హైదరాబాద్ లో సర్జికల్ స్ట్రైక్.. కేసీఆర్ ను టార్గెట్ చేసి బండి సంజయ్ సంచలనం




అధికారం పోతుందంటే కేసీఆర్ ఏమైనా చేస్తారు: బండి సంజయ్

అధికారం పోతుందంటే కెసిఆర్ రాష్ట్రంలో పి ఎఫ్ ఐ లాంటి సంస్థలను రాజకీయంగా వాడుకునే అవకాశం ఉందని, ఉగ్రవాదులకు అడ్డాగా తెలంగాణా మారిందని బండి సంజయ్ ఆరోపించారు. నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ సోదాలు చేస్తేనే తెలంగాణ రాష్ట్రంలో 11 మంది ఉగ్రవాదులు పట్టుబడ్డారు అని బండి సంజయ్ పేర్కొన్నారు. శాంతిభద్రతల సమస్యలు సృష్టించి బిజెపిని బద్నాం చేసే అవకాశం ఉందని బండి సంజయ్ ఆరోపించారు.

ఖైరతాబాద్ నియోజకవర్గ అసెంబ్లీ పోలింగ్ బూత్ సమ్మేళనంలో బండి సంజయ్ పాల్గొని సంచలన ఆరోపణలు చేశారు.

 హైదరాబాద్ లో సర్జికల్ స్ట్రైక్ ఎందుకు చెయ్యకూడదు

హైదరాబాద్ లో సర్జికల్ స్ట్రైక్ ఎందుకు చెయ్యకూడదు

హైదరాబాద్లో సర్జికల్ స్ట్రైక్ చేస్తామంటే మత విద్వేషాలు రెచ్చగొడుతున్నారని, హైదరాబాద్ లో ఎందుకు సర్జికల్ స్ట్రైక్ చేయకూడదో చెప్పాలని బండి సంజయ్ ప్రశ్నించారు. హైదరాబాద్ ఎవరి జాగిర్ కాదంటూ ధ్వజమెత్తిన బండి సంజయ్ మళ్లీ పక్కాగా అంటాం .. సర్జికల్ స్ట్రైక్ చేస్తామని పేర్కొన్నారు.

హైదరాబాద్లో వీసా లేకుండా, కనీసం పాస్పోర్ట్ లేకుండా వచ్చి జీవిస్తున్నారని, సంఘవిద్రోహ శక్తుల మీద బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత పక్కాగా సర్జికల్ స్ట్రైక్ చేసి తీరుతామని బండి సంజయ్ వ్యాఖ్యానించారు.

ఇచ్చిన హామీలు నెరవేర్చలేని తెలంగాణ సీఎం కేసీఆర్

ఇచ్చిన హామీలు నెరవేర్చలేని తెలంగాణ సీఎం కేసీఆర్

తాము మతాలకు వ్యతిరేకంగా మాట్లాడడం లేదని పేర్కొన్న బండి సంజయ్, హైదరాబాద్ లో ప్రశాంత జీవితాన్ని నాశనం చేయడానికి ఎవరైనా ప్రయత్నం చేస్తే సహించేది లేదని తేల్చి చెప్పారు. తెలంగాణతో బీఆర్ఎస్ పార్టీకి బంధం తెగిపోయిందని, కెసిఆర్ నుండి తెలంగాణ తల్లి బంధ విముక్తురాలు అయిందని బండి సంజయ్ వ్యాఖ్యలు చేశారు.

ఇచ్చిన హామీలు నెరవేర్చలేని తెలంగాణ సీఎం కేసీఆర్ బిజెపి భయానికి తెలంగాణ నుండి పారిపోయాడు అంటూ ఎద్దేవా చేశారు. ఆంధ్ర ప్రదేశ్ నుండి కొంతమంది టిడిపి, కాంగ్రెస్ వారిని బీఆర్ఎస్ లో చేర్చుకుంటున్నారు అంటూ బండి సంజయ్ ఎద్దేవా చేశారు.

చిట్టీల కంపెనీలు బోర్డు తిప్పేసినట్టు, టిఆర్ఎస్ పేరును బిఆర్ఎస్ గా తిప్పి కెసిఆర్ డ్రామాలు

చిట్టీల కంపెనీలు బోర్డు తిప్పేసినట్టు, టిఆర్ఎస్ పేరును బిఆర్ఎస్ గా తిప్పి కెసిఆర్ డ్రామాలు

కెసిఆర్ బీఆర్ఎస్ పార్టీ పేరుతో దేశం మొత్తం తిరగడానికి సిద్ధం అవుతున్నాడని పేర్కొన్న బండి సంజయ్ చిట్టీల కంపెనీలు బోర్డు తిప్పేసినట్టు, టిఆర్ఎస్ పేరును బి ఆర్ ఎస్ గా తిప్పి కెసిఆర్ డ్రామాలు ఆడుతున్నారని మండిపడ్డారు. హైదరాబాద్ అభివృద్ధి కేంద్రం ఇచ్చిన నిధులతోనే జరుగుతుందని పేర్కొన్న ఆయన, నేను కేటీఆర్ ను విమర్శలు చేస్తున్నానని, విమర్శలు చేయకూడదని హైకోర్టు నుండి ఆర్డర్ తెచ్చుకున్నాడని కేటీఆర్ ను ఎద్దేవా చేశారు. మొత్తంగా బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన సర్జికల్ స్ట్రైక్ వ్యాఖ్యలు ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఆసక్తికరంగా మారాయి.

Source link

Spread the love

Leave a Comment