దేశ ప్రజలకు ప్రధాని మోడీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు: అమరవీరులకు నివాళి




74వ గణతంత్ర దినోత్సవ వేడుకల వేళ దేశ ప్రజలకు ప్రధాని నరేంద్ర మోడీ శుభకాంక్షలు తెలియజేశారు.

India




oi-Rajashekhar Garrepally

|




Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: 74వ గణతంత్ర దినోత్సవ వేడుకల వేళ దేశ ప్రజలకు ప్రధాని నరేంద్ర మోడీ శుభకాంక్షలు తెలియజేశారు. దేశ ప్రజలకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈసారి ఈ వేడుకలు మరింత ప్రత్యేకం. ఎందుకంటే ఆజాదీ కా అమృత్ మహోత్సవం వేళ.. వీటిని నిర్వహిస్తున్నాం. స్వాతంత్ర్య సమరయోధుల ఆశయాలను నెరవేర్చే విధంగా కలిసికట్టుగా ముందుకు సాగుదాం అని ప్రధాని మోడీ ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు.

గణతంత్ర దినోత్సవం ప్రధాన కార్యక్రమానికి ముందు జాతీయ యుద్ధ స్మారకం వద్దకు చేరుకున్న ప్రధాని నరేంద్ర మోడీ.. ఇక్కడ దేశంలోని అమరవీరులకు నివాళులర్పించారు. తర్వాత, ప్రధాని మోడీ ఇక్కడ డిజిటల్ విజిటర్స్ బుక్‌లో తన మన్ కీ బాత్‌ను రికార్డ్ చేశారు.




Republic Day: PM Modi Pays Homage To Fallen Soldiers At National War Memorial

దేశం మొత్తం ఈరోజు గణతంత్ర దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటోంది. అయితే, నేడు గణతంత్ర దినోత్సవంతో పాటు వసంత పంచమి కావడంతో ప్రధాని నరేంద్ర మోడీ ఈరోజు ప్రత్యేక బసంతి తలపాగాలో దర్శనమిచ్చారు.

Republic Day: PM Modi Pays Homage To Fallen Soldiers At National War Memorial

జాతీయ యుద్ధ స్మారకం వద్ద అమరవీరులను స్మరించుకున్న ప్రధాని మోడీ.. వారికి రెండు నిమిషాలు మౌనం పాటించారు. ఈ సందర్భంగా త్రివిధ దళాధిపతులు ప్రధాని మోడీ వెంట ఉండి అమరవీరులకు నివాళులు అర్పించారు. అనంతరం, గణతంత్ర దినోత్సవ పరేడ్‌ చేరుకున్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తొలిసారిగా రిపబ్లిక్ డే పరేడ్‌లో పాల్గొనడం గమనార్హం. దేశంలో రాష్ట్రపతి అయిన రెండో మహిళ ద్రౌపది ముర్ము.
గతంలో ప్రతిభా పాటిల్ దేశానికి తొలి మహిళా రాష్ట్రపతి అయ్యారు.
గత ఏడాది జూలై నెలలోనే ద్రౌపది ముర్ము రాష్ట్రపతి పదవిని చేపట్టారు.




English summary




Republic Day: PM Modi Pays Homage To Fallen Soldiers At National War Memorial.

Story first published: Thursday, January 26, 2023, 12:45 [IST]




Source link

Spread the love

Leave a Comment