రఘురామ కృష్ణంరాజుకు కొత్త ఇష్యూ దొరికింది మరి..!!
ప్రతిపక్షాల అభ్యంతరం..

ప్రతిపక్షాల అభ్యంతరం..

దీనిపై ప్రతిపక్ష పార్టీలు మండిపడుతున్నాయి. ప్రజాస్వామ్యంలో నిరసనలు తెలియజేసే హక్కు రాజకీయ పార్టీలకు ఉందని, దాన్ని అణచివేయడానికే జగన్ ప్రభుత్వం ఈ జీవోను తీసుకొచ్చిందంటూ ఆరోపిస్తోన్నాయి. ఇదే నెలలో తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీమంత్రి నారా లోకేష్ చేపట్టదలిచిన పాదయాత్రతో పాటు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ నిర్వహించతలపెట్టిన వారాహి బస్సు యాత్రను అడ్డుకోవడానికే ఈ జీవో తెచ్చారనే విమర్శలు షురూ అయ్యాయి.

గొంతు కలిపిన వైసీపీ రెబెల్ ఎంపీ..

గొంతు కలిపిన వైసీపీ రెబెల్ ఎంపీ..

ఎప్పట్లాగే- వైఎస్ఆర్సీపీ తిరుగుబాటు ఎంపీ రఘురామ కృష్ణంరాజు ప్రతిపక్షాలతో గొంతు కలిపారు. రోడ్లపై బహిరంగ సభలు, ర్యాలీలను నిషేధించడాన్ని తప్పు పట్టారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ఘాటు విమర్శలు గుప్పించారు. చంద్రబాబు నాయుడి సభల్లో తొక్కిసలాటలు సంభవించడానికి అసలు కారణం ప్రభుత్వమేనని ఆరోపించారు. చంద్రబాబు సభలను నిషేధించడానికి తొక్కిసలాటలను సృష్టించినట్లు కనిపిస్తోందని ధ్వజమెత్తారు.
రక్షణ కల్పించలేకపోతే..

రక్షణ కల్పించలేకపోతే..

ప్రతిపక్ష నాయకులు నిర్వహించే సభలకు పోలీసుల రక్షణ కల్పించకపోతే అధికారంలో ఉండి ఉపయోగం లేదని రఘురామ మండిపడ్డారు. ఆందోళనలు చేయడానికి రాజ్యాంగబద్ధంగా, ప్రజాస్వామ్యయుతంగా ప్రతిపక్షాలకు ఉన్న హక్కులను హరించేలా వ్యవహరిస్తానంటే కుదరదని అన్నారు. తనకు ఈ రాజ్యాంగంతో సంబంధం లేదని ప్రచారం చేస్తూ ముందస్తు ఎన్నికలకు వెళ్లాలని, నెగ్గుతావో, లేదో చూసుకోవాలని సూచించారు.

ఒక్క క్షణం కూడా..

ఒక్క క్షణం కూడా..

ఈ జీవో నంబర్ 1 అమలులోకి వచ్చిన తరువాత- ముఖ్యమంత్రి హోదాలో కొనసాగే అర్హతను వైఎస్ జగన్ కోల్పోయారని రఘురామ ఆరోపించారు. జీవో వచ్చిన రోజే జగన్ నిర్వహించిన రాజమహేంద్రవరం పర్యటనను బట్టి చూస్తే- ఈ జీవో ఇంకా అమలులోకి రాలేదనే తాను అనుకుంటున్నానని వ్యాఖ్యానించారు. దీన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలని చెప్పారు. ప్రతిపక్ష నాయకుల సభలకు రక్షణ కల్పించేలా, పోలీసులు తమ విధులను తాము నిర్వహించేలా జగన్ తక్షణ చర్యలు తీసుకోవాలని సూచించారు.
ఈ పోలీసులే కాదా..

ఈ పోలీసులే కాదా..

ప్రతిపక్ష నేత హోదాలో వైఎస్ జగన్ రెండు సంవత్సరాల పాటు నిర్వహించిన పాదయాత్రలో ఆయనకు రక్షణ కల్పించింది ఈ పోలీసులే కాదా? అని రఘురామ కృష్ణంరాజు ప్రశ్నించారు. బహిరంగ సభలను నిషేధించడం ద్వారా జగన్ తప్పు చేశారని, ఇప్పటికైనా ఆయన తన తప్పును తాను తెలుసుకోవాలని పేర్కొన్నారు.

ర్యాలీలు రోడ్లపై కాకపోతే..

ర్యాలీలు రోడ్లపై కాకపోతే..

వైఎస్ జగన్‌, ఆయన కుటుంబ సభ్యులందరూ అయిదు సంవత్సరాల పాటు రోడ్లపైనే సభలు, ర్యాలీలను నిర్వహించరని, అధికారంలోకి వచ్చాక ఇప్పుడు రోడ్లపై ర్యాలీలు, సభలను నిషేధించడం సరికాదని రఘురామ అన్నారు. ర్యాలీలు రోడ్లపై కాకపోతే గాల్లో చేస్తారా? అని ప్రశ్నించారు. ఈ అయిదు సంవత్సరాల్లో గత ప్రభుత్వం ర్యాలీలను నిషేధించలేదని, చిన్న ఘటన కూడా జరగకుండా చూసిందని గుర్తు చేశారు. రాజకీయపార్టీల సభలకు పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయడం ప్రభుత్వానికి చేత కాదని అర్ధం చేసుకోవాల్సి వస్తోందని అన్నారు.
జగన్‌కు థ్యాంక్స్ చెప్పిన కేఏ పాల్- హైకోర్టులో పిటీషన్ వేశా..!!జగన్‌కు థ్యాంక్స్ చెప్పిన కేఏ పాల్- హైకోర్టులో పిటీషన్ వేశా..!!

Source link

Spread the love

Leave a Comment