పంది బస్సు వారాహి హాష్ ట్యాగ్ ట్రెండ్ అవ్వకుండా చూసుకోండి: ఆర్జీవీ
వారాహి వాహనాన్ని పంది వాహనంగా అభివర్ణించిన రాంగోపాల్ వర్మ ఇక వారాహి వాహనంపై ట్వీట్లను మాత్రం వదిలిపెట్టడం లేదు. పంది బస్సు వారాహి అని సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం పైన తనకేదో జనసేన పార్టీ పట్ల సానుభూతి ఉన్నట్టు ఓ పోస్టు పెట్టిన రాంగోపాల్ వర్మ జన సైనికులారా దయచేసి పంది బస్సు వారాహి అంటూ హ్యాష్ ట్యాగ్ ప్రమోట్ చేస్తున్న వీడి మీద యాక్షన్ తీసుకోండి అంటూ పేర్కొన్నారు. ఇక మరో పోస్టులో డియర్ జనసైనికులారా దయచేసి పంది బస్సు వారాహి హాష్ ట్యాగ్ ట్రెండ్ అవ్వకుండా చూసుకోండి అంటూ మరో పోస్ట్ పెట్టారు.

ఆర్జీవీపై మండిపడిన పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్
ఇక ఆ రోజుల్లో ఎన్టీ రామారావు చైతన్య రథం మీద తిరిగితే, మీరు పంది బస్సు మీద తిరుగుతున్నారు అంటున్న వారందరినీ జనసేన లతో బస్సు టైర్ల కింద తొక్కించేయండి సార్ అంటూ పోస్ట్ పెట్టిన రాంగోపాల్ వర్మ రాంగోపాల్ వర్మ తనదైన శైలిలో సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నారు. దీంతో రాంగోపాల్ వర్మ చేస్తున్న పోస్టులపై పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చెయ్యటం లక్ష్యంగా పెట్టుకున్నారని రాం గోపాల్ వర్మపై తీవ్ర అసహనాన్ వ్యక్తం చేస్తున్నారు. కావాలంటే జగన్ భజన చేసుకోవచ్చని అంటున్నారు.

వారాహినే అవమానిస్తావా? జాగ్రత్త అంటూ హెచ్చరిక
వారాహి అంటే అమ్మవారి పేరని, అమ్మవారి పేరు పెట్టుకుని పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచార రథాన్ని ప్రారంభిస్తే, అత్యంత పవిత్రంగా పూజలు నిర్వహిస్తే పంది బస్సు అంటూ మాట్లాడతావా అంటూ ఆర్జీవీని తిట్టిపోస్తున్నారు. కాళ్ళు నాకడం నీ కంటే బాగా ఎవరికి తెలుసు అంటూ అషు రెడ్డి ఇష్యూ ని తెరమీదకి తీసుకువచ్చి రాంగోపాల్ వర్మను తిట్టిపోస్తున్నారు. వలువ లేని రాంగోపాల్ వర్మ మాటలకు కూడా పట్టించుకోవాలా అంటూ పలువురు పేర్కొంటున్నారు. రాంగోపాల్ వర్మ నోరు దగ్గర పెట్టుకొని మాట్లాడితే బాగుంటుందని పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ వార్నింగ్ ఇస్తున్నారు.