Crypto: క్రిప్టో కరెన్సీ ఓ జూదమన్న ఆర్బీఐ గవర్నర్…




నియంత్రణకు ముప్పు:

నియంత్రణకు ముప్పు:

దేశంలోకి క్రిప్టో కరెన్సీని అనుమతిస్తే లావాదేవీల పర్యవేక్షణపై ఆర్‌బీఐ నియంత్రణను కోల్పోయే అవకాశం ఉందని ముంబైలో జరిగిన ఓ కార్యక్రమంలో శక్తికాంత దాస్ వెల్లడించారు. వాటికి ఎలాంటి అండర్‌లైన్ ఆస్తులు లేవని, కేలవం ఓ మార్పిడి సాధనంగా ఊహలకు మాత్రమే పరిమితమని వ్యాఖ్యానించారు.

మొదటినుంచి వ్యతిరేకమే...

మొదటినుంచి వ్యతిరేకమే…

మొదటినుంచి క్రిప్టోకరెన్సీలకు రిజర్వ్ బ్యాంకు వ్యతిరేకంగానే ఉంది. వాటి నిషేధానికి బహిరంగంగానే పిలుపునిచ్చింది. దేశంలో క్రిప్టో ఆస్తుల చట్టబద్ధతపై ఇప్పటికీ ప్రభుత్వం సరైన నిర్ణయం తీసుకోలేదు. ‘క్రిప్టో లావాదేవీల వల్ల ఆర్థిక వ్యవస్థలో లిక్విడిటీని నిర్ణయించడం సవాలుగా మారుతుంది. ఎఫ్‌టీఎక్స్‌ వైఫల్యం, గత రెండేళ్లలో క్రిప్టోమార్కెట్‌ను పోల్చి చూస్తే వాటి పరిస్థితి అర్థం చేసుకోవచ్చు’ అని ఆర్బీఐ గవర్నర్ వ్యాఖ్యానించారు.




చట్టబద్దం కాదు:

చట్టబద్దం కాదు:

వర్చువల్ కరెన్సీల వినియోగానికి వ్యతిరేకంగా 2013లో ఆర్బీఐ ఓ సర్క్యులర్‌ జారీ చేసింది. క్రిప్టోకరెన్సీ ట్రేడింగ్‌కు దూరంగా ఉండాలని వ్యాపారులను హెచ్చరించింది. వాటితో పొంచి ఉన్న నష్టాల గురించి వివరించింది. వర్చువల్ కరెన్సీలు చట్టబద్ధం కాదని ఆర్‌బీఐ, ఆర్థిక శాఖ 2017లో తేల్చి చెప్పాయి. వాటిపై నిషేధం విధించాలని సైతం ఆలోచనలు చేశాయి.

Source link

Spread the love

Leave a Comment