Budget 2023: పన్ను శ్లాబులపై వేతనజీవుల ఆశలు.. నిర్మలమ్మ ప్రసంగంలో ప్లేస్ దొరుకుతుందా..?




ద్రవ్యోల్బణం..

ద్రవ్యోల్బణం..

ఇప్పటికే వంటింటి ఖర్చులు ద్రవ్యోల్బణంతో పెరిగాయి. గ్యాస్ సబ్సిడీ తొలగింపు నుంచి నూనెలు, కూరగాయలు, ధాన్యాలు ఆకరికి బియ్యం ధరలు కూడా పెరిగి జేజుపై భారాన్ని మోపాయి. ఈ సమయంలో కొంత ఊరట కోసం ప్రజలు ఎదురుచూస్తున్నారు. కనీసం పన్నుల భారాన్ని తగ్గించాలని ఆశగా ఎదురుచూస్తున్నారు.

బడ్జెట్ 2023..

బడ్జెట్ 2023..

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈసారి బడ్జెట్లో అందరూ కోరుకుంటున్న ప్రధాన అంశం టాక్స్ శ్లాబ్ రేట్లలో మార్పులు. అవును మారుతున్న కాలం, పెరుగుతున్న ఖర్చులు, టైమ్ వ్యాల్యూ ఆఫ్ మనీ వంటివి పరిగణలోకి తీసుకుంటే రూపాయి విలువ క్షీణించిందని చెప్పుకోక తప్పదు. ఈ తరుణంలో కనీసం రూ.5 లక్షల వరకు సంపాదించే ఆదాయంపై ఆదాయపు పన్ను ఉండకూడదని సామాన్యులు బలంగా కోరుకుంటున్నారు. ఒకప్పుడు వచ్చే రూ.3 లక్షల ఆదాయం నేటి ఖర్చులకు అన్వయించుకుంటే రూ.5 లక్షల కంటే ఎక్కువ అవసరం ఉంది. పైగా ఇది దేశప్రజల న్యాయబద్ధమైన కోరిక అని చాలా మంది భావిస్తున్నారు.




గతంలో పన్ను రేట్లు..

గతంలో పన్ను రేట్లు..

ఇప్పటి వరకు ఉన్న ఆదాయపు పన్ను చట్టాల ప్రకారం ఎవరైన వ్యక్తి ఆదాయం ఏడాదికి రూ.2.50 లక్షలకు లోపు ఉన్నట్లయితే ఎలాంటి టాక్స్ చెల్లించాల్సిన అవసరం ఉండదు. ఆపై వచ్చే ఆదాయానికి మాత్రమే రిటర్న్స్ దాఖలు చేయాల్సి ఉంటుంది. అయితే ఈ పరిమితిని రూ.5 లక్షలకు పొడిగించాలని చాలా మంది కోరుతున్నారు. దేశంలోని పలు రాజకీయ పార్టీలు, ఆర్థికవేత్తలు కూడా ఇది అవసరమని చెప్పడంతో నోటిఫికేషన్ తప్పనిసరి అవుతుందని భావిస్తున్నారు.

టాక్స్ డిడక్షన్స్..

టాక్స్ డిడక్షన్స్..

టాక్స్ రిటర్న్స్ దాఖలు చేసేటప్పుడు పన్ను పరిధిలోకి వచ్చే వారు తాము చెల్లించిన టాక్స్ మెుత్తంలో కొన్ని రాయితీలను పొందవచ్చు. వీటినే డిడక్షన్స్ అంటారు. మనలో చాలా మందికి తెలిసింది సెక్షస్- 80 డిడక్షన్స్. దీని కింద పిల్లల విద్యా ఫీజులు, లోన్లకు చెల్లించే వడ్డీ, పెట్టుబడులకు, ఇన్సూరెన్స్ చెల్లింపులు వంటి అనేక వాటి కింద రాయితీలు లభిస్తాయి. ఇదంతా పాత టాక్స్ చట్టం ప్రకారం, అయితే కొత్తగా తెచ్చిన చట్టం ప్రకారం ఒక్కో స్థాయి వరకు సింగిల్ రేటు టాక్స్ ఉంటుంది. కొత్త విధానం ప్రకారం వారికి ఎలాంటి డిడక్షన్స్ లభించవు. భవిష్యత్తులో కేంద్రం కొత్త విధానాన్ని తప్పనిసరి చేసే ప్రమాదమూ ఉందని చాలా మంది భావిస్తున్నారు. కానీ.. ప్రస్తుతానికైతే పన్ను చెల్లింపుదారులకు వీటిలో ఎంపిక చేసుకునే వెసులుబాటు ఉంది.




ప్రజల డిమాండ్..

ప్రజల డిమాండ్..

ఇప్పుడున్న పరిస్థితుల్లో రూ.5 లక్షల వరకు సంపాదించే ఆదాయానికి 100 శాతం పన్ను మినహాయింపు కావాలని దేశ ప్రజలు బలంగా కోరుకుంటున్నారు. ఇది ప్రజల చేతిలో డబ్బును పెంచి పరోక్షంగా మార్కెట్లో డిమాండ్ మెరుగుపడేందుకు దోహదపడుతుంది. మాంద్యం భయాలతో ఆర్థిక వ్యవస్థ మందగించిన వేళ దేశ ఆర్థికానికి కూడా ఈ నిర్ణయం మంచిదేనని చాలా మంది అంటున్నారు. అందుకే ఇప్పుడు అందరి చూపు ఫిబ్రవరి 1న కేంద్రం ప్రవేశపెట్టే వార్షిక బడ్జెట్ పైనే ఉంది.

Source link

Spread the love

Leave a Comment