ఫిబ్రవరి Car salesలో మారుతీ, హ్యూందాయ్ రికార్డులు.. కేంద్ర బడ్జెట్ ప్రభావంతో..
రికార్డు అమ్మకాలు..

రికార్డు అమ్మకాలు..

దిగ్గజ వాహన విక్రయ సంస్థ మారుతీ సుజుకి ఈ ఏడాది ఫిబ్రవరిలో 1,02,565 యూనిట్లను విక్రయించగా.. గత ఏడాది ఇదే కాలంలో 99,398 యూనిట్లను సేల్ చేసింది. ఇదే సమయంలో అమ్మకాలతో రెండవ స్థానంలో నిలిచిన హ్యాందాయ్ మోటార్స్ 24,493 యూనిట్లను విక్రయించింది. గత ఏడాది ఇదే కాలంలో కంపెనీ 21,501 యూనిట్లను మాత్రమే విక్రయించిందని సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మ్యానుఫ్యాక్చరర్స్ (SIAM) తాజా డేటా వెల్లడించింది.

ఏడాది కాలంలో..

ఏడాది కాలంలో..

2022-23 ఏప్రిల్-ఫిబ్రవరి మధ్య కాలంలో మెుత్తం 34,61,716 ప్యాసింజర్ వాహనాలు అమ్ముడయ్యాయి. ఇదే క్రమంలో 2021-22 ఏప్రిల్-ఫిబ్రవరిలో మధ్య విక్రయాలు 26,66,109 ప్యాసింజర్ యూనిట్లుగా ఉన్నాయి. అయితే అమ్మకాలు భారీగా పుంజుకోవటానికి కేంద్ర బడ్జెట్ 2023-24లో ప్రోత్సాహకర కేటాయింపులే ప్రధాన కారణమని సియామ్ ప్రెసిడెంట్ వినోద్ అగర్వాల్ వెల్లడించారు. వచ్చే నెల నుంచి అన్ని కేటగిరీల వాహనాలకు BS-6 ఉద్గార నిబంధనల 2వ దశకు మారడానికి ఆటో పరిశ్రమ పూర్తిగా సిద్ధమైందని ఆయన తెలిపారు.

ప్రభుత్వానికి విన్నపం..

ప్రభుత్వానికి విన్నపం..

ప్రస్తుత తరణంలో రిజర్వు బ్యాంక్ వడ్డీ రేట్లను భారీగా పెంచటం, సీఎన్జీ ధరలు వంటి అంశాలను ప్రభుత్వం నియంత్రించాలని కోరినట్లు వినోద్ తెలిపారు. రెపో రేటు పెంపు వల్ల రుణాలపై అధిక వడ్డీ ప్రభావానికి దారితీస్తుందని ఆందోళనను వ్యక్తం చేశారు. అయితే రేట్లు తగిన విధంగా మోడరేట్ అవుతాయని తాము ఆశిస్తున్నట్లు తెలిపాడు.

 SIAM డైరెక్టర్..

SIAM డైరెక్టర్..

ప్యాసింజర్ వాహనాలు ఫిబ్రవరిలో అత్యధిక అమ్మకాలను నమోదు చేశాయని సియామ్ డైరెక్టర్ జనరల్ రాజేష్ మీనన్ తెలిపారు. ఇదే కాలంలో ద్విచక్ర వాహన విభాగం కూడా చెప్పుకోదగ్గ వృద్ధిని నమోదు చేసిందని వెల్లడించారు. అయితే ఫిబ్రవరి 2023లో టూవీలర్స్ మధ్యస్థంగా 8 శాతం వృద్ధిని మాత్రమే నమోదు చేశాయి.

Source link

Spread the love

Leave a Comment