తెలంగాణ రాష్ట్రంలో గ్రామ పంచాయతీలు దయనీయ పరిస్థితులకు చేరుకున్నాయని, సర్పంచుల సమస్యలతో సతమతమవుతున్నారని తెలంగాణా పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రభుత్వాన్ని టార్గెట్ చేశారు. అంతేకాదు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పాలనలో నలిగిపోతున్న గ్రామ పంచాయతీల సమస్యలపై, సర్పంచుల విధుల సమస్యలపై టీపిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారి పిలుపు మేరకు రాష్ట్ర రాజీవ్ గాంధీ పంచాయితీ రాజ్ సంఘటన్ ఆధ్వర్యంలో నేడు ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు ఇందిరా గాంధీ పార్క్ వద్ద ధర్నా చేపట్టాలని నిర్ణయించారు.
హైదరాబాద్ లో సర్జికల్ స్ట్రైక్.. కేసీఆర్ ను టార్గెట్ చేసి బండి సంజయ్ సంచలనం
ఈ క్రమంలో ధర్నా చౌక్ వద్ద ధర్నాకు టి.కాంగ్రెస్ పిలుపునివ్వడంతో పోలీసులు టీపిసిసి చీఫ్ రేవంత్ రెడ్డిని ధర్నాలో పాల్గొనకుండా ముందస్తుగా అరెస్ట్ చేశారు. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగానూ కాంగ్రెస్ కు చెందిన కీలక నాయకులను పోలీసులు హౌస్ అరెస్ట్ చేస్తున్నారు. పలు చోట్ల కాంగ్రెస్ నాయకులను, కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు. దీంతో కనీసం ఆందోళన తెలియజేయడానికి కూడా ప్రతిపక్ష పార్టీలకు స్వాతంత్ర్యం లేని పరిస్థితి ఉందని కాంగ్రెస్ పార్టీ నేతలు భగ్గుమంటున్నారు.

రాష్ట్రంలో సర్పంచులు అప్పుల ఊబిలో కూరుకుపోయారు అని, తమ సమస్యల పరిష్కారం కాక సర్పంచులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు చూస్తుందని మండిపడుతున్నారు కాంగ్రెస్ నాయకులు. సర్పంచుల విధుల కోసం ఆందోళన చేసే తమను అడ్డుకోవటం దారుణం అన్నారు. గ్రామాలకు వచ్చే 14 మరియు 15 ఫైనాన్స్ నుంచి వచ్చే సొమ్మును సైతం ఫోర్జరి డిజిటల్ సైన్ ద్వార దొంగిలిస్తూ కనీసం నిరసన తెలపటానికి, వాళ్లకు మద్దతు ఇవ్వటానికి వెళ్తున్న రేవంత్ రెడ్డిని ముందస్తు అరెస్టు చేయటం దుర్మార్గమైన చర్య, ఇదీ మీ నియంత ధోరణికి పరాకాష్ఠ అంటూ కాంగ్రెస్ పార్టీ నాయకులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
Police house arrested TPCC Chief Revanth Reddy and other Congress leaders at the Dharna Chowk today on the issue of sarpanchs problems in Telangana. Congress leaders are angry with this.
Story first published: Monday, January 2, 2023, 9:32