పవన్ ను “భుజాల పై మోస్తాం “- సీట్లు ఆఫర్ చేస్తున్న టీడీపీ నేతలు..!!
పవన్ కు టీడీపీ నేత ఆఫర్

పవన్ కు టీడీపీ నేత ఆఫర్

అటు చంద్రబాబు – పవన్ భేటీ కొనసాగుతున్న వేళ ఆసక్తి కర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. టీడీపీ – జనసేన పొత్తు ఖాయమని విశ్వసిస్తున్నా.. బయటకు మాత్రం కొంత డైలమా కనిపిస్తోంది. ఇప్పుడు చంద్రబాబు ఇంటికి పవన్ వెళ్లటం ద్వారా టీడీపీతో కలిసి కొనసాగేందుకే పవన్ సిద్దంగా ఉన్నారనే బలమైన సంకేతాలు కనిపిస్తున్నాయి.

వైసీపీ ఓడించాలనేది ఇప్పుడు టీడీపీ..జనసేన ముఖ్య నేతల ప్రధాన లక్ష్యంగా కనిపిస్తోంది. దీంతో, పవన్ వచ్చే ఎన్నికల్లో తమ స్థానాల నుంచి పోటీ చేయాలని టీడీపీ సీనియర్లు కోరుతున్నారు. గత ఎన్నికల్లో పవన్ కల్యాణ్ రెండు స్థానాల నుంచి పోటీ చేసి రెండింటా ఓడిపోయారు. ఈ సారి ఎక్కడ పోటీ చేస్తారనేది అధికారికంగా స్పష్టత రాలేదు. దీంతో, తాజాగా టీడీపీ అనంతపురం మాజీ ఎమ్మెల్యే ప్రభాకర చౌదరి ఆసక్తి కర వ్యాఖ్యలు చేసారు.
అనంతపురం నుంచి పవన్ పోటీ చేస్తే..

అనంతపురం నుంచి పవన్ పోటీ చేస్తే..

పవన్ కల్యాణ్ వచ్చే ఎన్నికల్లో అనంతపురం నుంచి పోటీ చేస్తే దగ్గరుండి గెలిపిస్తానని ప్రభాకర్ చౌదరి చెప్పుకొచ్చారు. తన భుజస్కందాల మీద మోసి గెలిపిస్తానంటూ వ్యాఖ్యానించారు. వైసీపీ ఓటమి.. జగన్ ఇంటికి పోవటం తమ రెండు పార్టీల లక్ష్యమని స్పష్టం చేసారు. జనసేనతో తమ బంధం కొత్తది కాదని.. గతంలోనే పొత్తు ఉన్న పార్టీగా వివరించారు.

ఎన్నికల సమయంలో పొత్తులు అనేది అప్పడు ఉన్న పరిస్థితులు అధారంగా ఉంటాయని విశ్లేషించారు. ఊహాగానాలకు మరింత బలం చేకూరినట్లు అయింది. పవన్ కల్యాణ్ వచ్చే ఎన్నికల్లో ఎక్కడి నుంచి పోటీ చేస్తారనే అంశం పైన అనేక రకాల అంచనాలు ఉన్నాయి. ఈ సమయంలో ఇప్పుడు ప్రభాకర్ చౌదరి చేసిన ప్రతిపాదన రెండు పార్టీల్లోనూ చర్చకు కారణమవుతోంది.
జనసేనాని పోటీకి సిద్దమేనా

జనసేనాని పోటీకి సిద్దమేనా

ఇదే సమయంలో ప్రభాకర్ చౌదరి వ్యాఖ్యల పైన మరో ఆసక్తి కర చర్చ సాగుతోంది. అనంతపురం లో ప్రభాకర్ చౌదరి వర్సస్ జేసీ బ్రదర్స్ అన్నట్లుగా పొలిటికల్ ఫైట్ నడుస్తోంది. గత ఎన్నికల్లో ప్రభాకర్ చౌదరికి సీటు రాకుండా తెర వెనుక రాజకీయం చోటు చేసుకుంది. చివరకు టికెట్ దక్కించుకున్న ప్రభాకర్ చౌదరి వైసీపీ అభ్యర్ధి అనంత వెంకట్రామిరెడ్డి చేతిలో పరాజం పొందారు.

వచ్చే ఎన్నికల్లో తిరిగి అనంతపురం సీటు ఆశిస్తున్నారు. ఇప్పుడు పవన్ కు సీటుకు ఆఫర్ చేయటం ద్వారా పరోక్షంగా జేసీ బ్రదర్స్ పైన పై చేయి సాధించే ప్రయత్నాలు మొదలు పెట్టారనే విశ్లేషణలు మొదలయ్యాయి.
Source link

Spread the love

Leave a Comment