకొచ్చారు. జగన్ పక్కగా లెక్క ప్రకారం మెజార్టీ ఓటింగ్ వర్గాలనే నమ్ముకొని వచ్చే ఎన్నికలకు సిద్దం అవుతున్నారు. మిగిలిన వర్గాల పైన జగన్ ఆశలు పెద్దగా లేవు. అవే ఇప్పుడు టీడీపీ-జనసేన ఓటు బ్యాంకులుగా మారబోతున్నాయి. ఆ ఓటింగ్ శాతం తక్కువగానే ఉంటుందని..అది జగన్ వ్యతిరేక ఓటుగా భావించలేమని బీజేపీ నేతలు విశ్లేషిస్తున్నారు. పూర్తి పాజిటివ్ ఓటు దక్కుతుందని జగన్ భావిస్తున్న వర్గాల్లో ఓటు చీలితేనే ప్రత్యర్ధి పార్టీలకు మేలు చేస్తుందని ముఖ్య నేత చెప్పుకొచ్చారు. ఆ వర్గాలు అందుతున్న పథకాలను వదులుకొని ప్రత్యర్ధి పార్టీలకు మేలు చేసే అవకాశం ఎంత మేర ఉందనేది ఎన్నికల సమయంలోనే తేలుతుందని విశ్లేషిస్తున్నారు. ప్రస్తుత సంక్షేమ పథకాలనే చంద్రబాబు – పవన్ అమలు చేస్తానని చెప్పటం ద్వారానే జగన్ కు పరోక్షంగా విజయం దక్కిందనే లెక్కలను బీజేపీ ముఖ్య నేతలు ప్రస్తావిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం.




తక్షణం కాదు - పార్టీ భవిష్యత్ ముఖ్యం

తక్షణం కాదు – పార్టీ భవిష్యత్ ముఖ్యం

ఏపీలో ఇప్పుడు వైసీపీ పూర్తిగా అన్ని అంశాల్లోనూ కేంద్రానికి మద్దతుగా ఉంటోంది. ఇప్పుడు ఏపీ లో టీడీపీ – జనసేనతో పొత్తు పెట్టుకున్నా..అది ఎన్నికల్లో కొన్ని సీట్లు.. అధికారంలోకి వస్తే ఒకటో రెండో మంత్రి పదవులకు మాత్రమే ఉపయోగపడుతుందని బీజేపీ ఢిల్లీ ముఖ్యులు ఖరాఖండిగా రాష్ట్ర నేతలకు చెబుతున్నారు. ఏపీ కంటే తెలంగాణలో ప్రతీ సీటు – ఓటు కీలకమైనా అక్కడే పొత్తులు వద్దని చెబుతున్న వేళ.. ఏపీలో అవసరం ఏంటని బీజేపీ నేతల ప్రశ్నగా ఉంది. టీడీపీకి ఈ ఎన్నికలు జీవన్మరణ సమస్య కావటంతో.. ఆ పార్టీ అధికారంలోకి వస్తే.. మరి కొంత కాలం ఆగాల్సి వస్తుంది.. ప్రతికూల ఫలితాలు వస్తే బీజేపీకి ఏపీలో అవకాశం దొరికినట్లేనని ఢిల్లీ బీజేపీ నేతల లెక్కగా కనిపిస్తోంది. ఈ సమయంలో టీడీపీకి మేలు చేసే నిర్ణయాలు వద్దని జాతీయ నేతలు భావిస్తున్నారని చెబుతున్నారు. దీంతో, పొత్తుల అంశం పైన బీజేపీ ఇప్పటికిప్పుడు పొత్తుల పైన నిర్ణయం ప్రకటించే అవకాశం కనిపించటం లేదని తెలుస్తోంది. పరిస్థితులకు అనుగుణంగా మాత్రమే నిర్ణయం ప్రకటించే అవకాశం కనిపిస్తోంది.

Source link

Spread the love

Leave a Comment