మీరు బుల్డోజర్ బాబా అంటకదా ?
బుల్డోజర్లు చట్టాన్ని అమలు చేయడానికి ఉపయోగించినట్లుగానే శాంతి మరియు అభివృద్ధికి సంకేతంగా ఉంటాయని ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ అన్నారు. యోగి ఆదిత్యనాథ్ ను ఉత్తరప్రదేశ్ లోని ప్రతిపక్షాలు బుల్డోజర్ బాబా అని పిలుస్తున్నారు. బుల్డోజర్ బాబా’ ట్యాగ్ గురించి మీడియా అడిగినప్పుడు యోగి ఆదిత్యనాథ్ ఆయన స్టైల్లో సమాధానం ఇచ్చారు.

ట్యాగ్ ది ఏముందిలే
ప్రజలు చట్టాలను ఉల్లంఘిస్తే, శాంతి భద్రతలను నెలకొల్పడానికి చర్య తీసుకోవడానికి బుల్డోజర్లను ఉపయోగిస్తామని, నేరస్తుల ఆస్తులను కూల్చివేయడానికి ఉపయోగిస్తామని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ అన్నారు. అందుకే యూపీలోని ప్రతపక్షాలు యోగి ఆదిత్యనాథ్ కు బుల్డోజర్ బాబా అనే లేబుల్ తగిలించి ఆయన మీద విమర్శిలు చెయ్యడానికి ఆ పదాన్ని ఉపయోగిస్తున్నారు. అయితే సాధారణ ప్రజలకు అభద్రతా భావాన్ని సృష్టించే వారిపై కఠిన వైఖరిని సూచించడానికి యోగి ఆదిత్యనాథ్ బుల్డోజర్ అస్త్రం ప్రయోగిస్తున్నారని ఆయన మద్దతుదారులు సమర్థించారు. ప్రతిపక్షాలు సీఎంకు తగిలించిన ట్యాగ్ ది ఏముందిలే అంటూ బీజేపీ నాయకులు కొట్టి పారేస్తున్నారు.

ముంబాయి అంటే ముంబాయి అంతే
ఉత్తరప్రదేశ్ లో ఫిల్మ్ సిటీని ఏర్పాటు చేయాలనే ఆలోచన ముంబై నుండి ఫిల్మ్ సిటీని తరలించడమేనా అని మీడియా ప్రశ్నిస్తే యోగి ఆదిత్యనాథ్ దిమ్మతిరిగిపోయే సమాధానం ఇచ్చారు. ఫిబ్రవరి 10 నుండి 12 వరకు లక్నోలో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్ 2023కి ముందు దేశీయ పెట్టుబడిదారులను ఆకర్షించడానికి రెండు రోజుల పర్యటనలో భాగంగా యోగి ఆదిత్యనాథ్ ముంబాయి చేరుకున్న సందర్బంలో ఆయనకు ఇలాంటి ప్రశ్నలు ఎదరైనాయి, ముంబాయి అంటే ముంబాయి అంతే, ముంబాయి ఆర్థిక భూమి (దేశ ఆర్థిక రాజధాని) అని, ఉత్తరప్రదేశ్ ధర్మభూమి అని యోగి ఆదిత్యనాథ్ మహారాష్ట్ర నాయకులకు దిమ్మతిరిగిపోయే సమాధానం ఇచ్చారు.

ఎందుకు అంత లోల్లి చెప్పండి
ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం సొంతంగా ఫిల్మ్ సిటీని ఏర్పాటు చేయడం ద్వారా చిత్ర పరిశ్రమను ముంబాయి నుండి బయటకు తీసుకెళ్లడానికి ప్రయత్నిస్తోందని మహారాష్ట్రలోని మహా వికాస్ అఘాడి చేసిన ఆరోపణలపై మీడియా అడిగిన ప్రశ్నకు యోగీ అధిత్యనాథ్ పై విధంగా సమాధానం ఇచ్చారు. మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలు అందమైన సంగమం అని అన్నారు. ముంబాయిలో ఫిల్మ్ సిటీని తీసేయాలని మేము కోరడం లేదు, మేము సొంతంగా మా రాష్ట్రంలో ఫిల్మ్ సిటీ నిర్మిస్తున్నాం అంతే అని యోగీ ఆదిత్యనాథ్ అన్నారు.

వాళ్లు వస్తామంటే మేము వద్దంటామా ?
ముంబాయిలోని కొన్ని టాప్ స్టూడియోలు ఉత్తరప్రదేశ్ వచ్చేందుకు ఆసక్తిని కనబరిచాయని యోగీ ఆదిత్యనాథ్ అన్నారు. పెట్టుబడుదారులు మేము మీ రాష్ట్రానికి వస్తామంటే మేము వద్దంటామా చెప్పండి అని యోగి ఆదిత్యనాథ్ మహారాష్ట్రలోని కొన్ని నాయకులకు చరకులు అంటించారు, ఉత్తరప్రదేశ్ లో 1,200 ఎకరాల్లో ఫిల్మ్ సిటీ ఏర్పాటుకు రంగం సిద్దం అయ్యింది. గోరేగావ్ ప్రాంతంలోనే 520 ఎకరాల్ల ఫిల్మ్ సిటీ నిర్మించడానికి ఉత్తరప్రదేశ్ లోని యోగి ఆదిత్యనాథ్ పెట్టుబడుదారులను ఆకర్షించడానికి పక్లాప్లాన్ వేసుకుంటున్నది. ఉత్తరప్రదేశ్ ను మరింత అభివృద్ధి చేస్తామని యోగీ ఆదిత్యనాథ్ ధీమా వ్యక్తం చేశారు. ఉత్తరప్రదేశ్ లో ఇప్పటి వరకు అన్ని మతాలకు చెందిన 1, 2 లక్షల లౌడ్ స్పీకర్లు తొలంగించామని, సౌండ్ తగ్గిపోవడంతో ప్రజలు ప్రశాంతంగా ఉన్నారని యోగి ఆదిత్యనాథ్ చెప్పారు.