వీరమల్లు కోసం పాట పాడనున్న పవన్ ..!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరో సారి గొంతు సవరించుకుంటున్నారు. క్రిష్ దర్శకత్వంలో ఎ.ఎమ్.రత్నం నిర్మిస్తున్న ‘హరిహర వీరు మల్లు’ కోసం తను పాటపాడునున్నారు. ఈ సినిమా, కొన్ని కారణాల వలన ఆలస్యమవుతూ వస్తుండడం తెలిసిందే.

హరిహర వీరు మల్లు

ఇక సాధ్యమైనంత త్వరగా ఈ సినిమాను పూర్తిచేసే పనిలో పవన్ ఉన్నారు. ఆ దిశగానే ప్రాజెక్టులో మళ్లీ కదలిక మొదలైంది. ఈ సినిమాలో పవన్ కల్యాణ్ తో ఒక పాట పాడించే ఆలోచన చేశాడట దర్శకుడు క్రిష్. ఆ పాటను పవన్ పాడితేనే బాగుంటుందని భావించి, ఆయనను ఒప్పించాడని అంటున్నారు.

పవన్ కి తగినట్టుగా కీరవాణి ట్యూన్ చేశారని చెబుతున్నారు.సినిమాలో ఒక కీలకమైన సందర్భంలో ఈ పాట వస్తుందని అంటున్నారు. ఈ పాటను రికార్డు చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయని సమాచారం.

గతంలో పాడిన పాటలు ప్రత్యేకమైన ఆకర్షణగా నిలిచాయి

గతంలో పవన్ ‘తమ్ముడు’ .. ‘ గుడుంబా శంకర్’ .. ‘జానీ’ .. ‘అత్తారింటికి దారేది’ .. ‘అజ్ఞాతవాసి’ సినిమాల కోసం పాడారు. ఆయన పాడిన ఆ పాటలు ఆ సినిమాలకి ప్రత్యేకమైన ఆకర్షణగా నిలిచాయి.

అలాగే ‘వీరమల్లు’ సినిమాలోని పవన్ పాట కూడా ఒక రేంజ్ లో పాప్యులర్ అవుతుందని భావిస్తున్నారు. ఈ సినిమాలో కథానాయికగా నిధి అగర్వాల్ అలరించనుంది.

Spread the love

Leave a Comment