News
బంగారం ధరలతో పసిడిప్రియులు బెంబేలు . బంగారం.. ఈ పేరు చెప్తే మహిళల కళ్ళు ఒక్కసారిగా తళుక్కుమంటాయి. బంగారం కొనిస్తామంటే చాలు ఫుల్ సంతోషంలో మహిళలు మునిగి తేలుతారు. అంతగా మహిళలకు బంగారానికి అనుబంధం పెనవేసుకొని ఉంది. భారతదేశంలో దాదాపుగా ప్రజలంతా బంగారం కొనుగోలుకు ఎక్కువ మొగ్గు చూపుతారు. భారతదేశ ప్రజలకు బంగారం అంటే ఒక ఎమోషన్ .
తమ వాళ్ళపై ఉన్న ప్రేమను వ్యక్తం చెయ్యటానికి బంగారం గిఫ్ట్ గా ఇస్తారు. అటువంటి బంగారం ధరలు ఇటీవల కాలంలో విపరీతంగా పెరుగుతున్నాయి. అంతర్జాతీయ ప్రతికూల పరిస్థితుల నేపథ్యంలో బంగారం ధరలలో భారీగా హెచ్చుతగ్గులు చోటుచేసుకుంటున్నాయి. ఇప్పటికే బంగారం ధరలు రెండేళ్ల గరిష్ట స్థాయికి చేరుకుని పసిడి ప్రియులకు షాక్ ఇస్తున్నాయి.
నేడు హైదరాబాద్ లో బంగారం ధరలిలా
ఇక తాజాగా బంగారం ధరల విషయానికి వస్తే నిన్న పెరిగిన బంగారం ధరలు నేడు స్థిరంగా కొనసాగుతున్నాయి. ఇక వెండి కూడా నిన్న ఆల్ టైం హై కి చేరుకోగా, నేడు అదే ధర కొనసాగుతుంది. హైదరాబాద్లో బంగారం ధరల విషయానికొస్తే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారు 55,000గా ప్రస్తుతం ట్రేడ్ అవుతుంటే, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం 60,000 రూపాయలుగా కొనసాగుతుంది.
తెలుగు రాష్ట్రాల్లో ధరలిలా
హైదరాబాద్ లోనే కాదు తెలంగాణా రాష్ట్రంలోని వరంగల్, నిజామాబాద్, ఖమ్మం లలోనూ 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 55,000 రూపాయలుగా, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 60 వేల రూపాయలు ధర కొనసాగుతుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కడప, కర్నూలు, రాజమండ్రి, కాకినాడ, గుంటూరు లలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 55,000గా కొనసాగుతుంటే, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 60 వేల రూపాయలుగా ట్రేడ్ అవుతుంది.
ఢిల్లీ, బెంగళూరు, ముంబైలలో ధరలిలా
దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 55 వేల 150 రూపాయలుగా ట్రేడ్ అవుతుంటే, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 60, 150 రూపాయలుగా విక్రయించబడుతుంది. ఇక బెంగళూరులో ప్రస్తుతం 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 55,050 రూపాయలు కొనసాగుతుంటే, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర ప్రస్తుతం బెంగళూరులో 60 వేల 50 రూపాయలుగా ట్రేడ్ అవుతుంది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 55,000గా, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 60 వేలుగా కొనసాగుతుంది.
కర్ణాటక రాష్ట్రంలో 17కిలోల బంగారం పట్టివేత
ఇదిలా ఉంటే కర్ణాటక రాష్ట్రంలోని చిక్కమగళూరులో ఒక లాజిస్టిక్ వాహనంలో 6.4 కోట్ల రూపాయల విలువ చేసే 17 కిలోల బంగారాన్ని పోలీసులు పట్టుకున్నారు. చిక్కమగళూరు లోని ట్రైకెరే లోని ఎంసీ హళ్లి చెక్ పోస్ట్ వద్ద రవాణా చేసే సీక్వెల్ లాజిస్టిక్స్ కు చెందిన వాహనంలో 17 కిలోల విలువైన బంగారం పట్టుబడింది. ఎటువంటి పత్రాలు లేకుండా బంగారాన్ని తరలిస్తున్నట్టు గుర్తించిన పోలీస్ అధికారులు ఆ బంగారాన్ని స్వాధీనం చేసుకొని తరికెరె పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు.