
దెబ్బ వారికే..
ఈ ఏడాది మాంద్యం కారణంగా దెబ్బతినేది ముఖ్యంగా చిన్న దేశాలేనని ప్రపంచ బ్యాంక్ వ్యాఖ్యానించింది. అధిక ద్రవ్యోల్బణం, పేలవమైన ఆర్థిక ప్రవాహాలు, రష్యా-ఉక్రెయిన్ సంక్షోభం వంటి అనేక అంతరాల వల్ల ఈ సంవత్సరం ప్రపంచ వృద్ధి ప్రతికూలంగా ప్రభావితమవుతుందని వెల్లడించింది. ఇది మాంద్యానికి దారితీస్తుందని అంచనా వేయబడింది.

అడ్డుకోవటం ఎలా..
అనేక అత్యవసర కార్యక్రమాలు, జాతీయ-స్థాయి కార్యక్రమాలు పతనం ప్రమాదాన్ని ప్రభావితం చేస్తాయని భావిస్తున్నారు. ముఖ్యంగా రుణ సంక్షోభాన్ని తగ్గించాలని ప్రపంచ దేశాలు తమ ఆర్థిక పరిస్థితిపై దృష్టిసారించటం ప్రారంభించాయి. పెట్టుబడి వృద్ధిని ప్రోత్సహించటం ద్వారా.. అంతర్జాతీయ వృద్ధిని ప్రోత్సహించేందుకు ముమ్మర ప్రయత్నాలు జరుగుతున్నాయి.

అభివృద్ధికి మద్దతు..
ఆర్థిక నష్టాలను కొనసాగిస్తున్న దేశాలు దృష్టి పెట్టాలి. ద్రవ్యోల్బణాన్ని తగ్గించడానికి సరళంగా వ్యవహరించడం కొనసాగించాలి. ద్రవ్యోల్బణాన్ని తగ్గించేందుకు వివిధ దేశాల సెంట్రల్ బ్యాంకులు వడ్డీ రేట్లను గత కొన్ని నెలలుగా తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాయి. అయితే దీని నుంచి ప్రజలను రక్షించేందుకు ప్రభుత్వాలు అనేక రకాల ప్రయత్నాలు చేస్తున్నాయి. పైగా ఇది ఆర్థిక వృద్ధికి మద్దతునిస్తుందని నిపుణులు భావిస్తున్నారు.

IMF హెచ్చరిక..
ప్రపంచ బ్యాంక్ హెచ్చరించటానికి ముందు.. ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ మేనేజింగ్ డైరెక్టర్ క్రిస్టాలినా జార్జువా కూడా దేశాలను హెచ్చరించారు. 2023 సంవత్సరం ప్రపంచ దేశాలకు కష్టతరమైనదని అన్నారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో మూడింట ఒక వంతు దేశాలకు మాంద్యం తాకవచ్చని ఆమె హెచ్చరించారు. ఈ క్రమంలో ఇప్పటికే అమెరికా, యూరప్, చైనా వంటి పెద్ద దేశాలు నెమ్మదించింది. శ్రీలంక, పాకిస్థాన్ వంటి దేశాలు పతనంతో కొట్టుమిట్టాడుతున్నాయి.

మాంద్యం అంచున..
మాంద్యం గురించి భయపడని దేశాల్లో కూడా మిలియన్ల మంది ప్రజలు దీని బారిన పడవచ్చని ఆందోళన చెందుతున్నారు. ముఖ్యంగా యూరోపియన్ దేశాలు మాంద్యం నుంచి తప్పించుకోలేవు. పైగా ప్రపంచ పెద్దన్న అమెరికా మాంద్యం అంచున ఉందని ఐఎంఎఫ్ పేర్కొంది. ప్రస్తుతం చైనా కరోనా వైరస్ బారిన పడినందున అక్కడి ఆర్థిక వ్యవస్థపై కూడా ప్రభావం మెుదలవుతోంది.

మాంద్యం వల్ల మనకేంటి నష్టం..
మాంద్యం ముదురుతున్నకొద్దీ పెట్టుబడులు తగ్గవచ్చు. ఇన్వెస్టర్లు ఇప్పటికే పెట్టుబడి పెట్టిన తమ సొమ్మును తిరిగి వెనక్కి తీసుకోవటం ప్రారంభించారు. ఇది దేశీల కరెన్సీ విలువ క్షీణత, వాటి మారకద్రవ్యంపై కూడా ప్రభావం చూపనుంది. రుణాలపై వడ్డీ రేటు పెరుగుదల.. వస్తువుల ధరలు ఆకాశానికి చేరుకోవటం ప్రజలను అనేకరూపాల్లో ప్రభావితం చేయనుంది. మొత్తం మీద దిగువ తరగతి ప్రజలు కష్టాలు మరింతగా పెరగవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు.

భారత్ పరిస్థితి..
ఇలాంటి సవాళ్లతో కూడుకున్న పరిస్థితుల్లో భారత్ సైతం కొంత ప్రతికూలతలను ఎదుర్కోవలసి ఉంటుంది. అయితే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత ఆర్థిక వృద్ధి రేటు 7%గా ఉంటుందని నేషనల్ బ్యూరో ఆఫ్ స్టాటిస్టిక్స్ అంచనా వేసింది. మాంద్యంతో ప్రతికూల పరిస్థితులు ఉన్న తరుణంలో ఇలాంటి వృద్ధి రేటు నమోదు చేయటం కొంత మెరుగైనదేనని నిపుణులు అంటున్నారు.