వైఎస్ జగన్‌ వేర్పాటువాద ముద్ర- సింగర్ అద్నాన్ సమీ సంచలనం

గోల్డెన్ గ్లోబ్ తో మరో మెట్టు..

ఇప్పుడు తాజాగా ప్రతిష్ఠాత్మక గోల్డెన్ గ్లోబ్ 2023 అవార్డును అందుకుంది. మరో మెట్టు పైకి ఎక్కిందీ మూవీ. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో ఈ అవార్డును అందుకుంది. ఈ సినిమాలోని సూపర్ హిట్ పాట నాటు నాటు.. ఈ కేటగిరీలో బెస్ట్ ఒరిజినల్ ట్రాక్ అవార్డును సొంతం చేసుకుంది. అమెరికా కాలిఫోర్నియాలోని బేవర్లీ హిల్స్ లోని బేవర్లీ హిల్టన్ హోటల్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి.. ఈ పురస్కారాన్ని అందుకున్నారు.

జగన్‌పై విమర్శలు..

జగన్‌పై విమర్శలు..

కాగా- ఈ అవార్డు దక్కడంపై చిత్రం యూనిట్‌పై ప్రశంసల సునామీ కురిసింది. ఆర్ఆర్ఆర్ టీమ్‌ను అభినందిస్తూ సోషల్ మీడియాలో వేల సంఖ్యలో ట్వీట్లు పోస్ట్ అయ్యాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి- ఆర్‌ఆర్‌ఆర్‌ యూనిట్‌కు శుభాకాంక్షలు తెలిపారు. అంతర్జాతీయ వేదికపై తెలుగు జెండాను రెపరెపలాడించారని ప్రశంసించారు. తెలుగువాడికి ఇది గర్వకారణమని, మూవీ యూనిట్‌ను చూసి తాము గర్వపడుతున్నామని చెప్పారు.

మంత్రుల కౌంటర్ అటాక్..

మంత్రుల కౌంటర్ అటాక్..

అద్నాన్ సమీపై మంత్రులు విడదల రజిని, గుడివాడ అమర్‌నాథ్, తిరుపతికి చెందిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లోక్‌సభ సభ్యుడు డాక్టర్ మద్దిళ్ల గురుమూర్తి ఎదురుదాడికి దిగారు. తమ సొంత రాష్ట్రానికి, భాషకు అంతర్జాతీయంగా గుర్తింపును తీసుకుని రావడం వల్ల గర్వపడటం.. వారి దేశభక్తిని తగ్గించదని హితబోధ చేశారు. తమ మూలాన్ని తాము గౌరవించుకోవడం వేర్పాటువాదం అనిపించుకోదని అన్నారు. అతిగా ఆలోచించకుండా దేశానికి మరో గోల్డెన్‌ గ్లోబ్‌ను అందించడానికి కృషి చేయాలని సూచించారు.

తెలుగువాడిగా గర్వపడుతున్నాం..

తెలుగువాడిగా గర్వపడుతున్నాం..

అద్నాన్ సమీకి మంత్రి గుడివాడ అమర్‌నాథ్ ఘాటుగా రిప్లై ఇచ్చారు. మన భాష, మన సంస్కృతి, మన గుర్తింపు గురించి తాము గర్విస్తున్నామని తేల్చి చెప్పారు. తాము తెలుగు వాళ్లం అని మళ్లీ మళ్లీ పునరుద్ఘాటిస్తున్నానని పేర్కొన్నారు. తెలుగు వాళ్ల దేశభక్తి గురించి తీర్పు చెప్పడానికి మీరెవరంటూ ప్రశ్నించారు. తెలుగువాడిననే గర్వం.. భారతీయుడిగా తన గుర్తింపును దూరం చేయదని సూచించారు.

ప్రశంసలు..

ప్రశంసలు..

కాగా- ఈ అవార్డు దక్కడంపై చిత్రం యూనిట్‌పై ప్రశంసల సునామీ కురిసింది. ఆర్ఆర్ఆర్ టీమ్‌ను అభినందిస్తూ సోషల్ మీడియాలో వేల సంఖ్యలో ట్వీట్లు పోస్ట్ అయ్యాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి- ఆర్‌ఆర్‌ఆర్‌ యూనిట్‌కు శుభాకాంక్షలు తెలిపారు. అంతర్జాతీయ వేదికపై తెలుగు జెండాను రెపరెపలాడించారని ప్రశంసించారు. తెలుగువాడికి ఇది గర్వకారణమని, మూవీ యూనిట్‌ను చూసి తాము గర్వపడుతున్నామని చెప్పారు.

Source link

Spread the love

Leave a Comment