Gold: చాక్లెట్ పౌడర్‍లో బంగారం పౌడర్.. ఎలా దొరికిపోయాడంటే..!




175 గ్రాముల బంగారు గొలుసులు

ఆదివారం ఎయిరిండియా విమానంలో దుబాయ్ నుంచి వచ్చిన ఓ ప్రయాణికుడిని అధికారులు తనిఖీ చేశారు. అయితే అతని నుంచి చాక్లెట్ పౌడర్ లో బంగారం పౌడర్ ను కలిపి మూడు చాక్లెట్ పౌడర్ డబ్బాలను అధికారులు పట్టుకున్నారు. ప్రయాణికుడి చెక్ ఇన్ బ్యాగేజీ నుంచి 175 గ్రాముల బంగారు గొలుసులను స్వాధీనం చేసుకున్నారు.

సాక్సుల్లో బంగారం

సాక్సుల్లో బంగారం

కొద్ది రోజుల క్రితం ఓ వ్యక్తి సాక్సుల్లో బంగారం దాచుకుని విమానంలో దుబాయ్ నుంచి వచ్చిన హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కు వచ్చాడు. అతను అనుమానాస్పదంగా కనిపించడంతో అతన్ని తనిఖీలు చేశారు.అతని వద్ద బంగారం దొరకలేదు. అయితే అతని షూ విప్పమని అడగ్గా కాస్త ఆలస్యం చేయడంతో కస్టమ్స్ అధికారులకు అనుమానం వచ్చింది. దీంతో సాక్సులను చెక్ చేయగా అతన వద్ద పుత్తడి ఉన్నట్లు గుర్తించారు. నిందితుడిని నుంచి 957 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన బంగారం విలువ సుమారు 46లక్షల 53 వేలు ఉంటుందని అధికారులు అంచనా వేశారు.

షర్ట్ లో 804 గ్రాముల బంగారం

షర్ట్ లో 804 గ్రాముల బంగారం

అంతకుముందు శంషాబాద్‌ విమానాశ్రయంలోనే హైదరాబాద్‌ కస్టమ్స్‌ అధికారులు ఓ ప్రయాణికుడి నుంచి 800 గ్రాములకు పైగా బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. మహమ్మద్ గౌస్ ఖాన్ అనే వ్యక్తి షర్ట్ లో 804 గ్రాముల బంగారం దాచి కుట్టేయించాడు. అదే షర్ట్ ధరించి దుబాయ్ నుంచి శంషాబాద్ ఎయిర్ పోర్టులో విమానం దిగాడు. అధికారులు అతన్ని చూసి అనిమానించారు. వెంటనే అతన్ని అదుపులోకి తీసుకుని తనిఖీ చేయగా బంగారం పట్టుబడింది.




కత్తెరతో

కత్తెరతో

షర్ట్ కొంచె డిఫరెంట్ గా కనిపించడంతో షర్ట్ ను కత్తెరతో కట్ చేశారు. దీంతో అందులోని బంగారం బయటపడింది.విమానం దిగిన తర్వాత తనిఖీలు చేసినా నిందితుడి వద్ద ఏమీ దొరకలేదని అధికారులు తెలిపారు. కానీ అతను అనుమానాస్పందంగా కనిపించినట్లు చెప్పారు.విదేశాల నుంచి భారత్ కొంత మొత్తం వరకే బంగారం తీసుకురావొచ్చు. భారీ మొత్తంలో బంగారం తీసుకురావాలంటే ట్యాక్స్ కట్టి తీసుకురావాల్సి ఉంటుంది.

ట్యాక్స్

ట్యాక్స్

దుబాయ్ వంటి విదేశీ మార్కెట్ల నుంచి వ్యక్తిగతంగా చాలా తక్కువ మొత్తంలో మాత్రమే ట్యాక్స్ పరిశీలన లేకుండా బంగారాన్ని తీసుకొచ్చే అనుమతి ఉంటుంది. బంగారం లేదా నగల రూపంలో మాత్రమే ఈ బంగారం లేదా వెండిని కొనుగోలు చేయాల్సి ఉంటుందట. నగల రూపంలో మినహా ఇతర ఏవిధమైన రూపాల్లోనూ బంగారం లేదా వెండిని భారత్‌లోకి దిగుమతి చేయడానికి అనుమతి లేదు.




Source link

Spread the love

Leave a Comment