
విస్తరణ వ్యూహం..
దేశంలో అతిపెద్ద విమానయాన సంస్థగా ఎదిగే క్రమంలో కంపెనీ భారీ విస్తరణకు ప్లాన్ చేసింది. ఇందుకోసం బోయింగ్, ఎయిర్ బస్ సంస్థలకు పెద్ద ఆర్డర్లను అందించింది. వారి నుంచి దాదాపు 200 ఎయిర్ క్రాఫ్ట్ లను కొనుగోలు చేయనున్నట్లు తెలుస్తోంది.

రుణాల రీఫైనాన్సింగ్..
ఎయిరిండియా దేశీయ దిగ్గజ ప్రభుత్వ బ్యాంకులైన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ బరోడా నుంచి సుమారు రూ.18,000 కోట్ల రుణాన్ని పొందాలని యోచిస్తోంది. ఈ మెుత్తాన్ని ప్రస్తుతం కంపెనీకి ఉన్న అప్పుల స్వల్పకాల రీఫైనాన్సింగ్ కోసం వినియోగించాలని టాటాలు నిర్ణయించినట్లు తెలుస్తోంది. దీర్ఘకాలిక రుణ వ్యూహాన్ని ఖరారు చేసే వరకు ఈ చర్యలు ఉపయోగపడతాయని నివేదిక పేర్కొంది.

విస్తరణతో పాటు..
టాటాలు ఎయిర్ ఇండియాను కొనుగోలు చేసిన తర్వాత ముందుగా ఫోకస్ పెట్టింది దాని పనితీరును మెరుగుపరచటంపైనే. ఆన్-టైమ్ పనితీరును మెరుగుపరచడానికి, విమాన వ్యవధి ఆధారంగా భోజనం, సేవా స్థాయిలను ప్రామాణీకరించడానికి ఖాళీలను పూరించింది. దీనికి తోడు ఆపరేటింగ్ ఎఫీషియన్సీని పెంచేందుకు విమానయానంలోని తన అన్ని కంపెనీలను ఏకతాటిపైకి తెచ్చి ఒకటే సంస్థగా మార్చాలని నిర్ణయించింది. దీని వల్ల టాటాలకు ఖర్చులు సైతం తగ్గుతాయి.