మహిళను కిడ్నాప్ చేసే యత్నం, ప్రతిఘటించడంతో.. (వీడియో)
Google Oneindia TeluguNews

ఛండీగఢ్: హర్యానాలోని యమునానగర్‌లో శనివారం ఓ మహిళ కిడ్నాప్‌ ప్రయత్నం నుంచి తృటిలో తప్పించుకుంది. అయితే, ఈ ఘటన అంతా సమీపంలోని సీసీటీవీ కెమెరాలో రికార్డైంది. ఈ వీడియో దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

ఈ వీడియోలో ఓ మహిళను కిడ్నాప్ చేసేందుకు యత్నించిన నలుగురు దుండగులు ఆమె కేకలు వేయడం, తిరిగి పోరాడటంతో అక్కడ్నుంచి పారిపోయినట్లు కనిపిస్తుంది. ఘటనపై ఇప్పటికే కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు జరుపుతున్నారు.

Viral video: Woman Narrowly Escapes Kidnapping Attempt Outside Gym.

ఆగివున్న కారులో మహిళను కిడ్నాప్ చేసేందుకు ఇద్దరు వ్యక్తులు ప్రయత్నించారు. కారులో ఎక్కించి తలుపులు వేసేందుకు ప్రయత్నించగా.. ఆమె తీవ్రంగా ప్రతిఘటిస్తుంది. ఆ తర్వాత వారి నుంచి తప్పించుకుని పారిపోతుంది. దీంతో కిడ్నాప్ యత్నం విఫలమవుతుంది.

యమునానగర్ డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (డీఎస్పీ) తెలిపిన వివరాల ప్రకారం.. నలుగురు వ్యక్తులు మహిళ కారులోకి ఎక్కించి, ఆమెను కిడ్నాప్ చేయడానికి ప్రయత్నించారు.

‘జిమ్ తర్వాత ఆమె తన కారులో కూర్చొని ఉండగా, నలుగురు వ్యక్తులు ఆమెను కిడ్నాప్ చేయడానికి ప్రయత్నించారు. నిందితులలో ఒకరిని పట్టుకున్నారు’ అని డీఎస్పీ తెలిపారు. విచారణ ముగిసిన తర్వాతే నిందితుల ఉద్దేశం స్పష్టంగా తెలుస్తుందని ఆయన అన్నారు.

English summary

Viral video: Woman Narrowly Escapes Kidnapping Attempt Outside Gym.

Story first published: Sunday, January 1, 2023, 20:20

Source link

Spread the love

Leave a Comment