Flight Tickets: విమాన టిక్కెట్లపై 14 శాతం డిస్కౌంట్..! ట్రావెల్ కి మీరు రెడీనా..? పూర్తి వివరాలు




టిక్కెట్లపై రాయితీ..

టిక్కెట్లపై రాయితీ..

కొత్త సంవత్సరంలో విమాన ప్రయాణాలు చేయాలనుకునే వారికి ఇది శుభవార్తే. అదేంటంటే.. రాయితీతో కూడిన విమాన టిక్కెట్లను కొనుగోలు చేసేందుకు చాలా మంది ప్రయత్నిస్తుంటారు. అలాంటి వారికి పేటీఎం సంస్థ ఒక సదవకాశాన్ని అందిస్తోంది. అలా Paytmలో విమాన టిక్కెట్లను బుక్ చేసుకోవడంపై 14% తక్షణ తగ్గింపును పొందవచ్చు. పైగా ఈ తగ్గింపును అన్ని దేశీయ రూట్లలో కంపెనీ అందుబాటులో ఉంచింది.

ఎవరికి అవకాశం..

ఎవరికి అవకాశం..

ఎవరైనా తొలిసారిగా Paytmలో తమ మొదటి విమాన టిక్కెట్‌ను బుక్ చేసుకునే కస్టమర్లకు మాత్రమే ఈ తగ్గింపు అందుబాటులో ఉంటుందని వెల్లడించింది. మొదటిసారిగా తమ ప్లాట్‌ఫారమ్‌లో ఫ్లైట్ టిక్కెట్లను బుక్ చేసుకునే వినియోగదారులకు మాత్రమే ఈ తగ్గింపు లభిస్తుందని తెలిపింది. అర్హత కలిగిన కస్టమర్లు.. దేశీయ రూట్లలో టిక్కెట్లను బుక్ చేసుకోవడంపై 14% తక్షణ తగ్గింపును పొందుతారని స్పష్టం చేసింది. ఈ రూపంలో గరిష్ఠందా రూ.1000 తగ్గింపు లభిస్తుందని కంపెనీ వెల్లడించింది. అయితే దీనికి ఎలాంటి కనీస బుక్కింగ్ ఆర్డర్ విలువను నిర్ధేశించలేదు.




ఏఏ విమానాలపై తగ్గింపులంటే..

ఏఏ విమానాలపై తగ్గింపులంటే..

డిజిటల్ చెల్లింపుల సంస్థ పేటీఎం అందించిన వివరాల ప్రకారం.. Vistara, Spicejet, Air Asia, GoFirst, Indigo, Air Indiaతో సహా అన్ని ప్రధాన విమానయాన సంస్థల బుకింగ్‌లపై ఈ తగ్గింపు అందుబాటులో ఉంది. ఈ బుకింగ్‌తో క్యాన్సిలేషన్ ప్రొటెక్షన్‌కు హామీ కూడా ఉందని కంపెనీ చెబుతోంది. అంటే ఎవరైనా తమ టిక్కెట్ రద్దు చేసుకున్నట్లయితే వారికి 100 శాతం డబ్బు వాపసు ఇవ్వబడుతోందని కంపెనీ వెల్లడించింది. విమాన టిక్కెట్ కొనుగోలుకు Paytm UPI, Paytm వాలెట్, డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్, నెట్‌బ్యాంకింగ్, ఇతర మార్గాల ద్వారా చెల్లింపు చేసుకోవచ్చని తెలుస్తోంది. Paytm అంతర్జాతీయ ఎయిర్ ట్రాన్స్‌పోర్ట్ అసోసియేషన్ (IATA) గుర్తింపు పొందిన ట్రావెల్ ఏజెంట్ కూడా కావడం గమనార్హం.

Source link

Spread the love

Leave a Comment