సీఎం జగన్ – చంద్రబాబుకు జూ ఎన్టీఆర్ ట్వీట్ వైరల్..!!
థాంక్యూ సీఎం సార్

ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటు పాటకు అంర్జాతీయ స్థాయిలో గుర్తింపు దక్కింది. ప్రతిష్ఠాత్మక గోల్డన్ అవార్డును సొంతం చేసుకుంది. ఈ పాట వెనుక ఆర్ఆర్ఆర్ టీం కష్టం చాలా ఉంది. తెలుగు సినిమా పాటకు ఈ అవార్డు రావటంతో ఏపీ ముఖ్యమంత్రి జగన్ స్పందించారు. సినిమా హీరోలు జూనియర్ ఎన్టీఆర్ – రాం చరణ్ తో పాటుగా రాజమౌళి – కీరవాణి సహా మొత్తం టీంను సీఎం జగన్ అభినందించారు. తెలుగు ఖ్యాతి ప్రపంచానికి చాటారని అభినందించారు. ఆర్ఆర్ఆర్ సాధించిన ఈ విజయం గర్వకారణమని పేర్కొన్నారు. దీనికి స్పందించిన జూనియర్ ఎన్టీఆర్ థాంక్యూ సార్ అంటూ రిప్లై ఇచ్చారు. అదే విధంగా హీరో రాం చరణ్ కూడా ముఖ్యమంత్రి జగన్ కు ధన్యవాదాలు చెబుతూ ట్వీట్ చేసారు.

థాంక్యూ సో మచ్‌ మావయ్యా

గోల్డెన్‌ గ్లోబ్‌ అవార్డు సాధించిన ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ టీమ్‌ను టీడీపీ అధినేత చంద్రబాబు అభినందించారు. ఎక్కడా జూనియర్ ఎన్టీఆర్ పేరు ప్రత్యేకంగా ప్రస్తావించ లేదు. మొత్తంగా ఆర్ఆర్ఆర్ టీంను ప్రశంసించారు. టీం కృషిని చూసి గర్వపడుతున్నట్లు పేర్కొన్నారు. తెలుగువారు సాఫ్ట్‌ పవర్‌లో భారతదేశ వాణిగా రూపుదిద్దుకొన్నారని పేర్కొంటూ తాను గతంలో చెప్పిన అంశాన్ని ప్రస్తావించారు. దీనికి జూనియర్ ఎన్టీఆర్ స్పందించారు. చంద్రబాబు ట్వీట్ కు ప్రతిస్పందనగా ‘థాంక్యూ సో మచ్‌ మావయ్యా’ అంటూ బదులిచ్చారు. ఇప్పుడు సీఎం జగన్ ..టీడీపీ అధినేత చంద్రబాబు ప్రశంసలకు ధన్యవాదాలు చెబుతూ జూనియర్ ఎన్టీఆర్ స్పందిస్తూ చేసిన ట్వీట్లు వైరల్ అవుతున్నాయి.
పొలిటికల్ – సినీ వర్గాల్లో తారక్ ట్వీట్ వైరల్

ఇప్పుడు సీఎం జగన్ – చంద్రబాబు అభినందనలకు తారక్ స్పందిస్తూ చేసిన ట్వీట్లు వైరల్ గా మారాయి. సోషల్ మీడియాలో నాటు నాటు సాంగ్ కు అవార్డు ట్రెండ్ అవుతోంది. ఇక అవార్డు వేడుకలోనూ రాం చరణ్ – జానియర్ ఎన్టీఆర్ లుక్ ఫొటోలు వైరల్ అవుతున్నాయి. రాజకీయాలకు పూర్తిగా దూరంగా ఉంటున్న జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు పూర్తిగా సినిమాలపైనే ఫోకస్ చేసారు. రానున్న ఎన్నికల్లో టీడీపీ కోసం జూనియర్ ఎన్టీఆర్ ప్రచారం చేస్తారంటూ కొంత కాలంగా ఒక వాదన వినిపిస్తోంది. ఈ సమయంలో జూనియర్ ఎన్టీఆర్ ట్వీట్లు వైరల్ అవుతున్నాయి.

Source link

Spread the love

Leave a Comment