మేరీ ఎలిజబెత్: 24 ఏళ్లు సన్యాసినిగా జీవించాక ప్రేమలో పడిన సిస్టర్… ఆ తర్వాత ఆమె జీవితం ఎన్ని మలుపులు తిరిగింది?




సిస్టర్ మేరీ ఎలిజబెత్

సిస్టర్ మేరీ ఎలిజబెత్ కఠినమైన దైవభక్తితో, మౌనంగా సన్యాసిని (నన్)లా జీవించారు. ఆమె ఉత్తర ఇంగ్లాండ్‌లోని తన కార్మెలైట్ సెల్‌లో ఎక్కువ రోజులు గడిపారు.

అయితే అలాంటి మరో సన్యాసితో ఇటీవల ఆమె కలిశారు. ఆ తర్వాత ఆమెకు ఆ సన్యాసి నుంచి “మీ ఆజ్ఞను విడిచిపెట్టి నన్ను వివాహం చేసుకుంటారా?” అనే సందేశం వచ్చింది.

సన్యాసినిగా మారిన 24 సంవత్సరాల తర్వాత లాంకషైర్‌లో ఉన్న ప్రెస్టన్‌లోని కాన్వెంట్ పార్లర్‌లో ఆ సన్యాసి (మాంక్) స్లీవ్ పట్టుకోగానే ఎలిజబెత్‌కు ఇలా జరిగింది.

మేరీ ఎలిజబెత్ విషయంలో ఇది చాలా మార్పులకు దారితీసింది.

ఒకరోజు ఆక్స్‌ఫర్డ్‌లోని కార్మెలైట్ ప్రియరీ నుంచి ఫ్రయర్ రాబర్ట్‌ వచ్చారు. తినడానికి ఆయనకు ఏదైనా కావాలా అని తెలుసుకోవడానికి ఆర్డర్ ప్రియర్స్ ( సన్యాసినుల గ్రూపులో సుపీరియర్) ఎలిజబెత్‌ను తీసుకుని వెళ్లారు.

అయితే ప్రియర్స్‌కి ఫోన్ కాల్ రావడంతో మాట్లాడటానికి దూరంగా వెళ్లారు. దీంతో ఇద్దరు గదిలో ఒంటరిగా మిగిలిపోయారు.

“మేం ఒక గదిలో కలిసి ఉండటం ఇదే మొదటిసారి. ఆయన భోజనం చేస్తున్నప్పుడు టేబుల్ వద్ద కూర్చున్నా. ప్రియర్స్ తిరిగి రాకపోవడంతో నేనే ఆయనను బయటకు సాగనంపాల్సి వచ్చింది” అని అన్నారు ఎలిజబెత్.

మేరీ ఎలిజబెత్ రాబర్ట్‌ను తలుపు దగ్గర నుంచి బయటకు పంపేటపుడు, ఆమె ఆయన స్లీవ్‌ను క్లీన్ చేశారు. ఆ సమయంలో ఆమెకు ఏదో కుదుపు అనిపించిందని ఎలిజబెత్ చెప్పారు.

“ఏదో కెమిస్ట్రీ అనిపించింది. ఏదో ఉంది. కొంచెం ఇబ్బంది పడ్డాను. ఆయనకు నాలాగే అనిపించిందా? అని అనుకున్నా. ఆయన్ను తలుపు దగ్గర నుంచి బయటకు పంపేటపుడు ఇబ్బందిగా అనిపించింది” అని చెప్పారు ఎలిజబెత్.

ఒక వారం తర్వాత పెళ్లి చేసుకోవడానికి వస్తావా? అని రాబర్ట్ నుంచి సందేశం వచ్చిందని ఆమె గుర్తుచేసుకున్నారు.

“నేను కొంచెం షాక్ అయ్యాను. ఆ సమయంలో నేను ముసుగు వేసుకున్నా. నా జుట్టు రంగు కూడా ఆయన చూడలేదు.

ఆయనకు నిజంగా నా గురించి, నేను పెరిగిన విధానం గురించి తెలియదు. సరైన పేరు కూడా తెలియదు” అని ఎలిజబెత్ గుర్తుచేసుకున్నారు.

