Dharmana Prasadarao : ఈసారి పోటీ చేయనని చెప్పేశా- జగన్ ఒప్పుకోవట్లేదు- ధర్మాన కామెంట్స్




ఏపీలో నిత్యం తన సంచలన వ్యాఖ్యలతో తరచూ వార్తల్లో నిలుస్తున్న రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు మరోసారి దాదాపు అలాంటి వ్యాఖ్యలు చేశారు. అయితే అది ఇతరుల గురించి కాకుండా తన గురించే కావడం విశేషం. వచ్చే ఎన్నికల్లో తన పోటీకి సంబంధించి ధర్మాన కీలక వ్యాఖ్యలు చేశారు.

వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధంగా లేనని రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు వెల్లడించారు. ఈ విషయాన్ని సీఎం జగన్ కు కూడా స్వయంగా చెప్పేసినట్లు ధర్మాన తెలిపారు. తాను విశ్రాంతి తీసుకోవాల్సిన సమయం వచ్చేసిందని భావించే ఈ నిర్ణయం తీసుకుంటన్నట్లు కూడా చెప్పానన్నారు. అయితే జగన్ ఇందుకు ఒప్పుకోవడం లేదని ధర్మాన పేర్కొన్నారు. ఈ ఒక్క ఎన్నికల్లో పోటీ చేయమని జగన్ తనను కోరినట్లు ధర్మాన వెల్లడించారు. అయితే దీనిపై నిర్ణయం తీసుకోవడానికి ఇంకా చాలా టైం ఉందని తెలిపారు.




తన పోటీపై క్లారిటీ ఇచ్చిన ధర్మాన ప్రసాదరావు.. ఇందుకు గల మరో కారణాన్ని కూడా వెల్లడించారు. తనతో పాటు పనిచేసిన నేతలు కూడా ఎదగాలని కోరుకుంటున్నానని, తర్వాత తరానికి నాయకుల్ని తయారు చేసి సమాజానికి అందించాలని, దాని కోసం చిత్తశుద్దితో పనిచేస్తానని ధర్మాన వెల్లడించారు. ధర్మాన స్ధానంలో ఆయన కుమారుడు రామ్ మనోహర్ నాయుడిని పోటీ చేయించేందుకు ధర్మాన ప్రయత్నిస్తున్న నేపథ్యంలో జగన్ అందుకు అవకాశం ఇవ్వడం లేదనే ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ధర్మాన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

Source link

Spread the love

Leave a Comment