సీఎంఓకు థాంక్స్ – శృతి హాసన్ ను భయపెట్టారు: వీరసింహారెడ్డి కూడా : చిరంజీవి..!!




వేదిక మార్పు పై మెగా కామెంట్స్

వేదిక మార్పు పై మెగా కామెంట్స్

వాల్తేరు ప్రీ రిలీజ్ ఈవెంట్ విశాఖలో సక్సెస్ అయింది. మెగాస్టార్ చిరంజీవి సినిమా ఖచ్చితంగా మరో బ్లాక్ బస్టర్ గా నిలుస్తుందని ధీమాగా చెప్పారు. సినిమా కోసం దర్శకుడు బాబీ ఎంతగా కష్టపడ్డారో వివరించారు. నిర్మాతలను ప్రశంసించారు. చిరంజీవి విశాఖ పైన తన ప్రేమను చాటుకున్నారు. తాను విశాఖ వాసిగా ఉండాలనేది తన కోరికని చెప్పుకొచ్చారు. ఎటువంటి కుట్ర కుతంత్రాలు లేకుండా ప్రశాంతంగా జీవించే ప్రజలు ఇక్కడ ఉన్నారని అభినందించారు. సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ వేదిక మార్పు పైన ఆసక్తి కర వ్యాఖ్యలు చేసారు. ఆర్కే బీచ్ లో ఈవెంట్ నిర్వహించి ఉంటే ఇంత సక్సెస్ అయ్యేది కాదేమోనని చిరంజీవి వ్యాఖ్యానించారు. వేదిక మార్చటం వలనే ఈ స్థాయిలో అభిమానులు రావటం..ఇంతగా సక్సెస్ అయిందని చెప్పుకొచ్చారు.

వీరసింహారెడ్డి సక్సెస్ అవ్వాలి

వీరసింహారెడ్డి సక్సెస్ అవ్వాలి

ప్రీ రిలీజ్ ఈవెంట్ కు సహకరించిన అధికారులకు ధన్యవాదాలు చెప్పిన చిరంజీవి..సీఎంఓ కూడా సూచనలు చేసిందటం అంటూ వ్యాఖ్యానించారు. సీఎం జగన్.. ప్రభుత్వం పేరు ఎక్కడా చిరంజీవి ప్రస్తావన చేయలేదు. సీఎంఓకు ధన్యవాదాలు చెప్పారు. ఒకే నిర్మాత ఒకే సమయంలో రెండు సినిమాలు పూర్తి చేయటం..ఒకే సమయంలో విడుదల చేయటం తన సినిమా కెరీర్ లో ఎప్పుడూ చూడలేదన్నారు. మైత్రి సంస్థ నిర్మాణం పూర్తి చేసి సంక్రాంతికి విడుదల అవుతున్న తన సినిమా వాల్తేరు వీరయ్యతో పాటుగా వీరసింహారెడ్డి కూడా సక్సెస్ కావాలని చిరంజీవి ఆకాంక్షించారు. ఒకదాని తరువాత మరో సినిమా నిర్మాణం చేస్తే మంచిందని నిర్మాతలకు సూచించారు. తన సినిమాతో పాటుగా వీరసింహారెడ్డి సక్సెస్ కావాలని చిరంజీవి చెప్పగానే ఫ్యాన్స్ నుంచి మంచి స్పందన కనిపించింది.




శృతి హాసన్ ను భయపెట్టారు

శృతి హాసన్ ను భయపెట్టారు

హీరోయిన్ శృతి హాసన్ గురించి చిరంజీవి ఆసక్తి కర వ్యాఖ్యలు చేసారు. శృతి హాసన్ సినిమా కోసం కష్టపడ్డారని ప్రశంసించారు. వాల్తేరు ప్రీ రిలీజ్ ఈవెంట్ కు రావాల్సి ఉన్నా.. ఒంట్లో నలత కారణంగా రాలేదని చెప్పారు. తనకు శృతి హాసన్ పంపిన మెసేజ్ లో ఆరోగ్యం బాగోలేదని.. కరోనా కాకుండా బాగుండంటూ సందేశం పంపారని చిరంజీవి వివరించారు. శృతి హాసన్ ఒంగోలులో వీరి సింహారెడ్డి ప్రీ రిలీజ్ ఈవెంట్ కు హాజరయ్యారు. అయితే, శృతి హాసన్ ఒంగోలులో ఏం తిన్నదో ఏంటో అంటూ..ఒంగోలులో ఎవరు భయపెట్టారో అని నవ్వుతూ వ్యాఖ్యానించారు. హైదరాబాద్ నుంచి విశాఖలో ఈవెంట్ కోసం బయల్దేరే సమయం లో వేదిక మార్పు అనేది అక్కడి పరిస్థితులకు అనుగుణంగా అధికారులు తీసుకుంటారని మెగాస్టార్ చెప్పుకొచ్చారు.

Source link

Spread the love

Leave a Comment