Free Shares: 4 నెలల కిందట వచ్చిన IPO.. ఇన్వెస్టర్లకు 11 బోనస్ షేర్లిస్తోంది.. దీనికి తోడు..




కంపెనీ రెండు పనులు..

కంపెనీ రెండు పనులు..

ఐరన్ అండ్ స్టీల్ కంపెనీ తన ఇన్వెస్టర్లకు ఒకే సారి రెండు ప్రయోజనాలను అందిస్తోంది. అవేంటంటే.. తన పెట్టుబడిదారులకు కంపెనీ బోనస్ షేర్లను అందించటంతో పాటు స్టాక్ స్పిట్ కూడా చేయనున్నట్లు ప్రకటించింది. ఇంతకీ ఇవన్నీ అందిస్తున్న కంపెనీ Rehatan TMT గురించే. కంపెనీ ప్రస్తుతం TMT బార్లు, రౌండ్ బార్లను తయారు చేసే వ్యాపారంలో ఉంది.

మార్కెట్లోకి కంపెనీ..

మార్కెట్లోకి కంపెనీ..

2022 సెప్టెంబరులో మార్కెట్లోకి వచ్చిన Rehatan TMT ఎస్ఎమ్ఈ ఐపీవో దుమ్ము దులుపుతోంది. అప్పట్లో ఒక్కో షేరును కంపెనీ రూ.70కి షేర్లను ఐపీవో సమయంలో ఇష్యూ చేసింది. కానీ ఈరోజు స్టాక్ మార్కెట్ ధర రూ.440 వద్ద కొనసాగుతోంది. అంటే స్టాక్ ఈ కాలంలో ఇన్వెస్టర్లకు 528.57 శాతం రాబడిని అందించింది. ఐపీవో సమయంలో షేర్లు పొందిన ఇన్వెస్టర్లు కేవలం నెలల కాలంలోనే మంచి రాబడిని పొందుతున్నారు. అలా లక్ష రూపాయలు ఇన్వెస్ట్ చేసిన వారికి మార్కెట్ విలువ ప్రకారం రూ.6.83 లక్షల రాబడి లభించింది.




స్టాక్ స్ప్లిట్ వివరాలు..

స్టాక్ స్ప్లిట్ వివరాలు..

Rehatan TMT కంపెనీ బోర్డు ఒక్కో ఈక్విటీ షేరును 10 షేర్లుగా విభజించాలని నిర్ణయించింది. దీనికోసం బోర్డు తన ఆమోదాన్ని తెలిపింది. ప్రస్తుతం ఒక్కో స్టాక్ ఫేస్ వ్యాల్యూ రూ.10గా ఉంది. షేర్ల స్ప్లిట్ తర్వాత ఫేస్ వ్యాల్యూ ఒక్కో షేరుకు తగ్గనుంది. మార్కెట్లో షేర్ల లిక్విడిటీని పెంచేందుకు కంపెనీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. దీని ద్వారా మరింత సరసమైన ధరకు షేర్లు అందుబాటులో ఉంటాయని.. అది ఇన్వెస్టర్లకు శుభవార్తని చెప్పుకోవాలి.

బోనస్ ఇష్యూ ఇలా..

బోనస్ ఇష్యూ ఇలా..

రికార్డు తేదీ వరకు కంపెనీ ఈక్విటీ షేర్‌హోల్డర్లు కలిగి ఉన్న ప్రతి 4 షేర్లకు 11 బోనస్ షేర్లను జారీ చేయడానికి బోర్డు ఆమోదం తెలిపింది. రికార్డు తేదీని కంపెనీ త్వరలోనే ప్రకటించనుంది. కంపెనీ రెండు ప్రకటనల తర్వాత ఇన్వెస్టర్లలో కొత్త జోష్ మెుదలైంది.




నిపుణుల అభిప్రాయం..

నిపుణుల అభిప్రాయం..

2023 ఫిబ్రవరిలో కంపెనీ వెల్లడించనున్న ఫలితాల కోసం వేచి ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. అప్పటి వరకు షేరుకు రూ.400 బలమైన మద్దతు స్థాయిగా నిలుస్తుందని వారు అభిప్రాయపడుతున్నారు. కంపెనీ షేర్లను బీఎస్ఈ ఎస్ఎమ్ఈ ప్లాట్‌ఫారమ్ నుంచి BSE, NSE లకు తరలిచంలాని కంపెనీ బోర్డు పరిగణించినట్లు తన ఫైలింగ్స్ లో కంపెనీ వెల్లడించింది.

Source link

Spread the love

Leave a Comment