
18 ఏళ్ల అమ్మాయికి బాయ్ ఫ్రెండ్
పుట్టినరోజు వేడుకలను ఘనంగా జరుపుకోవడం యువతీ యువకుల ఓ ట్రెండ్ గా మారిపోయింది. ఇప్పుడు చిన్నా, పెద్దా అని తేడా లేకుండా అందరూ పుట్టినరోజు వేడుకలను ఘనంగా జరుపుకోవాలని అనుకుంటున్నారు. బాయర్ ఫ్రెండ్ పుట్టినరోజును గ్రాండ్ గా చెయ్యాలని అనుకున్న ఆ యువతి ఆమె ఇంట్లో ఉన్న బంగారు నగలు చోరీ చేసి వాటిని తీసుకెళ్లి ప్రియుడికి ఇచ్చేసింది. ఆ బంగారు నగలు కదువపెట్టిన ప్రేమికులు గ్రాండ్ గా బర్త్ డే పార్టీ జరుపుకున్నారిని ముంబాయి అసిస్టెంట్ పోలీస్ ఆఫీసర్ నీలేష్ సోనావానే మీడియాకు చెప్పారు.

వేరే బాయ్ ఫ్రెండ్ బ్లాక్ మెయిల్ చేశాడని ?
పోలీసు అధికారుల కథనం ప్రకారం జనవరి 11 బుధవారం రోజు యువతి ఇంటిలో బంగారు నగలు చోరీ అయ్యాయని కేసు నమోదు అయ్యింది. పోలీసుల విచారణలో కిలాడీ జంట కథ వెలుగులోకి వచ్చింది. జనవరి 7వ తేదీన బాలిక కుటుంబ సభ్యులు ముంబాయిలోని కపూర్‌వాడీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. నా ప్రియుడు నన్ను అసభ్యకరమైన ఫోటోలు తీసి డబ్బు కోసం బెదిరిస్తున్నాడు. ఈ కారణంగా తన సొంత ఇంట్లో బంగారు ఆభరణాలు దొంగిలించి అతనికి ఇచ్చానని చెప్పింది.

సీసీటీవీ కెమెరాల్లో
యువతి చెప్పిన యువకుడిని పోలీసులు విచారణ చేశారు. ఆమె తనకు ఎలాంటి నగలు ఇవ్వలేదని, నాకు ఆ నగలకు ఎలాంటి సంబంధం లేదని, ఆమెను నేను బ్లాక్ మెయిల్ చెయ్యలేదని అతను చెప్పాడని పోలీసులు అన్నారు. పోలీసులు విచారించణలో ఆ యువకుడు నగలు విక్రయించలేదని తెలిసింది. షాపులోని సీసీటీవీ ఫుటేజీలోలో ఆ యువకుడు వచ్చివెళ్లినట్లు ఒక్క ఆధారం లేదని పోలీసుల విచారణలో తెలిసింది. తరువాత పోలీసులు యువతిని మరింతగా విచారించగా అసలు మ్యాటర్ బయటకు వచ్చింది.

అసలు మ్యాటర్ చెప్పిన కిలాడీ లేడీ
నా బాయ్ ఫ్రెండ్ పుట్టినరోజు ఖర్చుల కోసం ఆ నగలను తన ప్రియుడికి ఇచ్చానని ఆమె అంగీకరించింది. తనను ఎవరూ బ్లాక్ మెయిల్ చెయ్యలేదని, మిమ్మల్ని, మా కుటుంబ సభ్యులను చూసి భయపడి బ్లాక్‌మెయిల్ కథ చెప్పానని ప్రియురాలు అంగీకరించింది. బాయ్‌ఫ్రెండ్‌తో కలిసి పుట్టినరోజు జరుపుకోవాలని ఓ గెరివి షాపులో రూ.53 వేల విలువైన బంగారు నగలను విక్రయించామని యువతి, ఆమె ప్రియుడు అంగీకరించారని పోలీసులు అన్నారు. చోరీ అయిన బంగారు ఆభరణాలు కొనుగోలు చేసిన నగల వ్యాపారిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మొత్తం మీద ప్రియుడి బర్త్ డే కోసం సొంత ఇంటిలో బంగారు నగలు చోరీ చేసిన యువతికి ఇప్పుడు సినిమా కష్టాలు మొదలైనాయి.