వంగవీటి రాధాకు టీడీపీ తాజా ఆఫర్ – ఆ నియోజకవర్గాల్లో సీనియర్ల దారెటు..!?




వంగవీటి రాధాకు టీడీపీ నేతల ఆఫర్..

వంగవీటి రాధాకు టీడీపీ నేతల ఆఫర్..

2019 ఎన్నికల వేళ వంగవీటి రాధా టీడీపీలో చేరారు. గత ఎన్నికల్లో టీడీపీకి మద్దతుగా ప్రచారం చేసారు. ఎన్నికల్లో పోటీ చేయలేదు. టీడీపీ అధికారంలోకి వస్తే ఎమ్మెల్సీ ఇస్తారనే ప్రచారం సాగింది. అమరావతి ఉద్యమానికి రాధా మద్దతు ప్రకటించారు. జనసేన కొంత కాలంగా ఏపీ రాజకీయాల్లో యాక్టివ్ అవుతున్న సమయంలో వంగవీటి రాధా జనసేనలోకి వెళ్తారంటూ ప్రచారం సాగింది. జనసేన ముఖ్య నేత నాదెండ్ల మనోహర్ విజయవాడలో వంగవీటితో భేటీ అయ్యారు. కానీ, ఇప్పుడు టీడీపీ – జనసేన పొత్తు ఖాయం కావటంతో టీడీపీ నుంచే రాధా పోటీ చేసే విధంగా ముఖ్య నేతలు మంతనాలు సాగిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. రాధా 2019 ఎన్నికల్లో విజయవాడ సెంట్రల్ కేటాయించని కారణంగానే పార్టీ వీడారు. ఇప్పుడు అదే సీటు టీడీపీ నుంచి ఇచ్చేందుకు ముందుకు వచ్చినట్లు తెలుస్తోంది.

బోండా ఉమా ఏం చేయబోతున్నారు...

బోండా ఉమా ఏం చేయబోతున్నారు…

విజయవాడ సెంట్రల్ లో బోండా ఉమా టీడీపీ ఇంఛార్జ్ గా ఉన్నారు. ఇదే నియోజకవర్గం నుంచి వంగవీటి రాధా 2009లో ప్రజారాజ్యం నుంచి పోటీ చేసి అప్పటి కాంగ్రెస్ అభ్యర్ధి మల్లాది విష్ణు పై ఓడిపోయారు. 2014లో టీడీపీ నుంచి పోటీ చేసిన బోండా ఉమా విజయం సాధించారు. 2019 ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీ చేసిన మల్లాది విష్ణు 25 ఓట్ల స్వల్ప మెజార్టీతో విజయం సాధించారు. ఇప్పుడు రానున్న ఎన్నికల కోసం సిద్దం అవుతున్నారు. ఇప్పుడు వంగవీటి రాధాకు విజయవాడ సెంట్రల్ కేటాయిస్తే బోండా ఉమాకు ప్రత్యామ్నాయం ఎక్కడ చూపిస్తారనే చర్చ సాగుతోంది. ఉమా పోటీ చేస్తే సెంట్రల్ నుంచి మాత్రమే చేస్తారని ఆయన అనుచరులు చెబుతున్నారు. అధికారంలోకి వచ్చిన తరువాత ఎమ్మెల్సీ ఇస్తామని టీడీపీ నాయకత్వం హామీ ఇస్తే ఉమా రాజీ పడతారా..లేక, కొత్త నిర్ణయాలు తీసుకుంటారా అనేది ఇప్పుడు బెజవాడ రాజకీయాల్లో చర్చకు కారణం అవుతోంది.

పశ్చిమంలోనూ సీటు పంచాయితీ...

పశ్చిమంలోనూ సీటు పంచాయితీ…

విజయవాడ పశ్చిమంలోనూ టీడీపీ – జనసేన పొత్తుతో కొత్త చర్చ మొదలైంది. పశ్చిమం నుంచి జనసేన అభ్యర్ధిగా పోతిన మహేష్ సీటు ఆశిస్తున్నారు. అక్కడ టీడీపీ నుంచి తాను పోటీ చేస్తానంటూ తాజాగా బుద్దా వెంకన్న ప్రకటించారు. ఇప్పటికే నాగుల్ మీరా రేసులో ఉన్నారు. వైసీపీ నుంచి తిరిగి మాజీ మంత్రి వెల్లంపల్లికి దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. జనసేనకు నుంచి పోతిన మహేష్ కు ఇస్తే టీడీపీ నేతలకు ఎటువంటి హామీ ఇస్తారు.. ఏ విధంగా సహకరిస్తారనేది పొలిటికల్ సర్కిల్స్ లో చర్చకు కారణమవుతోంది. విజయవాడ తూర్పు నుంచి టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్న గద్దే రామ్మోహన్ ను వచ్చే ఎన్నికల్లో గన్నవరం నుంచి పోటీ చేయించాలని భావిస్తున్నారు. అదే జరిగితే తూర్పు నుంచి గద్దే సూచించిన వారికి సీటు ఇస్తారా.. లేక, కొత్తగా సర్దుబాట్లు చేస్తారా అనేది చూడాల్సి ఉంది.




Source link

Spread the love

Leave a Comment