Home Minister: హోమ్ మంత్రి ఇంటి ముందు డ్యూటీలో ఉన్న పోలీసు ఏం చేశాడంటే ?, దెబ్బకు !




హోమ్ మంత్రి ఇంటి దగ్గర డ్యూటీ

హోమ్ మంత్రి ఇంటి దగ్గర డ్యూటీ

ఆర్మ్‌డ్‌ రిజర్వ్‌ ఫోర్స్‌కు చెందిన ఓ కానిస్టేబుల్‌ కర్ణాటక హోంమంత్రి ఇంటి ముందు ఆత్మహత్య చేసుకోవాలని ప్రయత్నించిన సంఘటన కలకలం రేపింది. బెంగళూరు నగరంలోని హెగ్డే నగర్‌లో నివాసం ఉంటున్న నవీన్‌ కుమార్‌ అలియాస్ నవీన్ (25) అనే యవకుడు ఆత్మహత్య చేసుకోవాలని ప్రయత్నించి బెంగళూరులోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.

అక్కడే ఆత్మహత్య చేసుకోవాలని ?

అక్కడే ఆత్మహత్య చేసుకోవాలని ?

బెంగళూరులోని జయమహల్ రోడ్డులో కర్ణాటక హోమ్ మంత్రి ఆరగ జ్ఞానేంద్ర ప్రభుత్వ అధికారిక నివాసం ఉంది. హోమ్ మంత్రి ఇంటి దగ్గర నవీన్ కుమార్ భద్రతా విధుల్లో ఉంటున్నాడు. విధుల్లో ఉన్న నవీన్ కుమార్ హోమ్ మంత్రి ఇంటి ముందే ఆత్మహత్యాయత్నం చెయ్యడం కలకలం రేపింది. ఈ విషయం కర్ణాటకలో కలకలం రేపింది.




ఉదయం ఇంటి ముందే ఎందుకు చేశాడు ?

ఉదయం ఇంటి ముందే ఎందుకు చేశాడు ?

ఉదయం 9.45 గంటల ప్రాంతంలో నవీన్ హోమ్ మంత్రి ఇంటి ముందు ఉన్నాడు. ఆ సమయంలో ఒక్కసారిగా నవీన్ అతని ఎడమ చేయ్యి కోసుకుని కుప్పకూలిపోయాడు. సాటి పోలీసులు వెంటనే విషయం గుర్తించి నవీన్ ను సమీపంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. కానిస్టేబుల్‌ నవీన్ కు చికిత్సకు సహకరిస్తున్నాడని, అతను ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడని అధికారులు అంటున్నారు.

 గతంలో కూడా ఆత్మహత్యాయత్నం

గతంలో కూడా ఆత్మహత్యాయత్నం

కర్ణాటకలోని తుమకూరు జిల్లా కుణిగల్ తాలూకా కెంపనహళ్లి గ్రామానికి చెందిన నవీన్ 2020లో సిటీ ఆర్మ్‌డ్ రిజర్వ్ (సీఏఆర్) కానిస్టేబుల్ గా ఉద్యోగంలో చేరాడు. ప్ర‌సుతం బెంగళూరు నార్త్ డివిజ‌న్ సీఏఆర్‌లో నవీన్ ఉంటున్నాడు. కొంతకాలంగా కర్ణాటక హోమ్ మంత్రి ఇంటి సెక్యూరిటీకి కేటాయించిన బ్యాచ్ లో నవీన్ కూడా ఉన్నాడ. వ్యక్తిగత కారణాలతో మనస్థాపానికి గురైన నవీన్ గతంలో కూడా రెండు, మూడు సార్లు ఆత్మహత్యకు ప్రయత్నించాడని, హోమ్ మంత్రి ఇంటి ముందు కూడా అలాగే చేశాడని పోలీసు అధికారులు అంటున్నారు.




 ప్రతిపక్షాల చేతికి భలే చిక్కారు

ప్రతిపక్షాల చేతికి భలే చిక్కారు

అయితే బెంగళూరులోని జేసీ నగర్ పోలీస్ స్టేషన్‌లో నవీన్ మీద కేసు నమోదు అయ్యింది. నవీన్ ఎందుకు ఆత్మహత్యాయత్నం చేశాడు ? అని కేసు విచారణలో ఉందని పోలీసు అధికారులు అంటున్నారు. నిత్యం వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్న కర్ణాటక హోమ్ మంత్రి ఇంటి దగ్గర ఓ పోలీసు ఆత్మహత్యాయత్నం చెయ్యడంతో ప్రతిపక్షాలకు ఓ అస్త్రం చిక్కినట్లు అయ్యిందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

Source link

Spread the love

Leave a Comment