మేరీ ఎలిజబెత్

ఎలిజబెత్ ఎవరు, ఆమె నన్ ఎందుకయ్యారు?

19 సంవత్సరాల వయస్సులో సిస్టర్ మేరీ ఎలిజబెత్ కార్మెలైట్ ఆర్డర్‌లోకి ప్రవేశించారు. అంతకుముందు ఆమె పేరు లిసా టింక్లర్. మిడిల్స్‌బ్రోకు చెందిన మహిళ.

ఆమె తల్లిదండ్రులు మతపరమైనవారు కాదు. అయితే లౌర్దేస్‌కు తీర్థయాత్ర చేయడంతో ఆరేళ్ల లిసాలో ఏదో మేల్కొల్పింది. తన పడకగదిలో దైవపీఠం నిర్మించమని తన తండ్రిని కోరింది లిసా.

“నా దగ్గర ఒక చిన్న అవర్ లేడీ విగ్రహం, లూర్ద్ వాటర్ బాటిల్ ఉన్నాయి. నిజానికి అది పవిత్రమైన బాటిల్ అనుకున్నాను.

నేను కుళాయి నుంచి వాటర్ నింపి తాగేదాన్ని” అని లిసా చెప్పారు.

లిసా తన సొంత పట్టణంలోని ఒక రోమన్ క్యాథలిక్ చర్చికి వెళుతుంది. అక్కడ రెండో వరుసలో ఒంటరిగా కూర్చుంటుంది.

ఆమె యేసు తల్లి వర్జిన్ మేరీపై అమితమైన ప్రేమను పెంచుకుందని చెప్పింది. అదే ఒక వృత్తిగా భావిస్తున్నట్లు తెలిపింది.

ఆమె యుక్తవయసులో ఉన్నపుడు ఒక సన్యాసుల మఠంలో జరిగిన వారాంతపు కార్యక్రమంలో కాలింగ్ (పిలుపు) గురించి ఆమె ఒప్పించింది.

12వ శతాబ్దానికి చెందిన కార్మెలైట్ సన్యాసినుల వారసులు ఆ ఆశ్రమాన్ని నడిపించేవారు. అక్కడ జీవితం ముఖ్యంగా ఏకాంతమైనది, చాలా కఠినమైనది.

కానీ అదే ఆమె జీవించాలనుకుంటున్న జీవితం అని నిర్ణయించుకున్నారు.

లిసా వెంటనే చేరాలని భావించారు. అయితే లిసా నిర్ణయంపై ఆమె తల్లి కలత చెందారు.

ఆ ప్రక్రియను కొన్ని నెలలు ఆలస్యం చేయమని రహస్యంగా ఆశ్రమానికి తల్లి ఉత్తరం రాశారు. దాంతో లిసా ఇంట్లో మరో క్రిస్మస్ గడిపింది. ఆమె నూతన సంవత్సరంలోకి ప్రవేశించింది.

“అప్పటి నుంచి నేను సన్యాసినిలా జీవించాను. మాకు రోజుకు అరగంట పాటు రెండు సార్లు వినోదం ఉండేది. మాట్లాడుకునేవాళ్లం, లేకపోతే సెల్‌లో ఉండేదాన్ని.

మీరు ఎవరితోనూ పని చేయరు, మీకు మీరే” అని లిసా అన్నారు.

సంవత్సరాలు గడిచేకొద్దీ ఇతర సన్యాసులు, ఏళ్లుగా అక్కడే ఉన్న పెద్దవాళ్లైన సన్యాసులతో మాట్లాడుతుండటంతో ఎలిజబెత్ తన పదజాలం తగ్గిపోతోందని భావించారు.

వాతావరణం, పరిసరాలు ఆమెకు ఆ సమస్య తేలేదు. ఆమె తన తల్లిని కూడా సంవత్సరానికి నాలుగు సార్లు మాత్రమే చూశారు. అది కూడా గ్రిల్ ద్వారానే.

“నాకు 21వ పుట్టినరోజు ఉన్నప్పుడు, నా కేక్, నా కార్డులన్నీ డెస్కు నుంచే చేరాయి.

నా మేనల్లుడు పుట్టినప్పుడు అక్కడి టేబుల్ గుండా వెళ్లాడు” అంటూ చెబుతూ నవ్వారు ఎలిజబెత్.

