Crime News: ప్రేమ ఒకరితో.. న్యూడ్ కాల్స్ మరొకరితో.. సూసైడ్ చేసుకున్న ఇంజినీరంగ్ విద్యార్థి..




సూసైడ్ నోటు

సూసైడ్ నోటు

ఆమె తప్పుడు ప్రేమతో తాను పిచ్చివాడయ్యానని.. జీవితంపై విరక్తి చెందానని చెప్పి సూసైడ్ నోటు కూడా రాశాడు. ఈ ఘటన విజయవాడలో జరిగింది. తాను ఓ యువతిని ప్రేమించి మోసపోయానని లేఖలో పేర్కొన్నాడు. ఆ యువతి చేతిలో తనలా మోసపోయిన వారికి న్యాయం చేయవాలని సూసైడ్ లేఖలో పేర్కొన్నాడు.

నగ్నంగా వీడియో కాల్స్‌

నగ్నంగా వీడియో కాల్స్‌

ఆమె టైమ్‌పాస్‌ ప్రేమ వల్ల పిచ్చోడినయ్యా.. నాపై ప్రేమ నటిస్తూ ఓ లెక్చరర్‌తో నగ్నంగా వీడియో కాల్స్‌ మాట్లాడుతోంది. అబ్బాయిలు మోసం చేస్తే హైలైట్‌ చేస్తారు. అదే అమ్మాయిలు చేస్తున్న మోసాన్ని సమాజం ఎందుకు ప్రశ్నించదు అంటూ లేఖలో ప్రశ్నించాడు. ఆమె తనతో ప్రేమలో ఉన్నట్లు నటిస్తోందని.. పెళ్లయిన లెక్చరర్ తో రిలేషన్ షిప్ కొనసాగిస్తోందని లేఖలో పేర్కొన్నాడు. రాత్రి వేళల్లో ఆమె వేరొకరితో వీడియో కాల్స్ చేసిందని ఆరోపించాడు.




కృష్ణలంక

కృష్ణలంక

కృష్ణలంకకు చెందిన అబ్దుల్‌ సలాం(19) కానూరులోని ఓ ఇంజినీరింగ్‌ కళాశాలలో బీటెక్‌ మూడో సంవత్సరం చదువుతున్నాడు. అదే కళాశాలలో చదువుతున్న విద్యార్థిని తనను ప్రేమించినట్లు నటిస్తూ మోసం చేయడంతో జీవితంపై విరక్తి చెందాడు. రాత్రి వన్‌టౌన్‌ నైజాం గేటు సెంటర్ సమీపంలో రైలు కింద తలపెట్టి ఆత్మహత్య చేసుకున్నాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేస్తున్నారు.

Source link

Spread the love

Leave a Comment