ఫ్రస్ట్రేషన్ లో రేవంత్ రెడ్డి: టీపీసీసీ చీఫ్ గా రాజీనామా చేస్తాననటం వెనుక బలమైన కారణాలే!!




అడుగడుగునా ఇబ్బందులే.. రేవంత్ కు ముందు నుయ్యి వెనుక గొయ్యి

అడుగడుగునా ఇబ్బందులే.. రేవంత్ కు ముందు నుయ్యి వెనుక గొయ్యి

టీపీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన నాటి నుండి ముందు నుయ్యి వెనుక గొయ్యి అన్న చందంగా తయారైంది ఆయన పరిస్థితి. ఒక్క అడుగు ఆయన ముందుకు వేయాలని చూస్తే, పది అడుగులు వెనక్కి లాగాలని చూసే నాయకులు సొంత పార్టీలోనే ఆయనకు ఉండటం మొదటి నుంచి తలనొప్పి గానే ఉంది. టిడిపి నుండి వచ్చిన రేవంత్ రెడ్డికి పిసిసి అధ్యక్షుడుగా అవకాశం కల్పించడంపై మొదట్నుంచి గుర్రుగా ఉన్న కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు ఆయనపై సహాయనిరాకరణ కొనసాగిస్తూనే ఉన్నారు. రాష్ట్రంలో అధికార పార్టీని దీటుగా ఎదుర్కొని ప్రజా క్షేత్రంలో ప్రజల మద్దతుతో ముందుకు వెళ్లాలని భావించినా రేవంత్ రెడ్డికి అడుగడుగున పార్టీలో ఉన్న అంతర్గత సమస్యలు స్వాగతం పలికాయి.

మాణిక్కం ఠాగూర్ పై సీనియర్ల కంప్లైంట్

మాణిక్కం ఠాగూర్ పై సీనియర్ల కంప్లైంట్

పార్టీ సీనియర్లు రేవంత్ రెడ్డిని తీవ్రంగా వ్యతిరేకించడం, ఇటీవల తెలంగాణ పార్టీ పదవులలోనూ రేవంత్ వర్గానికి పెద్దపీట వేశారన్న కారణాలతో పార్టీలో ఉన్న పంచాయితీలు మరింత రచ్చకెక్కాయి. అసలు రేవంత్ రెడ్డి టీపీసీసీ అధ్యక్షుడు కావడమే నచ్చని పార్టీ సీనియర్లు రేవంత్ ఏ పని చేసినా మోకాలడ్డు పెట్టే పని చేస్తూనే ఉన్నారు. ఇక తెలంగాణ కాంగ్రెస్ లో చోటు చేసుకున్న పరిణామాలు చివరకు తెలంగాణ పార్టీ వ్యవహారాల ఇన్చార్జి మాణిక్కం ఠాగూర్ కు ఉద్వాసన పలికే దాకా వెళ్లాయి. రేవంత్ రెడ్డికి బాగా సహకరించాడని, రేవంత్ వర్గం వద్ద డబ్బులు తీసుకుని పదవులు కట్టబెట్టారని పార్టీ సీనియర్లు మాణిక్కం ఠాగూర్ ను ఆ పదవి నుంచి తొలగించాలని ఇటీవల తెలంగాణా కు వచ్చిన దిగ్విజయ్ సింగ్ వద్ద డిమాండ్ చేశారు.




మాణిక్కం ఠాగూర్ ఔట్... రేవంత్ కు షాక్

మాణిక్కం ఠాగూర్ ఔట్… రేవంత్ కు షాక్

ఇక దిగ్విజయ్ సింగ్ నివేదిక మేరకు అన్నంత పని చేసిన కాంగ్రెస్ అధిష్టానం తెలంగాణ పార్టీ వ్యవహారాల ఇంచార్జ్ మాణిక్కం ఠాగూర్ ను పక్కన పెట్టి ఆయన స్థానంలో తెలంగాణ కాంగ్రెస్ ఇన్చార్జిగా మాణిక్యరావు ఠాక్రేకు అవకాశం కల్పించింది. ఇక ఈ నిర్ణయం కూడా ఓ రకంగా రేవంత్ రెడ్డి కి నచ్చని నిర్ణయమే అని చెప్పాలి. మాణిక్కం ఠాగూర్ రేవంత్ రెడ్డి కి పూర్తిగా సహకరించడమే ఆయన పట్ల సీనియర్లకు వ్యతిరేకత వ్యక్తం కావడానికి ప్రధాన కారణం. ప్రస్తుతం కాంగ్రెస్ అధిష్టానం మాణిక్కం ఠాగూర్ స్థానంలో మాణిక్ రావు ఠాక్రేను తీసుకురావడం, ఇక కాంగ్రెస్ పార్టీలోని కొందరు సీనియర్ నాయకులతో మల్లికార్జున ఖర్గే టచ్ లో ఉండటం వెరసి రేవంత్ రెడ్డి తీవ్రమైన ఫ్రస్టేషన్లో ఉన్నారు.

 రేవంత్ పాదయాత్రకు అడ్డంకులు.. నా వల్ల కాదంటున్న రేవంత్

రేవంత్ పాదయాత్రకు అడ్డంకులు.. నా వల్ల కాదంటున్న రేవంత్

ఇక యాత్ర పేరుతో తాను చేయాలని భావించిన పాదయాత్రను కూడా సీనియర్లు చెడగొట్టే ప్రయత్నాలు చేయడం రేవంత్ రెడ్డికి ఏమాత్రం రుచించడం లేదు. అధిష్టానం వద్ద కూడా తనకు వ్యతిరేకంగా పావులు కదులుతున్నాయి అని భావిస్తున్న రేవంత్ రెడ్డి ఈ నేపథ్యంలో తాజాగా టీ పీసీసీ అధ్యక్షుడిగా రాజీనామా చేయడానికి తాను సిద్ధంగా ఉన్నా అంటూ సంచలన ప్రకటన చేశారు. అంతేకాదు పది పనులు చేసే సమయంలో ఒకటి రెండు తప్పులు దొర్లడం సహజం అంటూ మనమంతా మానవ మాత్రులమే అంటూ రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేయడం కూడా ఈ సమయంలో ఆసక్తికర చర్చకు కారణం గా మారింది.




సీనియర్ల వైపే కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయం?

సీనియర్ల వైపే కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయం?

గ్రాండ్ ఓల్డ్ కాంగ్రెస్ పార్టీలో టీ పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి తీసుకున్న అనేక నిర్ణయాల విషయంలో కాంగ్రెస్ సీనియర్లు తప్పులు వెతికి మరీ చూపించే రేవంత్ రెడ్డి ని టార్గెట్ చేస్తున్నారా? ఇక దానిని అధిష్టానం కూడా పరిగణలోకి తీసుకుంటుందా? సీనియర్ల వైపే అధిష్టానం నిర్ణయాలు తీసుకుంటుందా? అందుకే రేవంత్ రెడ్డి ఈ విధంగా వ్యాఖ్యలు చేశారా అన్న చర్చ కూడా ప్రస్తుతం కొనసాగుతుంది. ఏదిఏమైనా తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో ముందుకు వెళ్లడం పైన కాకుండా, ఒకరినొకరు వెనక్కు లాక్కోవడం పైన దృష్టి పెట్టినట్టు తాజా పరిణామాలతో కనిపిస్తుంది.

Source link

Spread the love

Leave a Comment