యాదాద్రి లక్ష్మీనర్సింహస్వామిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము: ఢిల్లీకి రిటర్న్




Telangana

హైదరాబాద్: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఐదు రోజుల దక్షిణాది పర్యటన నేటితో ముగిసింది. పర్యటనలో చివరి రోజైన శుక్రవారం యాదాద్రిలో పర్యటించి.. లక్ష్మీనర్సింహస్వామి వారిని దర్శించుకున్నారు రాష్ట్రపతి ముర్ము. స్వామివారి దర్శనానికి వచ్చిన రాష్ట్రపతికి మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, జగదీశ్ రెడ్డి, సత్యవతి రాథోడ్, ప్రభుత్వ విప్ గొంగిడి సునీతతోపాటు ఆలయ అధికారులు ఘనంగా స్వాగతం పలికారు.

రాష్ట్రపతి వెంట తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఉన్నారు. రాష్ట్రపతి ముర్ముకు యాదాద్రి ఆలయ అర్చకులు మంగళ వాద్యాలు, పూర్ణకుంభంతో స్వాతం పలికారు. గర్భాలయంలో యాదాద్రి లక్ష్మీనర్సింహస్వామిని రాష్ట్రపతి దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు అర్చకులు.. చతుర్వేద ఆశీర్వచనాలు అందించారు.

 President Droupadi Murmu Offers special worship at Yadadri Temple: her south india tour ended, left for delhi

యాదాద్రి ఆలయ క్షేత్రాన్ని పరిశీలించిన రాష్ట్రపతి.. అద్భుతమైన శిల్పకళను చూసి సంభ్రమాశ్చర్యాలు వ్యక్తం చేశారు. ఆలయ సందర్శన అనంతరం తిరిగివచ్చిన ద్రౌపది ముర్ము.. రాష్ట్రపతి నిలయంలో విందు కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి గవర్నర్ తమిళిసై, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, స్పీకర్ పోచారం శ్రీనివాస్, పలువురు మంత్రులు, ఎంపీలు బండి సంజయ్, రేవంత్ రెడ్డి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, ప్రజా గాయకుడు గద్దర్ కూడా ఈ విందుకు హాజరయ్యారు.

అనంతరం ద్రౌపదీ ముర్ము హైదరాబాద్ హకీంపేట ఎయిర్ బేస్ నుంచి ఢిల్లీకి పయనమయ్యారు. రాష్ట్రపతికి తమిళిసై, మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి వీడ్కోలు పలికారు. గత కొద్ది రోజుల క్రితం తెలుగు రాష్ట్రాలకు విచ్చేసిన రాష్ట్రపతి ముర్ము.. పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. వీటితోపాటు ప్రముఖ పుణ్యక్షేత్రాలు తిరుపతి, భద్రాచలం, రామప్ప ఆలయాలను దర్శించుకున్నారు.

English summary

President Droupadi Murmu Offers special worship at Yadadri Temple: her south india tour ended today, left for delhi.

Story first published: Friday, December 30, 2022, 19:44

Source link

Spread the love

Leave a Comment