ఏటీఎం కేంద్రాల్లో డబ్బులు
బెంగళూరు నగరంలోని చిన్నమ్మ లేఅవుట్ లో రాజేష్ మేస్తా అలియాస్ రాజేష్ అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. ఏటీఎం కేంద్రాల్లో నిల్వ చెయ్యాలన్సి డబ్బుతో రాజేష్ పరార్ కావవడంతో నిందితుడి కోసం బెంగళూరు పోలీసులు గాలిస్తున్నారు. ఇటీవల బెంగళూరులోని కోరమంగళ ప్రాంతంలోని ఏటీఎం యూనిట్లలో నిల్వ చెయ్యాల్సిన డబ్బు తీసుకెళ్లిన రాజేష్ పరారయ్యాడని పోలీసు అధికారులు తెలిపారు.

నమ్మకంగా ఉద్యోగం చేశాడు
కర్ణాటకలోని ఉత్తర కన్నడ జిల్లా హొన్నావర్ తాలూకాకు చెందిన రాజేష్ మేస్తా బెంగళూరు చేరుకుని ఇక్కడి సెక్యూర్ వాల్యూ ఇండియా లిమిటెడ్ ఏజెన్సీలో ఏడాదిన్నరగా పనిచేస్తున్నాడు. ఈ ఏజెన్సీ వివిధ బ్యాంకుల నుండి డబ్బు వసూలు చేసి తరువాత ఆ బ్యాంకుల ఏటీఎం యూనిట్లలో నింపడానికి ఒప్పందం కుదుర్చుకుంది. వివిధ బ్యాంకు శాఖల నుండి డబ్బు వసూలు చేయడానికి మరియు ప్రతి రోజు ఏటీఎం యూనిట్లలో నింపే బాధ్యతను ఆ ఏజెన్సీ సంస్థ రాజేష్ కు అప్పగించింది.

ఉద్యోగానికి నామం పెట్టి, ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ?
గత ఏడాది డిసెంబరు నెల 28వ తేదీ నుంచి బీటీఎం లేఅవుట్, బన్నెరఘట్ట రోడ్డు, కోరమంగళ బ్రాంచ్ లకు ఇన్‌ఛార్జ్‌గా ఉన్న రాజేష్ ఫిబ్రవరి ఒకటవ తేదీ నుంచి పై అధికారులు ఎవరికీ సమాచారం ఇవ్వకుండా హఠాత్తుగా ఉద్యోగానికి వెళ్లడం మానేశాడు. ఏజెన్సీ అధికారులకు అనుమానం వచ్చింది. ఏజెన్సీ అధికారులు నిందితుడు రాజేష్ మొబైల్‌కు కాల్ చేయగా ఆ ఫోన్ నెంబర్ స్విచ్ఛాఫ్ అయింది. ఎన్నిసార్లు ఫోన్లు చేసినా రాజేష్ ఫోన్ నెంబర్ పని చెయ్యకపోవడంతో ఏజెన్సీ అధికారులు హడలిపోయారు.

రూ. కోటి రూపాయలు గోల్ మాల్
దీంతో ఏజెన్పీ అధికారులకు అనుమానం వచ్చి రాజేష్ ఇంటి దగ్గరకు వెళ్లి చూశారు. రాజేష్ ఇళ్లు ఖాళీ చేసుకుని వెళ్లిపోయాడని వెలుగు చూడటంతో ఏజెన్సీ అధికారులు బిత్తరపోయారు. రాజేష్ ఇంతకాలం ఇన్ చార్జీగా ఉన్న సెక్టార్‌లోని ఏటీఎంల నగదు వివరాలను ఆడిట్ చేయగా భారీ మొత్తంలో తేడాలు కనిపించాయి. ఏటీఎం సెంటర్లలో జమ కావాల్సిన రూ. 1.03 కోట్ల డబ్బును రాజేష్ పక్కదారి పట్టించినట్లు వెలుగులోకి వచ్చింది.

క్లైమాక్స్ లో భార్యతో జంప్ అయితే ఆ కిక్కేవేరప్ప
ఈ విషయమై సెక్యూర్ వాల్యూ ఇండియా ఏజెన్సీ మడివాళ శాఖ డిప్యూటీ మేనేజర్ ఎస్‌ఏ. రాఘవేంద్ర మడివాళ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారని పోలీసు అధికారులు వివరించారు. ఏటీఎం కేంద్రాల్లో జమ చెయ్యాల్సిన కోటిరూపాయల డబ్బు లూటీ చేసిన రాజేష్ అతని భార్యతో కలిసి బెంగళూరు వదిలి పారిపోయాడని, అతని కోసం గాలిస్తున్నామని పోలీసు అధికారులు తెలిపారు.