తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు మార్పు..!?
బండి సంజయ్ ను మార్చే ఛాన్స్ ఉందా..

బండి సంజయ్ ను మార్చే ఛాన్స్ ఉందా..

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా బండి సంజయ్ పదవీ కాలం ఫిబ్రవరి 10న ముగియనుంది. దీంతో, ఆయన కొనసాగుతారా లేదా అనే అంశం పైన చర్చ జరుగుతోంది. బండి సంజయ్ పార్టీ బాధ్యతలు చేపట్టిన తరువాత రాష్ట్రంలో బీజేపీలో కొత్త జోష్ వచ్చిందనే అభిప్రాయం ఉంది. బండి సంజయ్ టీఆర్ఎస్ ప్రభుత్వం..ముఖ్యమంత్రి కేసీఆర్ పైన పోరాడుతున్న తీరును పార్టీ అధినాయకత్వం ప్రశంసించింది. బండి సంజయ్ నిర్వహించిన ప్రజాసంగ్రామ యాత్ర పైన ప్రత్యేకంగా ప్రధాని ఆరా తీసారు. హైదరాబాద్ లో జరిగిన బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు.. ఆ సమయంలో నిర్వహించిన పార్టీ బహిరంగ ఏర్పాట్ల పైన ప్రధాని ప్రత్యేకంగా బండి సంజయ్ ను వేదిక పైనే అభినందించారు. పార్టీ అధినాయకత్వం దాదాపుగా బండి సంజయ్ కు మద్దతుగా నిలుస్తోంది. ఈ సమయంలో బండి స్థానంలో మరొకరికి అవకాశం ఇస్తారా అనే సందేహం వ్యక్తం అవుతోంది.

కేంద్ర కేబినెట్ లోకి బండి సంజయ్..!?

కేంద్ర కేబినెట్ లోకి బండి సంజయ్..!?

తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ పైన విజయం సాధించాలనే లక్ష్యంగా బీజేపీ అడుగులు వేస్తోంది. ఇప్పటికే 90 సీట్ల పైన ప్రత్యేకంగా కార్యాచరణ అమలు చేస్తోంది. పార్టీ నుంచి ఇంఛార్జ్ లను ఖరారు చేసింది. పార్టీ ముఖ్యనేత బీఎల్ సంతోష్ పార్టీ నేతలకు తెలంగాణలో ఏ విధంగా ముందుకెళ్లాలో దిశా నిర్దేశం చేసారు. అయితే, టీఆర్ఎస్ పైన దూకుడుగా ఉన్న బండి సంజయ్ ను కేంద్ర కేబినెట్ లోకి తీసుకుంటారనే చర్చ బీజేపీ శ్రేణుల్లో వినిపిస్తోంది. ప్రస్తుతం కిషన్ రెడ్డి కేంద్ర కేబినెట్ లో మంత్రిగా ఉన్నారు. తెలంగాణలో మరో మంత్రి పదవి బీసీలకు ఇవ్వాలని భావిస్తున్నారు. బండి సంజయ్ కు కేంద్ర మంత్రి పదవి ఇవ్వటం ద్వారా అధికారికంగా నిర్ణయాలు తీసుకొనే అధికారం దక్కుతుందని..ఇది మరింతగా రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం పైన చేస్తున్న విమర్శలు.. ఏం చేయటం లేదనే వాదనను అధికారిక హోదాలో తిప్పి కొట్టే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. అయితే, పార్టీ కేడర్ లో జోష్ నింపుతూ.. దూకుడు మీద ఉన్న బండి సంజయ్ కు కేంద్ర మంత్రి పదవి ఇవ్వటం జరిగితే ఆ దూకుడుకు బ్రేకులు వేయటమేననే అభిప్రాయం కూడా వినిపిస్తోంది.

బండి స్థానంలో ఈటెల..!

బండి స్థానంలో ఈటెల..!

బండి సంజయ్ ను కేంద్ర కేబినెట్ లోకి తీసుకుంటే.. రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు ఎవరికి అప్పగిస్తారనే చర్చ మొదలైంది. అందులో తొలి రేసులో మాజీ మంత్రి..హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ పేరు వినిపిస్తోంది. ఈటల ప్రస్తుతం బీజేపీ చేరికల కమిటీ ఛైర్మన్ గా ఉన్నారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ అన్ని పార్టీల నుంచి ఆకర్ష్ మంత్రాన్ని బీజేపీ అమలు చేస్తోంది. ఈ సమయంలో ఈటలకు పార్టీ అధ్యక్ష బాధ్యతలు ఇవ్వటం ద్వారా కొన్ని హామీలు..నిర్ణయాల విషయంలో వెసులుబాటు కలుగుతుందని అంచనా వేస్తున్నారు. అయితే, బండి సంజయ్ – ఈటల ఇద్దరూ ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన వారు. కేంద్ర కేబినెట్ లో స్థానం..పార్టీ రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు ఒకే జిల్లాకు వెళ్తాయి. అయితే, ఎన్నికల వరకు బండి సంజయ్ ను పార్టీ సేవలకే ఉపయోగించుకొనే అవకాశం ఉందనే వాదన ఉంది. దీంతో, సంక్రాంతి తరువాత బీజేపీ జాతీయ నాయకత్వం ఈ మొత్తం మర్పులు చేర్పులపై క్లారిటీ ఇచ్చే అవకాశం కనిపిస్తోంది.

Source link

Spread the love

Leave a Comment