బయట ప్రపంచం మూసుకుపోయి తన “అంతర్గత ప్రపంచం” తెరుచుకున్నట్లు ఆమె భావించిన తీరును ఇది వివరిస్తుంది. సంతృప్తి చెందిన అనుభూతి అయితే ఉంది.

కానీ, కాన్వెంట్ పార్లర్‌లో రాబర్ట్ భుజం తాకడంతో అంతా మారిపోయింది. సన్యాసిని జీవితాన్ని విడిచి పెళ్లి చేసుకుంటావా అని మెసేజ్‌ వచ్చేలా చేసింది.

రాబర్ట్

ఎలిజబెత్‌కు రాబర్ట్ ఇంతకుముందే ఎలా తెలుసు?

సిస్టర్ మేరీ ఎలిజబెత్ రాబర్ట్ ప్రశ్నకు సమాధానం ఇవ్వలేదు. ఏం చేయాలో అర్థం కాలేదు.

ఆయనకు ఆమె గురించి ఏం తెలియకపోవచ్చు, కానీ ఆమెకు ఆయన గురించి కొంచెం తెలుసు.

ఆయన ఆక్స్‌ఫర్డ్ నుంచి ప్రెస్టన్‌లోని కార్మెలైట్ రిట్రీట్ సెంటర్‌కు వచ్చేవారు. అప్పుడప్పుడు సమీపంలోని ఆశ్రమంలో ఆయన ఉపన్యాసాలను లిసా గ్రిల్ వెనుక నుంచి చూసేవారు.

ఆయన బోధనలు వినడం ద్వారా జర్మన్ సరిహద్దుకు సమీపంలో ఉన్న పోలాండ్‌లోని సిలేసియాలో జీవితం, ప్రేమ గురించి ఆమె తెలుసుకున్నారు .

ఆ సమయంలో అది తనపై ప్రభావం చూపినట్లు అనిపించలేదని ఆమె గుర్తుచేసుకున్నారు. ఇపుడు అంతా మారిపోయింది.

రాబర్ట్‌పై ఇష్టం ఉందని చెప్పాక ఇతరులు ఎలా స్పందించారు?

“ప్రేమలో ఉండటం ఎలా ఉంటుందో నాకు తెలియదు. సిస్టర్‌లు దాన్ని నా ముఖంలో చూస్తారని అనుకున్నాను.

కాబట్టి నాలో వచ్చిన మార్పును గమనించి, భయపడ్డాను” అని ఎలిజబెత్ చెప్పారు.

సిస్టర్ మేరీ ఎలిజబెత్ చివరికి ధైర్యం తెచ్చుకున్నారు. రాబర్ట్ పట్ల తనకు భావాలు ఉన్నాయని భావించినట్లు ప్రియర్స్‌తో చెప్పారు. కానీ ఆమె రియాక్షన్ నమ్మలేకపోయారు.

“మేం 24/7 ఆమె పర్యవేక్షణలో ఉండేవాళ్లం. అలాంటపుడు ఇది ఎలా సాధ్యమైందో ఆమెకు అర్థం కాలేదు. ఇంత తక్కువ పరిచయంలో ఎలా ప్రేమలో పడ్డావని ప్రియర్స్ అడిగారు” అని గుర్తుచేసుకున్నారు ఎలిజబెత్.

ఒకవేళ వదిలి వెళితే తన కుటుంబం, బిషప్‌ల రియాక్షన్ ఎలా ఉంటుందోనని అంతకుముందే సిస్టర్ ఎలిజబెత్ ఊహించారు.

దేవునితో తనకున్న సంబంధం మారుతుందా అని కూడా ఆమె మల్లగుల్లాలు పడ్డారు.

కానీ ఆమె ఉన్నతాధికారిని కలిసిన అనంతరం అసాధారణమైన పని చేశారు.

“ప్రియర్స్ నా మీద అలిగినట్లుంది. కాబట్టి నేను నా ప్యాంటు, టూత్ బ్రష్‌ను ఒక బ్యాగ్‌లో పెట్టుకుని బయటికి నడిచాను. నేను తిరిగి సిస్టర్ మేరీ ఎలిజబెత్‌లా రాలేను” అని లిసా అన్నారు.

