పోరంబోకు రాజకీయాలు చేయలేకపోతున్నా..తప్పుడు కేసులు పెట్టను.. వైసీపీ ఎమ్మెల్యే కామెంట్స్..




వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్

వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్

ఏపీలో ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గం నుంచి వైసీపీ ఎమ్మెల్యేగా తొలిసారి గెలిచిన వసంత కృష్ణప్రసాద్ ఈ మధ్య సొంత పార్టీలోనే ఉక్కిరిబిక్కిరవుతున్నారు. తాను ఎమ్మెల్యేగా ఉండగానే వేరే నియోజకవర్గానికి చెందిన ఎమ్మెల్యేలు, మంత్రులు వచ్చి మైలవరంలో చేస్తున్న రాజకీయాలపై ఆయన అసంతృప్తిగా కనిపిస్తున్నారు. ఇదే క్రమంలో ఆయన వారి తీరుపై బహిరంగంగా కూడా వ్యాఖ్యలు చేస్తున్నారు. అలాగే విపక్ష నేతలపై గతంలోలా విరుచుకుపడటం మానేశారు. ఈ నేపథ్యంలో తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలు మళ్లీ చర్చనీయాంశమయ్యాయి.

పోరంబోకుల్ని వెంటేసుకుని తిరగలేను

పోరంబోకుల్ని వెంటేసుకుని తిరగలేను

మైలవరంలో తాజాగా చోటు చేసుకుంటున్న రాజకీయాల నేపథ్యంలో ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ కీలక వ్యాఖ్యలు చేశారు. పోరంబోకుల్ని వెంటేసుకుని రాజకీయం చేయలేకపోతున్నానంటూ ఉద్వేగానికి లోనయ్యారు. పది మంది పోరంబోకులను వెంటేసుకుని తిరిగే రాజకీయాలు చేయలేకపోతున్నా అన్నారు. పోరంబోకుల్లా మనం ప్రవర్తిస్తేనే ఇప్పటి రాజకీయాల్లో నిలబడగలం రాజకీయాల్లో పెద్దరికం పనికిరాదన్నారు. అందుకే పాతతరం నాయకుడిగా మిగిలిపోయానన్నారు. తన తండ్రి వసంత నాగేశ్వరరావు కాలం నాటి రాజకీయాలు ఇప్పుడు లేవన్నారు.




తప్పుడు కేసులు పెట్టబోనన్న వసంత ?

తప్పుడు కేసులు పెట్టబోనన్న వసంత ?

అలాగే రాజకీయాల్లో హుందాగానే ఉంటానని ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ తెలిపారు. అకారణంగా ప్రతిపక్షాలపై తప్పుడు కేసులు బనాయించనని వసంత తేల్చిచెప్పేశారు. అందుకే పార్టీలో కొందరికి తనపై అసంతృప్తి అని వసంత తెలిపారు. ఈ మధ్య కాలంలో విపక్ష టీడీపీ నేతలపై విమర్శలకు దూరంగా ఉంటున్న వసంతపై సొంత పార్టీ నేతల నుంచి ఒత్తిడి పెరుగుతోంది. దీంతో వసంతను విపక్ష నేతలైన దేవినేని ఉమ వంటి వారిపై కేసులు పెట్టాలని డిమాండ్లు చేస్తున్నారు. కానీ ఆయన వాటికి దూరంగా ఉండిపోతున్నారు. ఇదే అంశాన్ని తమకు అనుకూలంగా వాడుకుంటూ సొంత పార్టీ నేతలను తనను టార్గెట్ చేస్తున్నట్లు వసంత భావిస్తున్నట్లు తెలుస్తోంది.

Source link

Spread the love

Leave a Comment