విరూపాక్ష’ కు సీక్వెల్‌ పై క్లారిటీ ఇచ్చిన దర్శకుడు కార్తిక్ దండు!

సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ నటించిన ‘విరూపాక్ష’

సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ నటించిన ‘విరూపాక్ష’ మూవీ పాజిటీవ్ టాక్‌ను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. కార్తీక్ దండు దర్శకత్వం వహించిన ఈ చిత్రం శుక్రవారం (ఏప్రిల్ 21న) రిలీజైంది.

ఈ మూవీకి కలెక్షన్ల వర్షం కురుస్తున్న నేపథ్యంలో మెగా అభిమానులు పండుగ చేసుకుంటున్నారు. దీంతో ఈ మూవీ సిక్వెల్‌పై కూడా చర్చ నడుస్తోంది. ఈ నేపథ్యంలో ఈ మూవీ దర్శకుడు కార్తీక్ దండు అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పారు.

కార్తీక్ ఓ టీవీ చానెల్ ఇంటర్వూలో ఓ ప్రేక్షకుడు ‘విరూపాక్ష’కు సీక్వెల్ వస్తుందా అని అడిగాడు. దీనిపై కార్తీక్ స్పందిస్తూ.. ‘‘ఇప్పటికైతే అనుకోలేదు. నేను, సుకుమార్ ప్లాన్ చేస్తున్నాం. తప్పకుండా సీక్వెల్ ఉంటుంది.

కానీ, వెంటనే రాకపోవచ్చు’’ అని తెలిపారు. అయితే, ఈ మూవీలో ఉన్న రెండు పాటల్లో కేవలం ఒక పాట మాత్రమే థియేటర్లో ఉందని, రెండోది లేదని అడగ్గా.. ఓటీటీలో రిలీజ్ చేసేప్పుడు ఆ పాటను చేర్చుతామన్నారు. థియేటర్‌లో థ్రిల్ మిస్సవ్వకూడదనే ఉద్దేశంతోనే ఆ పాటను తొలగించినట్లు వెల్లడించారు.

‘విరూపాక్ష’ మూవీని ముందుగా పాన్ ఇండియా మూవీగా రిలీజ్ చేయాలని అనుకున్నారు.

‘విరూపాక్ష’ మూవీని ముందుగా పాన్ ఇండియా మూవీగా రిలీజ్ చేయాలని అనుకున్నారు. ఆఖరి క్షణంలో ఆ నిర్ణయాన్ని వాయిదా వేసుకున్నారు. కేవలం తెలుగు, తమిళ భాషల్లో మాత్రమే రిలీజ్ చేశారు. విడుదల రోజే మూవీకి హిట్ టాక్ రావడం, వీకెండ్‌లో ఈ మూవీకి పోటీగా మరే సినిమాలు లేకపోవడం ‘విరూపాక్ష’కు కలిసొచ్చింది. దీంతో తెలుగు రాష్ట్రాల్లో ఊహించని విధంగా కలెక్షన్లు వస్తున్నాయి.

కేవలం రెండు రోజులు మాత్రమే బాక్సాఫీస్ బ్రేక్ చేస్తోంది

కేవలం రెండు రోజుల వ్యవధిలోనే రూ.18 కోట్ల క్లబ్‌లోకి చేరింది ఈ మూవీ. ఒక్ నిజాంలోనే 4.53 కోట్లు వసూళ్లు చేసింది ఈ మూవీ. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర, సుకుమార్ పతాకాలపై బాపినీడు బి సమర్పణలో బీవీఎస్‌ఎన్ ప్రసాద్ ‘విరూపాక్ష’ సినిమాను నిర్మించారు.

సాయి ధరమ్ తేజ్ హిట్ అందుకోవడం పట్ల మెగా అభిమానులు ఫుల్ హ్యాపీగా ఉన్నారు. బైక్ యాక్సిడెంట్ అయిన తర్వాత సాయి ధరమ్ తేజ్ నటించిన తొలి చిత్రం ‘విరూపాక్ష’ కావడంతో అభిమానులలో ఈ మూవీపై ఆసక్తి నెలకొంది.

విరూపాక్ష సినిమా పబ్లిక్ టాక్

అంతేకాకుండా రెగ్యులర్ కమర్షియల్ కథతో కాకుండా మిస్టరీ థ్రిల్లర్ కాన్సెప్ట్ ఎంపిక చేసుకోవడం కూడా సాయి ధరమ్ తేజ్‌కు ప్లస్ అయ్యింది. మొత్తంగా సినిమా బావుందని చాలా మంది సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఈ దెబ్బతో సాయి కెరీర్ మళ్లీ గాడిన పడటం ఖాయమని అంటున్నారు.


Spread the love

Leave a Comment