అయితే రాబర్ట్ ఆ సాయంత్రం మళ్లీ ప్రెస్టన్‌ని సందర్శించాలనుకుంటున్నట్లు ఆమెకు సందేశం పంపారు.

ఈసారి సమీపంలోని పబ్‌ దగ్గర కార్మెలైట్ స్నేహితుడిని సలహా కోసం కలవడం జరిగింది. తమ సంకట స్థితి గురించి చెప్పుకునేందుకు విశ్వసించిన ఆర్డర్‌లోని మొదటి వ్యక్తి ఆయన.

రోడ్డు మార్గంలో ఒక మైలు దూరంలో ఉన్న బ్లాక్ బుల్ వద్ద వారు సమావేశమవుతారని లిసా ఊహించారు. అందుకే ఆమె అక్కడికి వెళ్లాలని నిర్ణయించుకున్నారు.

కానీ 2015 నవంబర్ రాత్రి లీసాకు సంతోషకరమైన క్షణంలా కాకుండా తీవ్ర గందరగోళ పరిచింది.

“నేను గార్‌స్టాంగ్ రోడ్‌లో నడుస్తున్నప్పుడు వర్షం కురుస్తోంది.

ట్రాఫిక్ ఎక్కువైపోయింది. వాహనాల లైట్లు పడుతున్నాయి. ‘నేను చేయగలనని అనుకున్నాను” అని లిసా క్షణిక ఆత్మహత్య ఆలోచనను ప్రస్తావిస్తూ చెప్పారు.

“నేను నిజంగా కష్టపడ్డాను. ఇది జరగకుండా ఆపాలని నేననుకున్నా. రాబర్ట్ తన జీవితాన్ని కొనసాగించగలడనుకున్నా.

అసలు పెళ్లి గురించి నాకేం చెప్పారోనని కూడా నేను ఆశ్చర్యపోయాను.” అని తెలిపారు లిసా.

లిసా బ్లాక్ బుల్ వెలుపల కోటు లేకుండానే శుక్రవారం రాత్రి తడుస్తూనే వెళ్లారు.

అక్కడి తెరిచి ఉన్న డోర్ నుంచి రాబర్ట్‌ను చూడగానే లోపలికి వెళ్లడానికి ధైర్యం తెచ్చుకుంది లిసా.

మేరీ ఎలిజబెత్

రాబర్ట్ ఎవరు? ఆయన నేపథ్యం ఏమిటి?

మరోవైపు “ఆమెను చూడగానే, నా గుండె ఆగిపోయింది” అని రాబర్ట్ అన్నారు.

“నిజానికి నేను భయంతో పడిపోయాను, ఆనందంతో కాదు. ఎందుకంటే నేను లిసా కోసం జీవించాలని ఆ క్షణంలో నాకు తెలుసు. అయితే మేం దానికి ఆచరణాత్మకంగా సిద్ధంగా లేమని కూడా నాకు తెలుసు” అని రాబర్ట్ వ్యాఖ్యానించారు.

రాబర్ట్ 13 సంవత్సరాలు కార్మెలైట్ సన్యాసిగా ఉన్నారు. ఆయన ఒక ఆలోచనాపరుడు, విద్యావేత్త, వేదాంతి.

ఆయన విశ్వాసం, గుర్తింపు అన్వేషణలో భాగంగా సన్యాసి జీవితాన్ని ఎంచుకున్నారు.

ఇప్పుడు వెనక్కి తిరిగి చూసుకుంటే ఆయన మూలాలు గందరగోళ పరుస్తున్నాయని భావిస్తున్నారు.

ఇటీవలే జర్మనీ నుంచి పోలాండ్‌కు మారిన ప్రాంతంలో లూథరన్ తండ్రి, క్యాథలిక్ తల్లితో పెరిగాడు రాబర్ట్.

కానీ విఫల బంధం తర్వాత ఆయనకు అవి చీకటి రోజులు. అయితే కార్మెలైట్ రోమన్ కాథలిక్ మఠంలో రాబర్ట్ ఓదార్పుని పొందారు.

“నాకు ఇంతకు ముందు కార్మెలైట్స్ గురించి పెద్దగా తెలియదు. సన్యాసిని అనుకోలేదు. నిజానికి ఇలాంటి వాటిపై నాకు అనుమానంగానే ఉండేది” అని రాబర్ట్ చెప్పారు.

