contractor: కాంట్రాక్టర్ ను దారుణంగా చంపిన కార్మికుడు, నేపాల్ బార్డర్ కు పారిపోయి, అసలు మ్యాటర్ !




బెంగళూరులో కాంట్రాక్టర్

బెంగళూరులో కాంట్రాక్టర్

పశ్చిమ బెంగాల్‌కు చెందిన ప్రియానాథ్ (29) అనే నిందితుడు డిసెంబర్ 18వ తేదీన బెంగళూరులోని యలహంక సమీపంలోని కెంచెనహళ్లిలోని ప్రకృతి లేఅవుట్ నిర్మాణంలో ఉన్న భవనంలో పశ్చిమ బెంగాల్‌కు చెందిన ఐనాల్ హక్ (30) అనే కాంట్రాక్టర్‌పై ఇనుప రాడ్‌తో దాడి చేసి చంపేశాడు. హత్య చేసిన ప్రియానాథ్ బెంగళూరు నుంచి తప్పించుకుని నేపాల్ సరిహద్దులో తలదాచుకున్నారు. ఇన్ని రోజులు ప్రియానాథ్ కోసం ప్రత్యేక ఆపరేషన్ నిర్వహించిన పోలీులు నిందితుడిని అరెస్టు చేసి శనివారం బెంగళూరు బయలుదేరారు.

ఏం జరిగిందంటే ?

ఏం జరిగిందంటే ?

పశ్చిమ బెంగాల్‌కు చెందిన ఐనాల్ హక్ అనే కాంట్రాక్టర్ బెంగళూరు చేరుకుని నగరంలోని నిర్మాణంలో ఉన్న భవనాల్లో ప్లాస్టరింగ్ పనులు కాంట్రాక్ట్‌ తీసుకుని కార్మికులు, మేస్త్రీలను పెట్టుకుని పని చేయిస్తున్నాడు. హక్ పశ్చిమ బెంగాల్ నుండి కార్మికులను బెంగళూరు పిలిపించాడు. కెంచెనహళ్లిలోని ప్రకృతి లేఅవుట్‌కు చెందిన భూమి వెంచర్‌ డెవలపర్స్‌ నిర్మించిన అపార్ట్‌మెంట్‌లో ప్లాస్టరింగ్‌ కాంట్రాక్ట్‌ తీసుకున్న హక్ అక్కడే పనులు చేయిస్తున్నాడు.




కాంట్రాక్టర్ దగ్గర పని

కాంట్రాక్టర్ దగ్గర పని

హక్ దగ్గర ప్రియానాథ్‌తో సహా పలువురు కార్మికులను ప్లాస్టరింగ్ పని చేస్తున్నారు. ఐనాల్ హక్ అనే కాంట్రాక్టర్ డిసెంబర్ 18న రాత్రి 10 గంటల ప్రాంతంలో కార్మికుల షెడ్డు వద్దకు వచ్చి కార్మికులతో మాట్లాడుతున్నాడు. ఈ సమయంలో ప్రియానాథ్ ఈరోజు నా డబ్బులు మొత్తం ఇవ్వాలని ఐనాల్ హక్ తో గొడవపడ్డాడు. ఈరోజు డబ్బులు లేవనని, ఆదివారం డబ్బులు ఇస్తానని ఐనాల్ హక్ అతని దగ్గర పని చేస్తున్న ప్రియానాథ్ కు చెప్పాడు.

ఇనుప రాడ్ కాంట్రాక్టర్ ను కొట్టి చంపేశాడు

ఇనుప రాడ్ కాంట్రాక్టర్ ను కొట్టి చంపేశాడు

డబ్బులు ఇవ్వడానికి నిరాకరించిన కాంట్రాక్టర్ ఐనాల్ హక్ తల మీద ఇష్టం వచ్చినట్లు ఇనుప రాడ్ తో దాడిచేన ప్రియానాథ్ తప్పించుకుని పరారైనాడు. తలపై నాలుగైదు సార్లు దాడి చెయ్యడంతో తీవ్రంగా గాయపడిన ఐనాల్ హక్‌ను ఆసుపత్రికి తరలించగా చికిత్స విఫలమై డిసెంబర్ 19న మృతి చెందాడు.




భయంతో నేపాల్ బార్డర్ వెళ్లిపోయాడు

భయంతో నేపాల్ బార్డర్ వెళ్లిపోయాడు

ఐనాల్ హక్ హత్య తర్వాత నిందితుడు ప్రియనాథ్ తన మొబైల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి పశ్చిమ బెంగాల్ లోని తన స్వగ్రామం కూచ్ బెహార్ కు వెళ్లాడు. కొద్దిరోజుల తర్వాత నేపాల్ సరిహద్దులోని డార్జిలింగ్ వెళ్లాడు. పోలీసులకు పట్టుబడతారేమోనన్న భయంతో అజ్ఞాతంలోకి వెళ్లాడు. పక్కా సమాచారం ఆధారంగా యలహంక పోలీసులు నేపాల్ సరిహద్దుకు వెళ్లి నిందితుడు ప్రియానాథ్ ను అరెస్ట్ చేసి నగరానికి తీసుకొచ్చారు.

Source link

Spread the love

Leave a Comment