వందే భారత్ ఎక్స్‌ప్రెస్ సికింద్రాబాద్ టు విశాఖ: ముహూర్తం ఫిక్స్; ప్రత్యేకతలివే.. ఎక్కడెక్కడ ఆగుతుందంతే!!
మోడీ చేతుల మీదుగా వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ ప్రారంభానికి ముహూర్తం

మోడీ చేతుల మీదుగా వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ ప్రారంభానికి ముహూర్తం

అయితే ఈ నెల 19వ తేదీన ప్రధాని మోడీ చేతుల మీదుగా ప్రారంభం కానున్న సికింద్రాబాద్ నుండి విజయవాడ వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ ను విశాఖపట్నం వరకు నడపాలని రైల్వే శాఖ నిర్ణయం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేటాయించిన వందే భారత్ ఎక్స్ ప్రెస్ కొంత జాప్యం అయ్యే అవకాశం ఉన్న కారణంగా రైల్వే శాఖ తెలంగాణలో సికింద్రాబాద్ నుండి విజయవాడ వరకు కేటాయించిన ఎక్స్‌ప్రెస్‌ ని విశాఖపట్నం వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది.

ఏఏ స్టేషన్ లలో వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ ఆగుతుందంతే

ఏఏ స్టేషన్ లలో వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ ఆగుతుందంతే

ప్రధాని నరేంద్ర మోడీ జెండా ఊపి ప్రారంభించనున్న ఈ వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ వరంగల్, ఖమ్మం, విజయవాడ, రాజమండ్రి స్టేషన్ లలో ఆగుతుందని చివరకు వైజాగ్ చేరుకుంటుందని అధికారులు చెబుతున్నారు. ఇక ఇదే విషయాన్ని టూరిజం శాఖ మంత్రి కిషన్ రెడ్డి కూడా వెల్లడించారు. జనవరి 12 వ తేదీన తెలంగాణ రాష్ట్రంలో పర్యటించనున్న ప్రధాని నరేంద్ర మోడీ ఈ రైలును ప్రారంభించడంతో పాటు, మరో మూడు ప్రాజెక్టులను జాతికి అంకితం చేస్తారు.
తెలుగు రాష్ట్రాల్లో 8వ రైలుగా వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌

తెలుగు రాష్ట్రాల్లో 8వ రైలుగా వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌

ఉదయం 10:00 నుంచి ఆయన అనేక కార్యక్రమాలలో పాల్గొంటారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పునర్నిర్మాణ పనుల్ని కూడా ప్రారంభిస్తారు. ఇదిలా ఉంటే భారతదేశంలో ఇప్పటి వరకూ ఏడు వందే భారత్ రైళ్లు అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలు ప్రయాణికులకు 8వ రైలు గా వస్తున్న వందే భారత్ రైలు సేవలు అందించనుంది. సికింద్రాబాద్ నుండి కాజీపేట మీదుగా విజయవాడకు, అక్కడి నుండి రాజమండ్రి మీదుగా విశాఖకు ఈ రైలు ప్రయాణం సాగనుంది.

 వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ లో ఫీచర్లు ఇవే

వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ లో ఫీచర్లు ఇవే

ఇక వందే భారత్ రైలులో ఫీచర్లు చూస్తే చాలా అధునాతనంగా ఉండే ఈ రైలులో ఆటోమేటిక్ డోర్ సిస్టమ్ ఉంటుంది. మొత్తం 16 కోచ్ లు ఉండే ఈ రైలులో 1128 సీట్లు అందుబాటులో ఉంటాయి. గంటకు 180 కిలోమీటర్ల వేగంతో ఈ రైళ్లు దూసుకుపోతాయి. దీంతో మిగతా రైళ్ళ తో పోల్చుకుంటే చాలా వరకు ప్రయాణ సమయం ఆదా అవుతుంది. ఈ రైళ్లలో వైఫై, హాట్ స్పాట్ ఫెసిలిటీ ఉంటుంది. సీట్లు చాలా సౌకర్యవంతంగా ఉంటాయి.
సికింద్రాబాద్ నుండి వైజాగ్ వరకు ప్రయాణాన్ని ఎంజాయ్ చెయ్యండి

సికింద్రాబాద్ నుండి వైజాగ్ వరకు ప్రయాణాన్ని ఎంజాయ్ చెయ్యండి

జిపిఎస్ బేస్డ్ ఆడియో విజువల్ ప్యాసింజర్ ఇన్ఫర్మేషన్ సిస్టం అందుబాటులో ఉంటుంది. అంతేకాదు బయో వ్యాక్యూమ్ టాయిలెట్స్ ఉంటాయి. దివ్యాంగులకు అనుకూలంగా వాష్ రూమ్స్ ఉంటాయి. ప్రతి కోచ్ కు ప్యాంట్రీ సదుపాయం ఉంటుంది. ఇక మంచి అధునాతన సదుపాయాలతో వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ లో సికింద్రాబాద్ నుండి వైజాగ్ వరకు ప్రయాణాన్ని ఎంజాయ్ చేయడానికి త్వరలోనే వందే భారత్ రైలు పట్టాలెక్కబోతుంది.

Source link

Spread the love

Leave a Comment