40 ఏళ్ల నుంచి చిరకాల ప్రత్యర్థుల సమరం




సుదీర్ఘకాలంగా కొనసాగుతున్న వైరం

సుదీర్ఘకాలంగా కొనసాగుతున్న వైరం

చిత్తూరు జిల్లాలో తెలుగుదేశం అధినేత చంద్రబాబు, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిల మధ్య రాజకీయ వైరం సుదీర్ఘకాలంగా కొనసాగుతోంది. నాలుగు దశాబ్దాల నుంచి వీరి మధ్య రాజకీయ వైరం ఉందంటే ఆశ్చర్యం అనిపించక మానదు. ఒకరిపై మరొకరు పైచేయి సాధించేందుకు ఎత్తుకు పై ఎత్తులు వేస్తుంటారు. ఒకసారి చంద్రబాబు పైచేయి సాధిస్తే మరోసారి పెద్దిరెడ్డి పై చేయి సాధించేవారు. ఇన్ని సంవత్సరాల్లో ఇద్దరి మధ్య సఖ్యత కుదిర్చే రాజకీయమే జరగలేదేంటే వీరిద్దరూ ఎంతటి ప్రత్యర్థులుగా ఉన్నారో అర్థం చేసుకోవచ్చు.

కుప్పంలో బాబును ఓడించాలని..

కుప్పంలో బాబును ఓడించాలని..

గత ఎన్నికల్లో వైసీపీ తరఫున ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 14 నియోజకవర్గాలకు 13 నియోజకవర్గాలను వైసీపీ గెలుచుకోవడం పెద్దిరెడ్డి కీలకపాత్ర పోషించారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఎలాగైనా కుప్పం నియోజకవర్గంలో పాగా వేయాలని ప్రయత్నాలు చేస్తున్నారు. స్థానికంగా బలమైన నాయకులను పార్టీలో చేర్చుకొని స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం సాధించగలిగారు. కుప్పంలో చంద్రబాబును ఓడించాలని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పుంగనూరులో పెద్దిరెడ్డిని ఓడించాలని చంద్రబాబు పావులు కదుపుతున్నారు.




పుంగనూరులో పెద్దిరెడ్డిని ఓడించాలని..

పుంగనూరులో పెద్దిరెడ్డిని ఓడించాలని..

కుప్పంలో రోజురోజు బలోపేతమయ్యే కార్యక్రమాలకు చంద్రబాబు శ్రీకారం చుడుతున్నారు. తాజాగా జరిపిన పర్యటన కూడా బాబుకు మైలేజ్ పెరిగేలా చేసింది. కుప్పంలో తనను ఓడించాలని చూస్తున్న వైసీపీని రాయలసీమలోనే ఓడించాలని, అలాగే మంత్రి పెద్దిరెడ్డిన పుంగనూరులో ఓడించాలనే కసితో చంద్రబాబు పనిచేస్తున్నారు. పెద్దిరెడ్డికి చెక్ పెట్టడానికి పుంగనూరు పుడింగి కథ తేలుస్తానంటున్నారు. జీవో నెంబరు 1 ద్వారా చంద్రబాబు రోడ్ షోలకు పోలీసులు అనుమతి నిరాకరించడంతో నియోజకవర్గంలో మూడురోజులపాటు పాదయాత్ర జరిపారు. పెద్దిరెడ్డి డైరక్షన్‌లో పోలీసులు పనిచేస్తూ.. తనని అడ్డుకుంటున్నారని, పుంగనూరు పుడింగి కథ ఏంటో తేలుస్తా? అంటూ చంద్రబాబు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. పెద్దిరెడ్డి పుంగనూరులో ఎలా గెలుస్తారో చూస్తానని, పుంగనూరులో పెద్దిరెడ్డి గెలిచినా, కుప్పంలో తనని ఓడించినా రాజకీయ సన్యాసం తీసుకుంటానని బాబు సవాల్ చేశారు. బాబును ఓడించి తీరతామని పెద్దిరెడ్డి సవాల్ విసిరారు. ఈ పరస్పర సవాళ్లలో ఎవరు నెగ్గుతారో? ఎవరు ఓటమిపాలవుతారో ఎన్నికల తర్వాతే తేలనుంది.

Source link

Spread the love

Leave a Comment