
దేశీయ మార్కెట్ లో బంగారం ధరలిలా
పెరుగుతున్న బంగారం ధరలతో పసిడి ప్రియులు కొనుగోలుపై ఆందోళనలో ఉన్నారు. బంగారంతో పాటు వెండి ధరలు కూడా పెరగడం సామాన్యులకు షాక్ ఇస్తుంది. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు పెరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఈరోజు దేశీయ మార్కెట్లో బంగారం ధరల విషయానికి వస్తే భారతదేశంలో ఈరోజు 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం నేడు ధర 52 వేల 10 రూపాయలుగా ఉంది. నిన్న కూడా బంగారం ధర 52 వేల పది రూపాయల వద్దే కొనసాగింది. ఇక 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 56,740గా ప్రస్తుతం ట్రేడ్ అవుతుంది. హైదరాబాద్లో బంగారం ధరల విషయానికి వస్తే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 52 వేల పది రూపాయలుగా ఉంది. 24 క్యారెట్ల10 గ్రాముల బంగారం ధర రూ. 56,740గా ఉంది.

ఢిల్లీలో బాగా పెరిగిన బంగారం ధరలు
రాజధాని ఢిల్లీలో ఈరోజు బంగారం ధరల విషయానికి వస్తే, ఢిల్లీలో బంగారం ధర హైదరాబాద్ లో ధర కంటే కాస్త ఎక్కువగానే ఉంది. ఢిల్లీలో ఈరోజు బంగారం ధర 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారానికి 52 వేల 160 రూపాయలుగా ఉంది. అలాగే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారానికి 56,990 రూపాయలుగా ప్రస్తుతం బంగారం ధర ట్రేడ్ అవుతోంది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో ఈరోజు బంగారం ధరల విషయానికి వస్తే ముంబైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 52 వేల పది రూపాయలుగా ఉంది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 56,740గా ఉంది. నిన్న కూడా ఇవే ధరలు కొనసాగాయి.

త్వరలోనే 60 వేలకు చేరుకోనున్న బంగారం
అయితే ఈ సంవత్సరం బంగారం ధరలు విపరీతంగా పెరుగుతాయని, త్వరలోనే బంగారం ధర 60 వేల రూపాయలకు చేరుకుంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. అంతర్జాతీయంగా ప్రతికూల పరిస్థితుల నేపథ్యంలో బంగారం ధరలు పెరుగుతాయని చెబుతున్నారు. ప్రతి సంవత్సరం సంక్రాంతి పండుగకు విపరీతంగా బంగారాన్ని కొనుగోలు చేసేవారు, ఈసారి ధరల దూకుడుతో కొనుగోలు విషయంలో కాస్త వెనుకంజ వేసినట్టు కనిపిస్తుంది. ఇప్పటికే బంగారం ధర రెండేళ్ల గరిష్టానికి తాకి సామాన్యులకు చుక్కలు చూపిస్తుంది. ప్రస్తుతం అంతర్జాతీయంగా స్పాట్ గోల్డ్ రేట్ ఔన్సు కి 1900 డాలర్లకు చేరుకున్న పరిస్థితి ఆందోళన కలిగిస్తుంది.