అయితే చీకటి, కష్టాలు, సంక్షోభాన్ని ఎలా స్వీకరించాలో ఈ ఆర్డర్ తనకు నేర్పిందని రాబర్ట్ తెలిపారు. అయితే లిసా (ఎలిజబెత్)ను కలవడంతో ఆయన జీవితం మారిపోయింది.

రాబర్ట్‌

రాబర్ట్‌కు ఎందుకు భయమేసింది?

“నా స్లీవ్‌పై లిసా స్పర్శ ఒక మార్పును ప్రారంభించింది. కానీ నా హృదయంలో ఆ ప్రేమ భావన పెరిగి, ఇలాంటి స్థితికి వస్తానని మాత్రం అనుకోలేదు.

సన్యాసిగా ఉన్నపుడు ప్రేమ వంటి భావోద్వేగాలను ఎలా ఎదుర్కోవాలో నేర్పిస్తారు” అని రాబర్ట్ పేర్కొన్నారు.

లిసాకు సందేశం పంపినపుడు వివాహంపై తనలో తాను మేధోపరమైన సంఘర్షణకు గురైనట్లు రాబర్ట్ తెలిపారు.

“ఆమె పబ్‌ వద్ద కనిపించినప్పుడు నాలోని చిన్న భయం బయటికొచ్చింది. అయితే ఆ భయం మతపరమైనదో లేదా ఆధ్యాత్మికమో కాదు.

53 సంవత్సరాల వయస్సులో నేను కొత్త జీవితాన్ని ఎలా ప్రారంభించాలనే దానిపై కలిగింది” అని చెప్పారు.

ప్రారంభంలో మారిపోవడం కష్టం. వారిద్దరూ తమ సన్యాస జీవితాలను త్యజించిన తర్వాత క్రిస్మస్‌కు ముందు ఆ క్షణాలను లిసా గుర్తుచేసుకున్నారు.

“నేను రాబర్ట్ వైపు చూశాను. ఆయన చాలా బాధపడుతూ ఏడుస్తున్నారు. ఆ సమయంలో మేమిద్దరం అథమ స్థితికి చేరుకున్నాం.

రోమియో, జూలియట్‌ల వలె కథ ముగించాలని అనిపించింది” అని లిసా చెప్పారు.

“మేం ఇద్దరం చాలా ఒంటరిగా భావించాం. ముందుకు మార్గం తెలియదు. చాలా కష్టంగా అనిపించింది.

కానీ మేం చేతులు పట్టుకున్నాం. ముందుకెళ్లాం” ఆమె తెలిపారు.

ఉద్యోగ సందర్భంలో వారి నైపుణ్యాలను ప్రశ్నించినపుడు, ప్రెస్టన్ నుంచి యార్క్ షైర్‌కు డ్రైవింగ్ చేస్తున్నపుడు వాళ్లు కన్నీళ్లు పెట్టుకున్నట్లు చెప్పారు.

“వివిధ కారణాల వల్ల తమ ఆర్డర్‌లను విడిచిపెట్టిన సన్యాసినుల గురించి నేను పోలిష్‌లో ఒక పుస్తకాన్ని ఆర్డర్ చేశాను.

దాన్ని కారులో లిసా కోసం చదివి, అనువదించాను. అయితే ఆమె ఎం62 రహదారిపైకి వెళ్లింది.

వారి కథలు భావొద్వేగపూరితంగా ఉండటంతో మేం ఏడవవలసి వచ్చింది. మాకు వారితో సంబంధం ఉండొచ్చు” అని రాబర్ట్ చెప్పారు.

రాబర్ట్‌

లిసా, రాబర్ట్‌లు ఎలా సాంత్వన పొందారు?

లిసా, రాబర్ట్‌‌లకు శాంతిని కలిగించిన విషయం ఏమిటంటే వారి సన్యాసమే వారికి మార్గనిర్దేశం చేసింది. వారిలో వ్యక్తిగత విశ్వాసం నింపింది.

“అది మీ మతపరమైన జీవితం మీ హృదయాన్ని విడదీయబోదని, అది దేవుడి కోసమని చెప్పింది.

