తెలంగాణ పీజీఈ-సెట్ షెడ్యూల్ విడుదల: పూర్తి వివరాలు ఇవే




హైదరాబాద్: ఇంజినీరింగ్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే టీఎస్ ఈ-సెట్ 2023 షెడ్యూల్ విడుదలైంది. మార్చి 1వ తేదీన టీఎస్ ఈసెట్ నోటిఫికేషన్ విడుదల కానుంది. ఈసెట్ షెడ్యూల్‌ను తెలంగాణ ఉన్నత విద్యామండలి ఛైర్మన్ ఆర్ లింబాద్రి, ఉస్మానియా యూనివర్సిటీ వీసీ రవీందర్, ఈసెట్ కన్వీనర్ శ్రీరాం వెంకటేశ్ సంయుక్తంగా విడుదల చేశారు.

మార్చి 2వ తేదీ నుంచి మే 5వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించనున్నారు. రూ. 500 ఆలస్య రుసుముతో మే 8వ తేదీ వరకు, రూ. 2500తో మే 12వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు తమ దరఖాస్తులను మే 8 నుంచి 12వ తేదీ వరకు ఎడిట్ చేసుకునేందుకు అవకాశం కల్పించారు.

మే 15 నుంచి అభ్యర్థులు సంబంధిత వెబ్‌సైట్ నుంచి హాల్ టికెట్లు డౌన్ లోడ్ చేసుకోవచ్చ. మే 20న ఈసెట్ ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు. తదితర వివరాల కోసం https://tsecet.nic.in/ ను సంప్రదించవచ్చు.

Source link

Spread the love

Leave a Comment