ఐపీవో వివరాలు..
ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్నది Anlon Technology Solutions Limited కంపెనీ ఐపీవో గురించే. కరోనా తర్వాత రిటైల్ ఇన్వెస్టర్లు మార్కెట్లకు చాలా కీలకంగా మారారు. ఈ క్రమంలో ఐపీవోలో షేర్ల కోసం చాలా సార్లు పాల్గొంటున్నారు. ఎందుకంటే లిస్టింగ్ సమయంలో మంచి లాభాలను ఆర్జించవచ్చనేది వారి ప్లాన్. అలాంటి వారికి SME విభాగంలో కొత్తగా లిస్ట్ అయిన అన్లాన్ టెక్నాలజీ సొల్యూషన్స్ లిమిటెడ్ షేర్ మెుదటి రోజే మంచి రాడిని అందించింది.

తొలిరోజే దూకుడు..
అన్లాన్ టెక్నాలజీ సొల్యూషన్స్ స్టాక్ ప్రస్తుతం ఎన్ఎస్ఈలో దాదాపుగా రూ.251 వద్ద ట్రేడ్ అవుతోంది. ఇది కంపెనీ ఇష్యూ సమయంలో ప్రకటించిన రేటు కంటే దాదాపుగా 150 శాతం అధికం. కంపెనీ ఐపీవో ప్రైస్ బ్యాండ్ ను రూ.90-100గా నిర్ణయించింది. దీంతో ఇన్వెస్టర్లు మెుదటి రోజే ధనవంతులయ్యారు. అంటే ఎవరైనా ఈ కంపెనీ షేర్లలో రూ.లక్ష పెట్టుబడి పెట్టినట్లయితే వారికి లిస్టింగ్ తర్వాత రూ.1.50 లక్షల వరకు లాభం వచ్చి ఉండేది.

అత్యధిక లాభం..
స్టాక్ లిస్టింగ్ సమయంలో అత్యధికంగా 163 శాతం మేర లాభపడింది. అలా కంపెనీ షేర్లు తొలిరోజు దూకుడుగా రూ.263.65 స్థాయికి చేరుకున్నాయి. అయితే లిస్టింగ్ సమయంలో మాత్రం షేర్ రూ.251.10 వద్ద తన ప్రయాణాన్ని మెుదలు పెట్టింది. కంపెనీ ఐపీవో క్వాలిఫైడ్ ఇన్‌స్టిట్యూషన్ కొనుగోలుదారుల విభాగంలో 54 సార్లు, NIIల ద్వారా 883 సార్లు, రిటైల్ పోర్షన్ 447 సార్లు సబ్ స్క్రైబ్ అయ్యింది. కంపెనీ షేర్లు గ్రే మార్కెట్లో కూడా మంచి రేటు పలికాయి.

కంపెనీ వ్యాపారం..
ATS కంపెనీ ముంబై కేంద్రంగా తన వ్యాపారాన్ని కొనసాగిస్తోంది. దీనికి దిల్లీ, బెంగళూరులతో పాటు మరిన్ని చోట్ల ఆఫీసులు కూడా ఉన్నాయి. కంపెనీ విమానయానం, పెట్రో కెమికల్స్, రిఫైనరీస్, ట్రాన్స్ పోర్ట్, ఎనర్జీ, మైనింగ్ వంటి కీలక వ్యాపారాల్లో ఉండే కంపెనీలకు టెక్నికల్ సొల్యూషన్స్ అందిస్తుంది. ఈ రంగాల్లోని కంపెనీలు వినియోగించే వివిధ యంత్రాలకు అవసరమైన నాణ్యమైన స్పేర్ పార్ట్స్, యాక్సిసరీస్ వంటి వాటిని అందిస్తుంటుంది. అలా హై ఎండ్ ఇన్ఫాస్ట్రక్చర్ కంపెనీల్లోని మెషిన్ల జీవితకాలాన్ని కాపాడేందుకు అవసరమైన సాంకేతిక సేవలను అందిస్తోంది.