అకస్మాత్తుగా నా హృదయం రాబర్ట్‌ను పట్టుకోవడానికి వెళుతున్నట్లు నాకు అనిపించింది. కానీ నా దగ్గర ఏం ఉండేదో అదే ఇపుడుందని నేను గ్రహించాను.

భగవంతుని గురించి ఎలాంటి భిన్నమైన అనుభూతి లేదు. అది నాకు భరోసానిచ్చింది” అని లిసా తెలిపారు.

లిసా మొదట అంత్యక్రియల గృహంలో పని చేశారు. ఆ తరువాత ఆసుపత్రిలో చాప్లిన్‌గా పనిలో చేరారు.

ఇకపై కార్మెలైట్ ఆర్డర్‌లో సభ్యుడు కాదని రోమ్ నుంచి వచ్చిన లేఖతో రాబర్ట్ కలత చెందారు. అయితే కొద్దిరోజుల్లోనే రాబర్ట్‌కి చర్చ్ ఆఫ్ ఇంగ్లాండ్‌లోకి అనుమతి లభించింది.

వారిద్దరూ వివాహం చేసుకున్నారు. ఇప్పుడు నార్త్ యార్క్‌షైర్‌లోని హట్టన్ రడ్బీ గ్రామంలో ఉంటున్నారు. ఇక్కడ రాబర్ట్ స్థానిక చర్చికి వికార్‌గా నియమితులయ్యారు.

ఇరువురు చర్చి వెలుపల జీవితానికి అలవాటు పడటానికి ప్రయత్నిస్తున్నారు.

ముఖ్యంగా లిసా 24 సంవత్సరాలుగా ఒంటరిగా గడిపారు. రాబర్ట్‌లా విద్యాభ్యాసం చేయలేకపోయారు. బయటి ప్రపంచంలో పరిశీలించే వ్యక్తిగానే ఆమె మాట్లాడుతున్నారు.

ఇప్పుడు తనకు ఏ హెయిర్ స్టైల్‌లు, బట్టలు బాగా పనికి వస్తాయోనని వెతుకుతున్నారు లిసా.

అయితే వారిద్దరూ ఇప్పటికీ సన్యాసుల జీవితానికి సంబంధించిన అంశాలపైనే మాట్లాడుతున్నారు. రాబర్ట్, లేకపోతే తాను గానీ రేపు కార్మెలైట్ సన్యాసినిగా తిరిగి వస్తానని కూడా లిసా చెబుతున్నారు.

“మేం నిశ్శబ్దం, ఏకాంతానికి అలవాటు పడ్డాం. ఈ ప్రపంచంలో అది కనుక్కోవడం కష్టం. మీరు చాలా దిశల్లోకి లాగబడతారు.

కాబట్టి నేను, రాబర్ట్ స్థిరంగా ఉండటానికి నిరంతర పోరాటం చేస్తున్నాం” అని లిసా అంటున్నారు. కానీ వారు పరిష్కారాన్ని కనుగొన్నారు.

“నేను ఇక్కడ రాబర్ట్‌తో కలిసి ఆశ్రమంలోనే నివసిస్తున్నానని అనుకుంటున్నా. ఇక్కడ ఇద్దరు కార్మెలైట్లు మనం చేసే ప్రతి పనిని దేవునికి ఇచ్చినట్లు ఉంటుంది.

మనం ప్రార్థనలో మునిగిపోతుంటాం. కానీ ప్రేమ మీరు చేసే ప్రతిదానికీ పవిత్రమైన ప్రభావం చూపగలదు. నిజంగా ఏం మారలేదని గ్రహించాను ” అని లిసా అభిప్రాయ పడుతున్నారు.

పెళ్లిలో ముగ్గురు ఉన్నట్లు దంపతులిద్దరం భావించామని ఆమె చెబుతున్నారు.

“క్రీస్తు కేంద్రంలో ఉన్నాడు. అన్నింటికీ ముందు వస్తాడు. మనం ఆయన్ని సమీకరణం నుంచి బయటకు తీసేస్తే, ఇది జరగదని నేను భావిస్తున్నాను.” అని లిసా ముగించారు.

Surce link

Spread the love

Leave a Comment